హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / వర్షాకాలంలోనే అంటువ్యాధులు ఎందుకు ప్రబలుతాయి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వర్షాకాలంలోనే అంటువ్యాధులు ఎందుకు ప్రబలుతాయి?

వర్షాకాలం అంటువ్యాధుల గురించి, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

rainవర్షాకాలంలో పడ్డ వర్షపు నీరు రకరకాల ప్రదేశాల నుండి పోగుపడి కాలువలుగా ఈ ప్రదేశాలు మురికి గుంటలు కావచ్చు. లేదా మల మూత్రాదులు కలిసి ఉండవచ్చు. ఈ కలుషిత నీరు నేల పొరల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు నేల పొరల్లోనూ, గాలిలోనూ ఉండే ఎన్నో సూక్ష్మజీవులు బాక్టీరియాలు వీటిని ఆశించిన వైరస్ లు ఈ నీటిలో కలుస్తాయి. ఈ వర్షపు నీటిలో లవణాలు జంతు సంబంధ వ్యర్థ పదార్థాలు పోషక విలువలుండే ప్రోటీనులు, కార్బోహైడ్రేటులు, క్రొవ్వు పదార్థాలు సమృద్దిగా ఉంటాయి. పైగా ఆ నీటి ఉష్ణోగ్రత కూడ అనువుగా ఉండటం వల్ల అనేక రకాల సూక్ష్మజీవులు తమ సంతతిని తండోపతండాలుగా పెంచుకుంటాయి. నీటిలోని బురద కణాలు ఈ సూక్ష్మజీవుల ఆవాసాలు, గా ఉపకరిస్తాయి. ఇలా ఉధృతంగా పెరిగిన సూక్ష్మజీవులు నీటిలో నేలమీద, గాలిలోనూ విస్తారంగా తిరుగుతుంటాయి. ఈ నీరు మనం రోజూ వాడే చెరువులు, బావులు తదితర నీటి వనరులలోకి కలువడం వల్ల ఆ నీరు కలుషితమౌతుంది. సరియైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇటువంటి నీటిని వాడడం వల్ల ఎన్నో రకాల వ్యాధికారక జీవులు మన శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి. గాలిలో ఉన్న బాక్టీరియాలు, వైరస్ లు వీటికి తోడై చాలా మందికి వ్యాధులు సోకుతాయి. వ్యాధి గ్రస్థులలో కొన్ని రోగ కారక జీవులకు తమ జీవిత చక్రం లో కొన్ని దశలుంటాయు. ఈ దశలు సమృద్దిగా లభించడం వల్ల వ్యాధులు ఒకరి నుండి మరొకరికి విపరీతంగా వ్యాపిస్తాయి. వీటినే అంటువ్యాధులు అంటాం. అందువల్లే వర్షాకాలంలో అంటువ్యాధులు, ఇతర వ్యాధులు ఎక్కువగా కలుగుతాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :-

  1. సాధ్యమైనంత వరకు కలుషిత నీటిని స్నానాలకు కూడా వాడకూడదు. ఏ మాత్రం త్రాగరాదు.
  2. త్రాగునీరైనా ఆ నీటిని బాగా మరగకాచి, వడపోసి, చల్లార్చి తాగాలి.
  3. రోగాలు సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్సను తీసుకోవాలి.
  4. నాటు వైద్యాలు పనికి రావు.
  5. కలరా వంటి అంటువ్యాధులు ప్రబలినపుడు వాటిని దేవతలకు ఆపాదించడం వల్ల బలులు ఇవ్వడం వల్ల కాలయాపన, అపరిశుభ్రత పెరిగి అంటువ్యాధులు మరింత పెరుగుతాయి.
3.00564971751
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు