పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మెట్లు ఏటవాలుగా నిర్మిచుటకు కారణం ?

వైజ్ఞానిక సిద్ధాంతము

stairsతిరుమల వెళ్ళారా ? తిరుపతి నుంచి తిరుమలకు రోడ్డు చూసారు కదా! పాములాగా మెలికలు తిరుగుతూ పోతుంటుంది. ఎందుకని నేరుగా రోడ్డు వేయలేదు? గోడకు నిచ్చెన ఎందుకు ఏటవాలుగా వేస్తారు? నిటారుగా వేసుకొని ఎక్కొచ్చు కదా? వీటిలో ఇమిడి ఉన్న భౌతిక సూత్రము పని. బలమును ఉపయోగించి వస్తువు కొంతదూరము కదిల్చిన పని జరిగినది అంటాము. ఉపయోగించిన బలము, కదిలిన దురము ఒకే దిశలో లేనపుడు జరిగిన పని W=FS COS Ø

ఒకే పనిని రెండు రకాలుగా చేయవచ్చు.

  1. W=FS ( COS Ø ) అనగా ఎక్కువ బలమును ఉపయోగించి తక్కువ దూరము కదలుట ద్వారా (3x2=6).
  2. W=( FCOSØ ) S అనగా తక్కువ బలమును ఉపయోగించి ఎక్కువ దూరము కదలుట ద్వారా (2x3=6).

మనం తక్కువ బలాన్ని ఉపయోగించి పని సులభంగా చేయడానికి ఇష్టపడతాం. కనుక 2వ మార్గాన్ని ఎంచుకొన్నాం. కావున ఏటవాలుగా మెట్లు నిర్మించుకొని ఎక్కడం సులభం. సర్పిలాకారంగా తిరుగుతూ కొండపైకి పోవడం సులభం.

సినిమాలు చూస్తారు కదా ! హీరో - విలన్ ఛేజింగ్ లో, విలన్ ముందు పరుగెత్తి మెట్లెక్కి మేడపైకి వెళ్తుంటే హీరో షార్ట్ కట్లో పైపులు పట్టుకొని లేదా కిటికీలు పట్టుకొని మేడ పైకి వెళ్తుంటాడు. హీరో వెళ్ళే పద్ధతిలో ఎక్కువ బలం ఉపయోగించాలి. విలన్ వెళ్ళే పద్ధతిలో తక్కువ బలాన్ని ఉపయోగించాలి. మరి హీరో విలన్ కన్నా బలవంతుడు కదా!

2.97647058824
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు