పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వర్ణదృష్టి లోపం

వర్ణదృష్టి లోపం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జాన్ డాల్టన్ ప్రతిపాదించిన పరమాణు నిర్మాణం గురించి మీ విజ్ఞానశాస్త్ర పాఠాలలో చదివారా. ఆయన ఇంగ్లాండ్ దేశంలో పాఠశాల ఉపాధ్యాయుడు. లెవోయిజర్ అనే ప్రఖ్యాత ఆంగ్ల రసాయనశాస్త్రవేత్త రసాయన చర్యలలలో క్రియాజనకాలు, క్రియాజన్యాల భారంలో ఎటువంటి మార్పు సంభవిస్తుందో ప్రయోగాల, పరిశీలన, పరిశోధనల ద్వారా 'ద్రవ్యనిత్యత్వ నియమం' ను ప్రతిపాదించాడు. జోసెఫ్ బ్రెస్ట్ అనే ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త వివిధ రకాలైన నీటి నమూనాలను సేకరించి అన్ని నమూనాలలో హైడ్రోజన్, ఆక్సిజన్ భారశాతాలు స్థిరంగా ఉంటాయని 'స్థిర అనుపాత నియమాన్ని ప్రతిపాదించాడు. ఈ రెండు నియమాల ఆధారంగా పదార్థాలు పరమాణులనే విభజింపలేని కణాలచే నిర్మితమై ఉంటుందని జాన్ డాల్టన్ మొట్టమొదటి పరమాణు సిద్ధాంతాన్ని 1808 వ సంవత్సరంలో ప్రతిపాదించాడు.

రక్తం ఏ రంగులో ఉంటుందో మీ అందరికి తెలుసు. డాల్టన్ లాంటి మేధావికి ఏ రంగంలో కనిపించేదో తెలుసా మీకు? డాల్టన్ కు ఆయన సోదరుడికి, ముద్ర వేయడానికి వాడే లక్క రక్తం ఎరుపు రంగుకు బదులు ఆకుపచ్చ రంగులో కనిపించేవట. ఎంత విడ్డూరమో కదా! అంతే కాదు ఊదా రంగు పూలు ఆయనకు నీలం రంగులో కనిపించేవట. క్రేన్బిల్ అనే ఒక రకమైన చెట్లు పగటిపూట ఆకాశంలాంటి నీలం రంగులో కనిపించేవట. క్రేన్ బిల్ అనే ఒక రకమైన చెట్లు పగటిపూట ఆకాశం లాంటి నీలం రంగు (ఆకాశనీలం), క్రొవ్వొత్తి కాంతిలో పసుపుపచ్చకు దగ్గరగా కొంచెం ఎరుపు వర్ణంలో కనపడేవట. అందరికీ ఎరుపుగా కనిపించే ప్రతిబింబాలు వారికి మాత్రం మసకమసకగా నీడలాగా కనిపంచేవట. ఈ విధంగా అందరిది ఒక దారైతే డాల్టన్ సోదరులిద్దరితే మరోదారైనట్లు. రంగులు వేరుగా కనిపించడం అనేది కూడా ఒక జబ్బు. డాల్టన్ సోదరులకు జన్యుపరమైన కు లోపం వల్ల కొన్ని రంగులను గుర్తించలేని వర్ణదృష్టి లోపం (color blindness) సంక్రమించింది. ఇది వారి తల్లిదండ్రుల నుండి వంశపారపర్యంగా సంక్రమించిన జబ్బు.

may013.jpgరసాయనశాస్త్ర పరిశోధనలో దిట్ట అయిన డాల్టన్ తమకు ఈ వర్ణదృష్టి లోపం (colour blindness) ఎలా సంక్రమించిందో తెలుసుకోవాలని చాలా కుతూహలపడేవాడు. అప్పటి దృష్టి విజ్ఞానశాస్త్ర పరిమితుల వలన ఈ రకం దృష్టిలోపానికి కారణం తెలుసుకోలేకపోయాడు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తమ కుటుంబ వైద్యుడైన జోసెఫ్ రాన్ సమ్ తో ఒప్పందం చేసుకున్నాడు. చనిపోయిన తరువాత తన నేత్రాలను తీసి, దిసేక్షన్ చేసి నిశితంగా పరిశీలించి లోపం ఎందువల్ల వచ్చిందో పరిశోధన చేయవలసిందిగా ఒప్పందం కుదుర్చుకొని పరిశోధకుడి మనోభావాల్ని ప్రతిబింబింప జేశాడు. ఊతమిచ్చి ప్రోత్సహించాలి.

డాల్టన్ కోరిక ప్రకారం డా. రాన్ సమ్ ఒక కన్ను వెనుక భాగంలో ఉన్న నేత్రపటలం (రెటినా-కనుగుడ్డులో వెలుగును గ్రహించే పొర) ను కత్తిరించి తీసి తన మిత్రుని కనుగుడ్డు వెనుకభాగం నుండి ఎరుపు అకుపచ్చరంగులను నిశితంగా పరిశోలించాడు. కనుగుడ్డు ముందు భాగంలోని ఫిల్టర్ అసాధారణమైనది కాదని తేల్చిచెప్పాడు. కనుగుడ్డు ముందు భాగంలోని పిల్టర్ వలన ఎరుపు ఆకుపచ్చ రంగులో మార్పు జరుగలేదని కూడా ఖచ్చితంగా చెప్పగలిగాడు. అంతకంటే ఎక్కువగా ఆనాటి శాస్త్ర పరిజ్ఞానంతో చేయలేకపోయాడు. డా. రాన్ సన్ కూడ కనుక భవిష్యత్తులో వర్ణదృష్టి లోపానికి కారణాలు కనుగొనే వీలుందని గ్రహించి డాల్టన్ నేత్రాలను పోడిగాలిలో భద్రపరచి ఉంచడం వలన చాలాకాలం వరకు చెడిపోకుండా ఉన్నాయి.

శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెంది నేత్రపటం (రెటీనా)లో వర్ణ దృష్టినిచ్చే 'శంకు కణాలు', అత్యధిక సంఖ్యలో తెలుపు - నలుపు వర్ణ దృష్టినిచ్చే 'దండాకార కణాలు' గూటిలో ఉంటాయని కనుగొన్నారు.

సుమారు 106 సంవత్సరాల తరువాత 1994లో లండన్ నేత్ర వైద్యశాస్త్రసంస్థలో డాల్టన్ నేత్రాలకు DNA పరీక్షలు చేశారు. ఆ పరిశోధనలో డాల్టన్ నేత్రాలలోని నేత్రపటలం (రెటీనా)లో ఉండవలసిన కాంతినిచ్చే (photo pigments) వర్ణద్రవ్యాలు మూడింటిలో ఒకటి లోపించిందని గుర్తించారు. శంకుకణాలల్లోని వర్ణద్రవ్యం (pigment) కంటి లోపలికి వచ్చే నిశ్చితమైన తరంగదైర్యాలను గ్రహించగలుగుతుంది. ఆ వర్ణద్రవ్యం లోపించినపుడు కొన్ని కాంతి తరంగ దైర్ఘ్యాలన మాత్రమే గ్రహించగలుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే కొన్ని రంగులను గుర్తించలేని దృష్టిలోపం ప్రాప్తిస్తుంది.

వర్ణదృష్టిలోని ప్రాథమిక అంశాలు

మీకు వర్ణదృష్టి గురించి మరికొన్ని తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ!

రెటీనాలో ఉన్న శంకు కణాలు మూడు రకాలుగా, మూడు రకాలైన కాంతినిచ్చే వర్ణద్రవ్యాల (photo pigments) లో ఏదో ఒకటి ఉంటుంది. ఆకుపచ్చగా ఎందుకుంటుంది. తెల్లని కాంతిలో ఉండి అన్ని రంగులను గ్రహించి ఆకుపచ్చరంగుని పరావర్తనం చెందిస్తుంది. అదేవిధంగా ఏదైనా వస్తువు రంగులో ఉందంటే ఆ వస్తువు నిశ్చితమైన తరంగదైర్ఘ్యాలను పరావర్తనం చెందిస్తుందని అర్ధం. వేరు వేరు రకాల శంకు కణాలు గ్రహించిన సమాచారాన్ని మెదడు దృష్టి గ్రహణశక్తి అనువదించుకొని, ఒక కళాకారుడువలె మూడు ప్రాథమిక రంగులను కలిపి ఎన్నో రకాల వన్నెలు, ఛాయలు సృష్టించినట్లుగా, మెదడు కూడా వివిధ రంగులను సృష్టిస్తుంది. లోపలకు తెచ్చే ముందు రకాలైన శంకుకణాల సమాచారాన్ని మెదడు గ్రహణశక్తితో అనువదించడమే వర్ణదృష్టి అంటారు.

విటమిన్-ఎ నుంచి సంగ్రహించిన భాగం రెటినాల్, ప్రొటీన్ భాగం ఆప్పిన్లు కలపి శంకుకణంలో కాంతినిచ్చే వర్ణం ఏర్పడుతుంది. బాలలూ మీరు గ్రహించాల్సిందేమిటంటే కాంతినిచ్చే వర్ణం (photo pigments) లో రెటినాల్ ఉంది కదా! అందవల్ల మీరు రెటినాల్ అధికంగా ఉండే అంటే విటమిన్-ఎ ఎక్కువగా ఉండే కారెట్లు, బొప్పాయి మొదలైనవి ఎక్కువగా తింటే మీకు మంచి వర్ణదృష్టి ఉంటుంది. తింటారు కదూ! మరొకభాగం ఆప్సిన్ జన్యువుల ఆధీనంలో ఉంటాయి. అందుకే వర్ణదృష్టిలోపం వారసత్వంగా వస్తుంది. మూడు రకాలైన ఆప్సిన్ (opsin) లలో లఘు, మధ్య, దీర్ఘతరంగ ధైర్యాలకు అనుగుణంగా ఉంటాయి. వంశపారంపర్యంగా ఆప్సిన్ జన్యువులో మార్పు వలన మూడు రకాలైన వర్ణదృష్టి లోపాలు సంభవిస్తాయి.

క్రోమోజోమ్ 7 పై ఉన్న జన్యువు లఘుతరంగాల ఆప్సిన్ సంకేతాలలోకి మార్చుతుంది. ఈ జన్యువులో మార్పు వలన అరుదుగా 'ఆటోసోమాల్ (autosomal) నీలి రంగు వర్ణదృష్టి లోపం సంభవిస్తుంది.

డాల్టన్ కు 'డ్యూటీరనోపియా (deuteranopia) ఎరుపు వర్ణదృష్టి లోపం. అంటే ఆయనకు మధ్య తరంగ దైర్ఘ్య ఆప్సిన్ లోపం ఉందన్నమాట.

మూడవరకం 'ప్రొటనోపియా (protanopia)? ఆకుపచ్చ రంగు వర్ణదృష్టిలోపం అంటే దీర్ఘ తరంగదైర్య ఆపిన్ లోపం. డ్యూటిరనోపియా, ప్రొటనోపియా తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి.

ఆధారం: ప్రొ. యం. ఆదినారాయణ.

3.00292397661
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు