హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / మానవులలో బట్టతల ఏర్పడుటకు కారణం ఏమిటి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మానవులలో బట్టతల ఏర్పడుటకు కారణం ఏమిటి?

బట్టతల ఏర్పడడానికి గల కారణాలు, నివారించే పద్దతుల గురించి తెలుసుకుందాం.

manబట్టతలకు సంబంధించి అనేక సిద్ధాంతాలు వున్నవి. కొంతమంది బట్టతలను రాబోయే ముసలితనానికి గుర్తుగా భావిస్తారు. కొంతమంది బట్టతల గల వ్యక్తులు తెలివిగల వాళ్ళుగా భావిస్తారు. బట్టతల ధనవంతులకు చిహ్నంగా భావించేవారు లేకపోలేదు. కొంతమంది మాత్రం బట్టతల గల వాళ్ళని మూర్ఖులుగా భావిస్తారు. ఏదేమైనప్పటికి జుట్టు రాలిపోవుట వలన మనిషి తన సహజమైన అందాన్ని కోల్పోతాడు.

బట్టతల (అలోపీనియా) రెండు రకాలు : 1) శాశ్వతమైన బట్టతల 2) తాత్కాలికమైన బట్టతల. శాశ్వతమైన బట్టతలకు ముఖ్యమైన కారణాలు అనువంశికత, వయసు, పురుష హార్మోన్ లు అయిన ఏండ్రోజెన్ లు . ఇతర కారణాలు చర్మ వ్యాధులు, గాయాలు, పుట్టుకతోనే రోమాలు ఉత్పత్తి లేకపోవడం, భౌతిక, రసాయనిక కారకాల వలన రోమ మూలాలు గాయపడడం మొదలైనవి.

తాత్కాలిక బట్టతలకు కారణాలు తీవ్రమైన జ్వరం, టైపాయిడ్, న్యుమోనియా, ఇన్ ఫ్లుయెంజా వంటి వ్యాధులు. బలహీనత వలన కూడా వెంట్రుకలు రాలిపోవచ్చు. వ్యాధుల వలనగాని, బలహీనత వలన గాని జుట్టు రాలిపోయినట్లైతే బలవర్ధకమైన ఆహారం తీసుకోవటం ద్వారా నివారించవచ్చు. X కిరణాలు, డ్రగ్స్ తీసుకోవటం. అపరిశుభ్రమైన ఆహారం. అంతస్రావీ గ్రంథుల లోపాలు కూడా తాత్కాలిక బట్టతలకు కారణమవుతాయి. సంతులిత ఆహారం తీసుకోవటం, వెంట్రుకలకు తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొంతవరకు బట్టతలను నివారించవచ్చు. ఇంతవరకు బట్టతలపై వెంట్రుకలు మొలిపించుటకు ఎలాంటి మందులు గాని, చికిత్సగాని కనుగొనబడలేదు. బట్టతల నివారణకు ప్రచార ప్రకటనలు చూసి మోసపోయి డబ్బు వృథా చేయకండి.

3.02051282051
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు