పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రెప్ప పాటు

రెప్పపాటు అనేది కాలాన్ని కొలిచే ఒక మొరటి పధ్ధతి అని చెప్పవచ్చు.

reppaరెప్పపాటు అనే పదాలని మనం ఏదైనా ప్రమాదం గురించి మాట్లాడేటప్పుడు వాడుతుంటాం. రెప్పపాటు లో ప్రమాదం తప్పిందనో అంటుంటాం. రెప్పపాటు అనేది కాలాన్ని కొలిచే ఒక మొరటి పధ్ధతి అని చెప్పవచ్చు. అంటే కనురెప్ప ఒకసారి మూసి తియడానికి పట్టే సమయం అని . ఆది ఖచ్చితంగా ఒక క్షణం కన్నా తక్కువ సమయంలో జరుగుతుంది కాబట్టి తక్కువ సమయాన్ని సూచించేందుకు దాన్ని వాడుతుంటాం. అసలు కనురెప్పలు ఎందుకు మూసి తెరుస్తుంటాం ? మనం రోజుకి ఎన్నిసార్లు కనురెప్పలు మూసి తెరుస్తాం? చెప్పలేం కదూ !

కళ్ళు మనిషి శరీరంలోని అతి సున్నితమైన అవయవాల్లో ఒక్కటి కన్నుగుడ్డు ఒక గుండ్రటి ఎముకల గూటిలో ఇమిడి ఉంటాయి. దాదాపు అందరి కనుగుడ్డు సైజు సమానంగానే ఉంటుంది. మరి కొందరి కళ్ళు పెద్దవిగా కొందరివి చిన్నవిగా ఎందుకుంటాయి ? కనుగుడ్డు ఇమిడే గుంట పెద్దదిగా ఉంటే వాళ్ళ కళ్ళు చిన్నవిగా ఉంటాయి. కనుగుడ్డు ఇమిడే గుంట చిన్నవిగా ఉంటే వాళ్ళ కళ్ళు పెద్దవిగా ఉంటాయి. కనుగుడ్డులో దాదాపు పదోవంతు బయటకు కనిపిస్తుంటుంది. ఈ బయటకు కనించే భాగం వాతావరణ తాకిడికి లోనవుతుంటుంది. అంటే చలి, వేడి, దుమ్ము, ధూళి వెలుతురు లాంటి వాతావరణ మార్పులకు గురి అవుతుంటుంది. ఈ పది శాతం కనుగృడ్డును వాతావరణ నుంచి రక్షించుకోవడానికి కనురెప్ప మూసుకొని తెరుచుకుంటుంది. కనురెప్ప మూసినప్పుడు కంటిలో నీరు (కన్నీళ్ళు) ఈ పదిశాతం కనుగుడ్డుని శుభ్రపరిచి రక్షిస్తుంది.

సాధారణంగా మనం ఒక నిమిషానికి 15 సార్లు దాక రెప్ప వాలుస్తాం. మనిషి మనిషికి ఇందులో కొంత వ్యత్యాసం ఉండొచ్చు కానీ మనం భయపడినప్పుడు ఆందోళన చెందినపుడు నిద్రవచ్చే ముందు కనురెప్పలు ఎక్కువసార్లు కొడ్తుంటాం. ఏదైనా వాహానాన్ని నడిపెప్పుడు మనం కనురెప్పలు తక్కువసార్లు కొడుతుంటాం.

మీరు ఒక అట ఆడుకోవచ్చు. మీ స్నేహేతుడు నిమిషానికి ఎన్నిసార్లు కళ్ళు ఆర్పుతున్నాడో అతనికి తెలియకుండా లెక్కవేయండి అదే మిత్రుడు ఆందోళన (Tension) లో ఉన్నప్పుడు నిమిషానికి ఎన్నిసార్లు కళ్ళార్పుతున్నాడో లెక్కపెట్టండి. తేడా మీకే తెలుస్తుంది.

ఆధారం: సిహెచ్. ఆనంద్.

2.97321428571
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు