పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వై – ఫై

వై – ఫై గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

nov016.jpgవై-ఫై లేదా వైఫై అనేది స్థానికంగా పనిచేసే వైర్లెస్ టెక్నాలజీ బదిలీ చేసేందుకు లేదా అంతర్జాలం (Internet)తో అనుసంధానం అయ్యేందుకు ఈ టెక్నాలజీ వీలు కల్పిస్తుంది. ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యేందుకు 2.4 GHz (అల్లా హైఫ్రీ క్వెన్సీ), 5 GHz SHF (సూపర్ హైఫ్రీక్వెన్సీ) రేడియో తరంగాలను ఉపయోగించుకుంటుంది. వై-ఫై అనేది ఒక ట్రేడ్ మార్క్ పేరు. దీనిని 1999 ఆగస్టులో ఇంటర్ బ్రాండ్ కార్పొరేషన్ అనే సంస్థ రూపొందించింది.

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (IEEE) సంస్థ IEEE 802.11అనబడే కొన్ని నిబంధనలను రూపొందించింది. 1997లో స్థూలంగా ఈ నిబంధనలను విడుదల చేసిన తర్వాత వాటికి కొన్ని సవరణలు కూడా జరిగాయి. ఈ ప్రమాణాలు లేదా నిబంధనల మీద ఆధారపడి పనిచేసే వైర్ లెస్ లోకల్ ఏరియా నెట్ వర్క్ (WLAN) ఉత్పత్తులను వై-ఫై అంటున్నారు. కాని ప్రస్తుతం అన్ని WLAN పరికరాలు IEEE ప్రమాణాల మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి WLANకు ప్రత్యామ్నాయంగా వై-ఫైని మనం అర్థం చేసుకోవచ్చు.

మనం మన ఇళ్లలో వాడుకునే పర్సనల్ కంప్యూటర్ లు (PCs), డిజిటల్ ఆడియో ప్లేయర్లు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటర్లు, కొన్ని డిజిటల్ కెమెరాలు, వీడియోగేమ్ పరికరాలు ఇలా ఎన్నింటికో వై-ఫై ఉపయోగపడుతోంది. ఇవి వైర్ లెస్ హాట్ స్పాట్ (Hotspot) ద్వారా ఇంటర్ నెట్ వంటి నెట్ వర్క్ మూలానికి కనెక్ట్ అవుతాయి. వైర్ లెస్ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రదేశాన్ని వై-ఫై హాట్ స్పాట్ అంటారు. ఇంటిలోపల ఈ హాట్ స్పాట్ కు 20 మీటర్ల రేంజి ఉంటుంది. కాని బయట ఈ రేంజి కొంచెం ఎక్కువగా ఉంటుంది.

ఇంటర్ నెట్ అనేది కూడా ఒక కంప్యూటర్ నెట్వర్కింగ్ సాంకేతికాల సమూహమే. కాని ఇంటర్ నెట్ కు వైర్ల ద్వారా కనెక్షన్ అవసరం. కాని వై-ఫైకి వైర్లతో పనిలేదు.

nov015.jpgవై-ఫై సౌకర్యం మన ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో, జనం ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా లభిస్తోంది. కొన్ని చోట్ల ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. కాని మరికొన్ని చోట్ల కొంత ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. విమానాశ్రయాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు వంటి చోట్ల కస్టమర్లను ఆకర్షించేందుకు ఉచితంగానే వై-ఫై సేవలు అందిస్తారు. బెంగళూరు నగరం మనదేశంలో ఉచిత వై-ఫై హాట్ స్పాట్స్ అందుబాటులో వున్న మొదటినగరం. ఏ వ్యక్తి అయినా మూడు గంటల పాటు 50 MB డేటాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నమ్మ వై-ఫై (802.11N) పేరున్న ఈ సౌకర్యంతో స్మార్ట్ ఫోన్ లు, లాప్ టాప్ లు, టాబ్లెట్ లను ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది బెంగళూరులోని MG రోడ్ ప్రాంతంలో అందుబాటులో ఉంది. అహ్మాదాబాద్ కూడా పరిమిత స్థాయిలో వై-ఫై అందుబాటులో ఉంది. కాగా, హైదారాబాద్ నగరం అంతటా వై-పై సౌకర్యం లభించే విధంగా తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2005 నంవత్సరంలోనే కాలిఫోర్నియాలోని సన్నివేల్ నగరం అంతటా ఉచిత వై-ఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి.

యాక్సెస్ పాయింట్ అవసరం లేకుండానే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ కు కమ్యూనికేషన్ వీలు కల్పించే అడ్హాక్ వై-ఫై ట్రాన్స్ మిషన్ అనేది కూడా ఉంది. నిన్ టేన్డో DS, డిజిటల్ కెమెరాలు, ప్లే స్టేషన్ పోర్టబుల్ వంటి చేతిలో పట్టే పరికరాల్లో ఈ అడ్ హాక్ వై-ఫైని ఉపయోగిస్తారు. 2010లో వై-ఫై డైరెక్ట్ అనే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాటజీ ద్వారా ఫైళ్ళ బదిలీకి వీలు కలుగుతుంది.

వై-ఫై ఎలా పనిచేస్తుంది? : కంప్యూటర్ తాలూకు వైర్ లెస్ ఎడాప్టర్ (adopter) సమాచారాన్ని (data) రేడియో సంకేతంగా (signal) మార్చి దాన్ని ఆంటెనా ద్వారా ప్రసారం చేస్తుంది. వైర్లెస్ రూటర్ ఈ సిగ్నల్ ను గ్రహించి దాన్ని డీకోడ్ చేస్తుంది. రూటర్ ఈ సమాచారాన్ని బ్రాడ్ బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ కు పంపిస్తుంది. ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో కూడా పనిచేస్తుంది. అంటే రూటర్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ నుంచి సమాచారాన్ని గ్రహించి, రేడియో సంకేతంగా మార్చి, కంప్యూటర్ తాలూకు ఎడాప్టర్ కు పంపిస్తుంది.

వై-ఫై ప్రసారాలకు ఉపయోగించే రేడియో తరంగాలు వాకీటాకీలు, సెల్ ఫోన్లు వంటి పరికరాల్లో ఉపయోగించే రేడియో తరంగాలను పోలి ఉంటాయి. ఇవన్నీ రేడియో సంకేతాలను గ్రహించడం, ప్రసారం చేయడం కూడా చేస్తాయి. కాని వీటితో పోల్చినప్పుడు వై-ఫైకి కొన్ని తేడాలున్నాయి. వై-ఫై ఉపయోగించే ఫ్రీక్వెన్సీ 2.4GHz (Gigahertz) లేదా 5Hz. ఇది సెల్ ఫోన్ లు, వాకీటాకీ, టీవీల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కన్నా చాలా ఎక్కువ. దీని వల్ల ఎక్కువ డేటా బదిలీ అవుతుంది. వై-ఫై పరికరాలు 802.11 నెట్వర్కింగ్ ప్రమాణాలను ఉపయోగిస్తాయి. చాలా రూటర్లు ఒకటి కంటే ఎక్కువ 802.11 ప్రమాణాలను ఉపయోగిస్తాయి. అందువల్ల 802.11a, 802.11b, 802.11g, 802.11n, 802.11ac రూటర్లు లభిస్తాయి. కాని 802.11n రూటర్ లు ఎక్కువ వాడుకలో ఉన్నాయి. రూటర్ ను ప్లగ్ కు అమర్చి స్విచ్ వేస్తే అది దానికి నిర్దేశించిన సాధారణ సెట్టింగ్స్ (default settings)కు అనుగుణంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ సెట్టింగ్లను మార్చుకునే వీలు కూడా ఉంటుంది.

మన ఇంట్లో నెట్ వర్క్ చేయబడిన అనేక కంప్యూటర్లు ఉంటే, హాట్ స్పాట్ తో వైర్ లెస్ నెట్వర్క్ ను సృష్టించుకోవచ్చు. నెట్ వర్క్ చేయబడని అనేక కంప్యూటర్లు ఉన్నా లేదా ఇంటర్ నెట్ నెట్ వర్క్ ను తొలగించాలన్నా మనకు కావలసిందల్లా ఒక వైర్లెస్ రూటర్. దీంట్లో కొన్ని భాగాలుంటాయి. అవి కేబుల్ కు లేదా DSL మోడెమ్ కు కలిపేందుకు ఒక పోర్ట్, ఒక రూటర్, ఒక ఇంటర్ నెట్ హాబ్, ఒక ఫైర్ వాల్, ఒక వైర్లెస్ యాక్సెస్ పాయింట్. ఈ వైర్ లెస్ రూటర్ చేసేదేమంటే, మన కంప్యూటర్ లు లేదా సెల్ ఫోన్ లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసేందుకు వైర్ లెస్ సంకేతాలను లేదా ఇధరనెటికేబుల్స్ ను ఉపయోగించే వీలుకల్పిస్తుంది. అలాగే ప్రింటర్ తోను, ఇంటర్నెట్ టోను కూడా వీటిని అనుసంధానం చేసుకోవచ్చు. చాలా రూటర్లు అన్ని దిశల్లో సుమారు 30.5 మీటర్లు (100 అడుగులు) రేంజ్ ని ఎక్స్ టెండర్లు లేదా రిపీటర్ లను ఉపయోగించుకోవచ్చు.

ఆధారం:  డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.

2.9943019943
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు