పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మాయాజలం – మాయాజాలం

మన నీటిని మనం రక్షించుకుందాం.

dec16ఆరోజు మా స్నేహితుని ఇంట్లో పెళ్ళికి వెళ్ళి భోంచేస్తున్న సమయంలో మా ప్రొఫెసర్ కలిసి నా బాగోగుల గూర్చి అడిగాడు. అక్క వడ్డించిన వంటకాలలో శాకీయ, మాంసాహార వంటకాలు ఉన్నాయి. ఎవరి ఇష్టానుసారంగా ఆ వంటకాలను తమ తమ ప్లేట్లలో కొందరు మోతాదుగా, కొందరు ఎక్కువగా, మరి కొందరు ఒక రెండవసారి మిగులదేమోనని ఇంకాస్తా ఎక్కువగా వేసుకొని భోంచేస్తున్నారు. భోజనాలు ముగుస్తున్న సమయంలో మా ప్రొఫెసర్ అతిథులు కొందరు తమ ప్లేట్లలో వసుకున్న అన్నంతో పాటు చాల కూరలను వదిలి వేయటాన్ని చూసి “వీళ్లు ఆహారం వ్యర్థం చేయడమే కాక కొన్ని లక్షల నీటిని వృధా చేస్తున్నారు. ఇక దేశం ఎలా బాగుపడుతుంది?” ఏని అనడం విన్నాను.

కాని ఇంటికి వెళ్ళిన తరువాత ప్రొఫెసర్ గారి మాటలు నా మనస్సులో ఏదో ఒక తెలియని ప్రశ్నను ఉత్పన్నం చేసినది. అదే ఆహారం వ్యర్థం కావటం వలన కొన్ని లక్షల నీరు వృధా ఎలా జరుగుతుంది? కేవలం వండిన కొంత ఆహార పదార్థాలే కదా వారు వదిలివేసినది. దానిని వండటానికి కొన్ని లీటర్ల నీరు మాత్రమే కదా వినియోగించి ఉంటారు. మరి అన్ని లక్షల నీరు వృధా ఎలా జరుగుతుంది? ప్రొఫెసర్ గారు అలా ఎందుకు అన్నారు. అని పదే పదే నా మనస్సును తొలిచి వేసింది.

dec17మూడవ రోజు చొరవ చేసుకొని ప్రొఫెసర్ గారి గదిలోకి వెళ్ళారు. అప్పుడే కాంటిన్ అబ్బాయి తెచ్చిన కాఫీ త్రాగుతూ నాకు, నా మిత్రుడు రవికి టీ ఇమ్మన్నారు. రవి టీ తాగనంటే పాలు ఇమ్మన్నాడు. నేను టీ త్రాగిన తరువాత సందేహం నివృత్తికై నేవచ్చిన కారణం తెలిపాను. అప్పుడు మా ప్రొఫెసర్ గారు “అవును రాజా, నీవు త్రాగిన టీ కి ఎన్ని నీళ్ళు అవసరం అవుతుందో చెప్పగలవా?” అని ప్రశ్నించాడు. “ఒక కప్పు కదా, బహుశా 200 – 250 మి.మీ. నీరు అవసరం అవుతుంది.” అని బదులిచ్చాను. అంతలో మా ప్రొఫెసర్ గారు చిరునవ్వు నవ్వి “మీరంత దూర దృష్టితో ఆలోచించరు. సాధారణంగా ప్రకృతితో విలీనం కాకుండా ఆలోచిస్తారు. ప్రకృతితో సహజీవనం చేస్తాం కాని అందులో కనపడే లక్షణాలను గమనించరు. నీవు తాగిన టీ కి 24 లీటర్లు, నేను త్రాగిన కప్పు కాఫీకి 140 లీటర్లు, మరి రవి త్రాగిన పాలకు గాను 201 లీటర్ల నీరు ఖర్చైనది తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా. ” అన్నాడు. “అది ఎలా సాధ్యం?” అని నేను అన్నాను. ప్రొఫెసర్ మరోమారు చిరునవ్వు నవ్వి నా సంశయాన్ని తొలిగించేందుకు వివరణ ఇచ్చారు. “నీవు తాగిన టీ కప్పులో నిజంగా 200 మి.మీ. నీరు మాత్రమే ఖర్చయినది. కాని ఈ టీ ఆకుల ఉత్పత్తికి అంటే మొలకెత్తిన టీ మొక్కలు, పెరిగి పెద్దదై, ఆకులు దాల్చి మనకు పక్వం చెందిన తేయాకుగా మారే వరకు వాడబడిన నీరు 24 లీటర్లు. అలాగే ఒక కప్పు కాఫీ తాగుతున్నప్పుడు దానికి వినియోగించే కాఫీ పౌడరు (పొడి) గింజలు నుండి తీస్తారు గదా. అంటే కాఫీ మొక్క ఎదిగి పుష్పించి, ఫలించి, విత్తనములు ఏర్పడు వరకు వినియోగించే నీరు టీ కప్పు కన్నా చాలా ఎక్కువే. లెలిసిందా? అదే మాదిరిగా పాల ఉత్పత్తికై పశువులు వాడిన నీరు కూడా అధికమే. అందుకే పాల గ్లాసు నీటి ఖర్చు కూడా అధికం. ఒక కేజీ కాఫీ గింజల ఉత్పత్తికి 21,000 లీటర్ల నీరు అర్చు అవుతుంది.” అని చెప్పగానే నాకళ్ళు చెమ్మగిల్లాయి. ఆ పెళ్ళిలో ఎందరో వ్యర్థంగా ఆహారాన్ని ప్లేట్లలో వదిలి వేస్తే ప్రొఫెసర్ గారు లక్షల లీటర్ల నీటిని వృధా చేస్తున్నారు అని ఎందుకన్నారో ఇప్పుడర్థమయింది.

మనము వాడే ప్రతీ ఉత్పత్తి (product) నీటిని వినియోగించుకోండి. కాని ఉత్పత్తి అయిన ప్రతి దానిలో ఆ నీరు కనబడదు. ఆశ్చర్యంగా ఉంటుంది. దాన్నే అదృశ్య నీరు (VIRTUAL WATER) అంటారు. ఆ నీటినే సరదాగా మాయాజలం అని పిలుచుకుందాం. అంటే ఒక ఉత్పత్తి ఏర్పడడానికి వినియోగింపబడే నీరే మాయాజలం లేదా VIRTUAL WATER

టీ మరియు కాఫీ ఉత్పత్తులకు ఖర్చైన నీటి గూర్చి తెలుసుకున్నారు కదా. మరికొన్ని ఆహార పదార్థాలు ఉత్పత్తికి వినియోగింపబడే నీటిని గూర్చి చూద్దాం.

ఆహార పదార్థము

వినియోగింపబడే నీరు

1 ఆపిల్

7 లీటర్లు

1 నారింజ

50 లీటర్లు

1 బ్రెడ్ ముక్క

40 లీటర్లు

1 కేజీ కోడి మాంసం

3900 లీటర్లు

1 కేజీ మేక మాంసం

6100 లీటర్లు

1 కేజీ పశు మాంసం

15,500 లీటర్లు

మరి మాంసానికి ఎక్కువ నీరు ఎందుకు ఖర్చవుతుంది? ఒక పశువు తన జీవిత కాలంలో కొన్ని వందల కిలోగ్రాముల గ్రాసము (గడ్డివాము, పప్పుదినుసులు, ఇతర ఆహార రదార్థాలు) తింటుంది. మొక్కలు పెరిగి, కాయలు కాసే వరకు కొన్ని వేల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంతే కాక అవి తాగే నీరు, వాటిని కడగడానికి వాడే నీరు జత చేస్తే మాంసం ఉత్పత్తికి ఎక్కువ నీరు ఖర్చు అవుతుంది.

జీవిత కాలంలో ఒక గేదే వినియోగించు నీరు (లీటర్లలో)

పశు గ్రాసము + త్రాగు నీరు + గేదె పరిశుభ్రత = మొత్తం

30,59,794 + 23,845 + 7,191 = 30,90,830

పిల్లలూ, మీరే ఆలోచించండి. ఒక ముద్ద అన్నం వృధా చేస్తే 31 లీటర్ల నీటిని వృధా చేస్తున్నట్టు. ఒక కేజీ బియ్యం ఉత్పత్తికి 31,000 లీటర్ల నీరు వినియోగించబడుతుంది. నీ చేతిలో గల ముద్ద 10 గ్రాములయితే మరి 31 లీటర్లే కదా. అందుకే మన నీటిని మనం రక్షించుకుందాం. లేని యెడల వర్షాభావ సంవత్సరములలో మనం ఎంతో బాధ పడవలసివస్తుంది. అంతే కాకుండ ప్రకృతి ప్రసాదించిన అమూల్య ఉచిత బహుమతి ఎక్కువ డబ్బులతో కొనవలసి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.

వివరణ

రచనలో ఉటంకించబడిన ఆకులు, వృక్ష సంబంధ పదార్థాలలో ఉండే పిండి పదార్థాలు కిరణజన్యసంయోగ క్రియ (photosynthesis)లో ఉపయోగించబడిన నీరేవుంది. జల వలయంలో (water cycle) ప్రత్యక్షంగా పాల్గొనే నీరులో ఎంతో భాగం తిరిగి వేగిరంగా అందుబాటులోకి వస్తుంది. ఉన్న విషయం కూడా ఈ (virtual water) లో మోతాదును నిర్ణయిస్తుంది.

ఆధారం: ఆచార్య బి. రాజ్ కుమార్

3.02139037433
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు