పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఒలింపిక్స్

ఒలంపిక్ క్రీడల గురించి తెలుసుకుందాం.

sep8నేడు క్రీడలు ధనరాసులను వర్షిస్తున్నాయి. కొన్ని కోట్ల మంది క్రీడాభిమానులు 5 ఆగష్టు నుండి 21 ఆగష్టు 2016 (17 రోజులు) 31వ ఒలింపిక్స్ క్రీడల్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా టి.వి. సెట్లకు పరిమితమయ్యారు. ఈ క్రీడలు బ్రెజిల్లో రియో డి జినరోలో జరిగాయి. 22 ఆగష్టున బాడ్మింటన్ లో తను గెల్చిన రజత పతకంలో పి.వి. సింధు హైద్రాబాద్ లో అడుగు పెట్టింది. ఆమెకు స్వాగతం పలకడానికి ముంబాయి నుండి ప్రత్యేకంగా ఒక ఓపెన్డెక్ బస్ 1600 కి.మీ. ప్రయాణం చేసి హైద్రాబాద్ చేరుకున్నది. ఈ బస్లో శంషాబాద్ విమానాశ్రయం నుండి ఆమె, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ నిలబడి ప్రజల నీరాజనాలు అందుకుంటూ గచ్చిబౌళి స్టేడియం వరకు పయనించారు. రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా నజరానాలు ప్రకటించాయి.

ఒలింపిక్స్ గ్రీకు దేశంలో ఒలింపియా గ్రామంలో జరిగాయి (క్రీ.పూ. 776) ఒకే మత విశ్వాసాలు, ఒకే భాష గల గ్రీకు ప్రజలు మాత్రమే ఇతరదేశాల్లో ఎక్కడున్నా వచ్చి ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళు. ఈ క్రీడలు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడేవి. ఇలా 12 శతాబ్దాలు (క్రీ.పూ. 776 నుండి 393 క్రీ.శ. వరకు) ఈ ప్రాచీన ఒలింపిక్ క్రీడలు నాలుగేళ్ళకొకసారి కొనసాగాయని మానవ పరిణామ శాస్త్రవేత్తలు (Anthropologists) చెప్తున్నారు.

sep9పారిస్ లోని ఒక జమీందారు పీయరీ డి క్యూబర్టిన్ తన ప్రాంతంలోని యువతీయువకులందరూ విద్యావంతులు కావాలని ఆశించాడు. ధృఢమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన వయస్సు వుంటుందని నమ్మాడు. కాబట్టి యువతీయువకులకు క్రీడల పట్ల ఆసక్తి కనిపించి తద్వారా విద్యాప్రక్రియను విస్తృతపర్చాలని భావించాడు.

ఒలింపియా శిథిలాలను సందర్శించిన తర్వాత అతడి మనస్సులో రూపుదిద్దుకున్న పథకమే ఆధునిక ఒలింపిక్ క్రీడల ఆవిర్భానికి నాంది పలికింది. అలా ఆయన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (International Olympic Commitee - IOC) ఏర్పడటానికి కారకుడయ్యాడు (1894). పారిస్ నగరంలోనే వెట్ట వేదటి ఒలింపిక్స్ జరపాలని ఆయన భావించాడు. కాని, ఈ ప్రపంచ క్రీడల పోటీలను గ్రీసులోని ఏథెన్స్ పట్టణం నుండే ఆరంభించాలని ఇతరదేశాలు సూచించాయి. ఆ విధంగా మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896లో ఏథెన్స్లో ప్రారంభించారు. నాలుగేళ్ళకొక్కసారి జరిగే ఈ క్రీడలు మొదటి ప్రపంచ యుద్ధసమయంలో (1916), తిరిగి రెండవ ప్రపంచయుద్ధ సమయంలో (1940, 1944) నిర్వహించడం సాధ్యం కాలేదు. 1908 లో మంచుమీద స్కేటింగ్, హాకీ ఆటల్ని కూడా ఒలింపిక్ క్రీడల్లో ప్రవేశపెట్టారు. 1924 నుండి ఒలింపిక్స్ని వేసవి ఒలింపిక్స్, శీతాకాల ఒలింపిక్స్ అని వేర్వేరుగా జరపాలని నిశ్చయించారు. గడ్డకట్టిన మంచు మైదానాలు కావాలంటే శీతాకాలంలోనే సాధ్యం కదా! రెండేళ్ళ ఎడంగా నాలుగేళ్ళకొక్కసారి వేసవి, శీతాకాల ఒలింపిక్స్ నిర్వహించాలని IOC నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన యువతీయువకులకు పారా ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తారు.

sep10ఈ సంవత్సరం పోటీలు లాటిన్ అమెరికా దేశాల్లో మొదటిసారిగా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం బ్రెజిలికి దక్కింది. భారతదేశం కూడా మొదటిసారి అత్యధికసంఖ్యలో ఈ పోటీలకు క్రీడాకారులు (118 మందిని పంపింది. మొత్తం 14 విభాగాల్లో పోటీపడింది. విలువిద్య (Archery), వ్యాయవామక్రీడలు (Athletics), బాడ్మింటన్, ముష్టియుద్ధం (Boxing) జుడో, సాముక్రీడలు (Gymnastics), హాకీ, పడవ పందాలు (Rowing), షూటింగ్, ఈతపోటీలు (Swimming), టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, మల్లయుద్ధం (Wrestling) విభాగాల్లో పోటీలకు మన క్రీడాకారులు అర్హత సంపాదించారు.

పతకాల పట్టికలో యునైటెడ్ స్టేట్స్ (46 బంగారు పతకాలు+ 29 వెండి పతకాలు + 29 కంచు పతకాలు =104) మొదటి స్థానంలో నిలవగా గ్రేట్ బ్రిటన్ (38 + 27 + 23 = 88) రెండవస్థానంలో, చైనా (29 + 17 + 19 = 65) మూడవ స్థానం నిలిచాయి. మనదేశం 2 పతకాలతో (1 - వెండి పతకం, 1 - కంచు పతకం) 67వ స్థానంలో నిలిచింది. 200 పైగా దేశాలు పోటీపడ్డాయి. అయితే యిప్పటివరకూ ఈ పోటీల్లో పాల్గొనని దేశాలు కూడా వున్నాయి (ఉదా: భూటాన్)

పారా ఒలంపిక్స్ లో మనదేశం 2 బంగారు పతకాలు, 1 వెండి పతకం, ఒక కాంస్య పతకం గెల్చుకుంది.

sep11ఒలింపిక్ క్రీడల గుర్తింపు చిహ్నం (logo) ఏం సూచిస్తుంది? ఇందులో 5 రింగులున్నాయి. ఈ ఐదు రింగులూ 5 ఖండాలను సూచిస్తాయి. ఉత్తర, దక్షిణ అమెరికాలను కలిపి అమెరికా ఖండం, ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఓషియానియా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దీవులు). 5 రింగులూ 5 రంగుల్లో వున్నా ఈ రంగుల్ని ఏ ఖండానికి ఆపాదించలేం.

గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన క్రీడాకారులకు ప్రత్యేకంగా "పియరీ డి క్యూబర్టిన్" పతకాన్ని యిస్తారు. ఈ పతకానికి IOC సంస్థాపకుడి పేరు పెట్టారు. ఇది కూడా స్వర్ణపతకమే కాని పోటీపడి గెల్చేది కాదు. దీన్ని 1964 నుండి యిప్పటి వరకు 17 మందికి మాత్రమే యిచ్చారు. ఎటువంటి వారికి యిస్తారో ఉదాహరణ చూద్దాం.

కార్ల్ లుడ్డింగ్ లట్ట్లాంగ్ జర్మనీకి చెందిన లాంగ్ జంప్ క్రీడాకారుడు. తనతో పోటీపడుతున్న అమెరికన్ క్రీడాకారుడు జెస్సి ఓవెన్స్ కి తన దుమకడంలో కొంత మార్పు చేసుకుంటే అతడు గెలవగలడని 1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో సలహా యిచ్చాడు. అతడి సలహాని పాటించిన జెస్సీ ఓవెన్స్ స్వర్ణపతకం గెల్చుకోగా లడ్డీ లాంగ్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన పోటీదారుకి సలహా యిచ్చి చక్కని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించినందుకు లట్ట్ లాంగ్ పియరీ డి క్యూబర్టీన్ ప్రత్యేక స్వర్ణపతకం ప్రదానం చేశారు.

2014లో సింగపూర్ కి చెందిన మైకేల్ హ్యాంగ్ కి ఒలింపిక్ క్రీడల నిర్వహణాభివృద్ధికి పాటుపడినందుకు కూడా ఈ ప్రత్యేక పతకం యిచ్చారు. ఆయన ఒక న్యాయవాది,

ప్రత్యేక అంశాలు:

  • sep12ఒలింపిక్స్ లో వరుసగా పోటీపడి అత్యధిక స్వర్ణపతకాలను మైకేల్ ఫెల్ప్ గెలుచుకున్నాడు. ఈత పోటీల్లో ఆయన మొత్తం 2004 నుండి 2016 వరకు 23 బంగారు పతకాలు, 3 వెండి పతకాలు, 2 కంచువతకాలు మొత్తం 28 పతకాలను గెల్చుకున్నాడు. మహిళల్లో లారిసా వాటినినా (సోవియట్ యూనియన్) 1956 నుండి 1964 మధ్య జిమ్నాస్టిక్స్ లో 9 + 5 + 4 = 18 పతకాలు గెల్చుకుంది.
  • 1982 మ్యూనిచ్ ఒలింపిక్స్ లో ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణల్లో 'బ్లాక్ సెప్టెంబర్' ఉగ్రవాద గ్రూప్ ఒలింపిక్ గ్రామం మీద దండెత్తి ఇజ్రాయిల్ కి చెందిన 11 మంది క్రీడాకారుల్ని, కోచ్లను ఊచకోత కోసింది. ఈ దాడిలో ఒక జర్మన్ పోలీస్ ఆఫీసర్, 5గురు ఉగ్రవాదులు వారు కూడా మరణించారు. (మొత్తం 17 మంది)
  • 1928లో అమ్ స్టర్ డామ్ ఒలింపిక్స్ లో అనూహ్యంగా 100 మీటర్ల పరుగుపందాన్ని పెర్సీ ఆల్ఫ్రైడ్ విలియమ్స్ (కెనడా) స్వర్ణపతకం గెల్చుకున్నాడు. కెనడాకు అథ్లెటిక్స్ లో అదే మొదటి పతకం. దానితో కెనడా సమర్థకులందరూ అతడున్న హెూటల్ దగ్గరకు వచ్చి ఆయన తన గదిలో నుండి బయటకు వస్తే అభినందిద్దామని ఎదురు చూస్తున్నారు. హెూటల్లో విద్యుత్ లేదు. ఆయన బయటి నుండి వచ్చి గుంపును చూసి తాను కూడా విజేతను అభినందిద్దామని గుంపులో నిలబడి ఎదురుచూస్తున్నాడు. తానే విజేతనని అతడు మర్చిపోయాడు. చాలా ఆలస్యంగా గుంపులోనివారు అతడ్ని గమనించి అతడ్ని అభినందించారట!

నిజంగా మనదేశం క్రీడల్లో అగ్రస్థానాలకు చేరాలంటే ఏం చేయాలి?

  • ప్రతి పాఠశాలలో క్రీడామైదానాలు వుండాలి. వ్యాయామ ఉపాధ్యాయులు ప్రస్తుతం అమలులో వున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉదయం 7 గం.లకు పాఠశాలకు వచ్చి బాలబాలికల్ని ఆడించాలి. 11 గంటలకు తిరిగి వెళ్ళిపోయి సాయంకాలం 4 గం.లకు రావాలి. వచ్చి పిల్లలను ఆడించాలి. ఈ విధంగా జరుగటంలేదు.
  • ప్రతి పాఠశాలలోను క్రీడా పరికరాలు వుండాలి. క్రీడామైదానాలు లేని ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం అనుమతివ్వకూడదు.
  • ప్రతి మండలంలోనూ క్రీడా స్టేడియంలు, తగిన శిక్షకులు (Coaches), ఇతర సదుపాయాలు కల్పించాలి.
  • క్రీడామైదానాలను పబ్లిక్ మీటింగ్లకు, రాజకీయ, ఆధ్యాత్మిక, కళా ప్రదర్శనా సమావేశాలకు యివ్వటం వలన క్రీడామైదానాల్లో పరుగుపందాలకు వేసిన ట్రాకులన్నీ (Tracks) నాశనం అవుతున్నాయి. కాబట్టి అటువంటి అనుమతులు అధికారులివ్వకూడదు.
  • ప్రభుత్వాలు యివన్నీ చేయకుండా గెల్చిన క్రీడాకారులకు నజరానాలు ప్రకటించి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నాయి.
  • క్రీడాకారుల జీవిత చరిత్రలను బాలబాలికలు అధ్యయనం చేయాలి. వారి కఠోర పరిశ్రమను, క్రమశిక్షణను నేటి బాలబాలికలు అలవాటు చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా గొప్ప క్రీడాకారులుగా రూపొందుతారు.

ఆధారం: పైడిముక్కల ఆనంద్ కుమార్

3.00576368876
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు