పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వానల్లు కురిపించే వయ్యారి మొక్క

వానల్లు కురిపించడానికి మొక్క పై ప్రయోగం చేస్తున్న పిల్లలు.

Rain Rain Go Away

Come Again Another Day

Little John wants to play

Rain Rain Go Away

mokka.jpgఅని ముద్దు ముదుగా పిల్లవాడు ఇంగ్లీషు రైమ్ చెబితే చప్పటు కొడతాం. చిన్నపిల్లవాడు జానీ ఆడుకోవాలి కనుక ఓ వర్నమా! ఈ రోజు రాకు మరెప్పడైనా రా! అని ఈ రైంకు అర్థం. అసలే వరాలు పడక జనం అవస్థ పడుతుంటే వచ్చే వరాన్ని ఆపడం ఎందుకు? కావాలంటే వర్షంలో తడుసూ బురదలో హాయిగా ఆడుకోవచ్చు. మార్క్ ట్వైన్ రచించిన “రాజు-పేద' అనే నవల (ఇంగ్లీషులో King and the Pauper) లో ట్పై పల్లెటూరి పిల్లవాడు రాకుమారుడితో ఇలా అంటాడు “మాపల్లెలో బురద అని ఓ మహత్తర పదార్థం వుంది యువరాజా. ఆ బురదలో ఎగురతూ దూకుతూ ఆడుకుంటూ వుంటే, ఒంటిపై చల్లగా పడుతూ వుంటే, ఆ మట్టి వాసన పీల్చుతూ ఉంటే ఆహా.... స్వర్గం యువరాజా, స్వర్గం" అంటాడు.

గాజు పాత్రలో ఓ చిన్నవాన కురిపిస్తామా? ఆచిన్న వానే “వానలు కురిపించే వయ్యారి మొక్క ద్వారా కురిపిస్తామా? ఎలాగంటారా? రండి చేసిచూద్దాం!

కావలసిన వస్తువులు

ఒక చిన్నగ్లాసు, పచ్చని మొక్క చిన్నకొమ్మ, కొంచెం నూనె (Oil), పెద్ద గాజు పాత్ర.

చేయువిధానము

చిన్నగాసు తీసుకొని దానిలో ముప్పావువంతు నీరు పోసి ఎండపడేచోట వుంచండి. కొన్ని ఆకులు వున్న ఓ పచ్చని మొక్క కొమ్మను తీసుకొని పైన చెప్పిన గ్లాసులోని నీటిలో నిలువుగా అమర్చండి (పటంలో చూడండి). ఇపుడు గ్లాసులోని నీటిపై కొమ్మ చుటూర నూనెను మెల్లగా పోయాలి. (కొబ్బరి నూనె గానీ, పామాలిన్ నూనె గానీ పోయండి) మొత్తం నీటిపై ఈ నూనె ఒక పొరలాగ పరచుకుని పోతుంది. పెద్ద గాజు పాత్రను పటములో చూపిన విధంగా కొమ్మ ఉన్న గ్లాసుపై బోర్లించండి. అమరికను అలాగే కాసేపు వుంచండి. తరువాత గమనించండి. ఆశ్చర్యం! పెద్ద గాజుపాత్రలోపలి గోడలపై వర్షపు చినుకులు అంటుకుని వుంటాయి. అంటే గాజుపాత్ర లోపల వర్వం పడిందన్నమాట. గాసులో కొమ్మ చుటూ నూనె పొరవుంది. కాబట్టి నీరు ఆవిరి కాలేదు. కాబట్టి వర్షం గ్లాసులోని నీటి తాలూకుది కాదు. అంటే ఈ వర్షం మొక్కవల్లే వచ్చిందన్న మాట. ఇది ఎలా సాధ్యం? అసలేం జరిగింది?

గాసులో నూనె పోశాము కాబట్టి నీరు ఆవిరికాలేదు. కనుక గాసు పాత్రలోని వర్షపు నీరు వెుక్కవల్ల ఏర్పడిందేనన్నమాట. ఎందుకంటే వెలుపలగాలిలోని నీరు పాత్రలోనికి పోయే అవకాశం లేదు కాబట్టి మరి మొక్క నీటిని ఎలా సృష్టించింది.

ఎండలో అంటే సూర్యరశ్మి వున్నప్పుడు మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పిండి పదార్థం తయారు చేసుకుంటాయి కదా. గ్లాసులోని మొక్క అదే విధంగా పిండిపదార్ధాన్ని తయారు చేసుకున్నది. మనం మొక్కని ఎండలో పెట్టాము కదా. మొక్క గ్లాసులోని నీటిని గ్రహించి, గాజు పాత్రలోని కార్బండై ఆక్సైడ్ ను పీల్చుకొని కిరణజన్యసంయోగ క్రియ (ఫోటో సింథసిస్) ద్వారా పిండి పదార్థం తయారు చేసింది.

6CO2 +6H2O —» С6 Н12 О6 (పిండి పదార్థం) +6O ఈ క్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది. మొక్క పీల్చుకొన్న నీటిలో కొంత నీరు పత్ర రంధ్రాల ద్వారా వెలుపలికి వస్తుంది. మొక్క కూడా ప్రాణి కాబట్టి దానికీ ఆహారం కావాలి. తాను తయారు చేసుకున్న గూకోజ్లో కొంతభాగాన్ని శ్వాసక్రియ ద్వారా ఖర్చు చేస్తుంది. ఇందులో భాగంగా నీరు కూడా విడుదల అవుతుంది. అలా గాజు పాత్రలో ఆకుల పైపొరలోని రంధ్రాల ద్వారా వెలువడిన నీరు తుంపర్లుగా ఏర్పడుతుంది. కాసేపైన తరువాత ఇలా వెలువడిన నీటి తుంపర్లు ఎక్కువ అయి, సాంద్రత ఎక్కువ అయి ఘనీభవించి నీటి బిందువులుగా ఏర్పడి గాజు పాత్ర గోడలపై అక్కడక్కడా అంటుకుపోతాయి. ఇవి చూడడానికి వర్షపు చినుకులు లాగ కనిపిస్తాయి. అలా గాజుపాత్రలో వర్షం కురిసింది. అదన్నమాట "వానలు కురిపించే వయ్యారి మొక్క"

రహస్యం!

రచయిత: యం.ఏస్.యుగంధర్ బాబు, సెల్: 9394782540

2.97272727273
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు