పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విజ్ఞాన విశేషాలు

కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

స్టెమ్ సెల్స్ తో మధుమేహ చికిత్స

apr0012.jpgస్టెమ్ సెల్స్ ను ఉపయోగించి ఎలకల మీద చేసిన ప్రయోగాల్లో మధుమేహవ్యాధి చికిత్సకు సానుకూల స్పందన కన్పించిందని శ్రీ వెంకటేశ్వరా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) మాజీ డైరెక్టర్ డా. జి. సుబ్రమణ్యం తెలియజేశారు. ఈ విషయంలో మరికొంత పరిశోధన, చికిత్సకు సంబంధించిన ప్రయోగాలు అవసరమౌతాయని ఏమైనా ప్రస్తుత పరిశోధన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ముందుముందు ఇన్సలిన్ తో గానీ, టాబ్లెట్స్ తో గానీ పనిలేకుండా మధుమేహాన్ని అదుపుచేసే అవకాశం ఉందని చెప్పారు.

మరోవైపు టైప్-2 మధుమేహ చికిత్సలో సంప్రదాయ మందుల వాడకంలో పోలిస్తే ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మూలకణాలతో మెరుగైన ఫలితాలు రాబట్ట వచ్చునని బ్రిటీష్ కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తిమోతికీ ఫెర్ తెలియజేశారు.

అసాధారణ వేగంతో ప్రయాణిస్తున్న నక్షత్రం

పాలపుంత (మిల్కీవే గెలాక్సీ) లోని యుఎస్ 708గా వ్యవహరిస్తున్న నక్షత్రం సెకనుకు 1200 కిలోమీటర్లు లేదా గంటకు 27లక్షల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలపుంతలోని నక్షత్రాల కదలికలు సాధారణమే కానీ అవి పాలపుంత అకర్షణ శక్తికి లోబడి కొంత పరిధి లోపల నియమిత వేగంతో ప్రయాణిస్తుంటాయి.

కానీ US 708 నక్షత్రం ప్రయాణిస్తున్న వేగం మాత్రం చాలా అసాధారణమని పాలపుంత ఆకర్షణ శక్తి కూడా అధిగమించి ప్రయాణిస్తుందని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు.

గ్లోబల్ వార్మింగ్

apr0013.jpgప్రపంచవ్యాప్తంగా 1901 నుండి 2000 సంవత్సరాల మధ్య సముద్రనీటి మట్టం ఏడాదికి 1.7 మీ.మీ. చొప్పున, 1993-2010 సంవత్సరాల మధ్య ఏడాదికి 3.2 మి. లీల చొప్పున పెరిగిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కానీ అదే కాలంలో విశాఖపట్నం తీరంలో మాత్రం పైన చెప్పిన కాల వ్యవదుల్లో వరుసగా 1.మి.మీ, 5.మి.మీ చొప్పున సముద్ర నీటిమట్టంలో పెరుగుదల నమోదైంది.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన పరిశోధకులు ఆల్టిమీటర్ ఉపయోగించి, ముంబాయి, కొచ్చి, వెజాగ్, కోల్ కత్తా తీరాల వెంబడి సముద్ర జలాల మటంలో పెరుగుదలను కొలిచారు. ఈ కొలతల ద్వారా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తూర్పుతీరం అంటే విశాఖపట్నం , కొలకత్తా తీరం వెంబడి సముద్ర నీటిమట్టం పశ్చిమకోస్తాతో పోల్చినప్పుడు ఎక్కువ వేగంగా పెరుగుతుందని ఇందుకు వాతావరణ మార్పులు కారణం కావచ్చుననని వారు తెలియజేస్తున్నారు.

వ్యవసాయ వ్యర్థాలే భవిష్యత్ లో కార్లకు ఇంధనం

apr0014.jpgవ్యవసాయ వ్యర్థాలే భవిష్యత్ లో కార్లకు ఇంధనం కానున్నాయా? అవుననే అంటున్నారు ఇంగ్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లేయ (UEA)కి చెందిన పరిశోధకులు గడ్డి, రంపంపొట్టు, మొక్కజొన్న కండెలు వంటి వ్యవసాయ వ్యర్థాల నుంచి పర్యావరణానికి హానిచేయని బయో ఇంధనాలను తయారుచేసి కార్లకు ఇంధనంగా వాడవచ్చునని చెబుతున్నారు. ఈ వ్యర్థాల నుంచి ఏడాదికి 400 బిలియన్ లీటర్ల కంటే ఎక్కువ బయో ఇథనోల్ ను తయారుచేయవచ్చునంటున్నారు. ప్రస్తుతం గడ్డి, ఇతర వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయొఇధనాల్ ను తయారుచేసే పద్ధతులు చాలా ఖర్చుతో కూడుకుని ఉండడమే కాకుండా, అంతగా ఆచరణ యోగ్యంగా కూడా లేవు. ఎందుచేతనంటే, ఈ వ్యర్థాల నుంచి గ్లూకోజ్ ను విడుదల చేసే ప్రక్రియకు ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ ఆమ్ల పరిస్థితులు అవసరమౌతాయి. ఆ తర్వాత ఈస్ట్ సమక్షంలో కిణ్వ ప్రక్రియ (Fermentation)కు గురిచేస్తే ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ముందుగా వ్యర్థపదార్థం ప్రస్తుత ప్రక్రియలో చిన్న సమ్మేళనాలుగా (ఫర్ ఫ్యూరా ల్, హైడ్రాక్సైమిథైల్ పర్ ఫ్యూరాల్) బ్రద్దలవుతుంది. ఈ సమ్మేళనాలు ఈస్ట్ కు విషంలా పనిచేస్తాయి. అందుచేత కిణ్వప్రక్రియ క్లిష్టమౌతుంది.

జన్యుపరంగా మార్పిడి చేసిన ఈస్ట్ ను ఉపయోగించి ఈ సమస్యను అధిగమించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. వీరు దాదాపు 70 రకాల ఈస్ట్ పరిశోధనలు జరిపి, వీటిలో 5 రకాలు ఫర్ ఫ్యూరాల్ విషప్రభావాన్ని నిరోధిస్తాయని, వీటిని ఉపయోగించి ఎక్కువ ఇథనాల్ దిగుబడిని సాధించవచ్చునని కనుగొన్నారు.

వాల్ నట్స్ తో ఆరోగ్యం

apr0015.jpgమనం రోజూ తీసుకునే ఆహారంలో నట్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడంలో నట్స్ బాగా ఉపయోగపడతాయి. నిజానికి ఎండుఫలాలు (Dry fruits) అంటే మనకు అలసినవి ఎండుద్రాక్ష, ఖర్జూరాలే. కాని ఇప్పుడు చాలా రకాల పండ్లు డ్రైఫ్రూట్స్ గా దొరుకుతున్నాయి. జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ ఇవన్నీ డ్రైఫ్రూట్స్ జాబితాలోకి చేరిపోయాయి.

వాల్ నట్స్ లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి1, 2, 3, 6 విటమిన్ ఇ, కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధిక కొలెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ భోజనంలో భాగంగా గుప్పెడు వాల్ నట్స్ ను తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఇటీవల కాలిఫోర్నియా యూనివర్శిటీలో జరిగిన ఒక పరిశోధనలో వెల్లడయింది. వాల్ నట్స్ తీసుకోవడం వల్ల గ్రహణ, జ్ఞాపకశక్తితో బాటు ఏకాగ్రత కూడా బాగా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. వాల్ నట్స్ లోని వినోలెనిక్ ఆమ్లం వల్ల ఈ మార్పు వస్తోందని వారు వివరించారు.

తిరుపతిలో సైన్స్ మ్యూజియం 'బ్రహ్మాండ' కు శంఖుస్థాపన

విశ్వనికి సంబందించిన ప్రధాన అంశాలను పరితిబింబించాల ఒక సైన్స్ మ్యూజియం తిరుపతిలో నిర్మాణం కాబోతోంది. 200 ఎకరాలు స్తలంలో నిర్మాణం కాబోయే ఈ మ్యూజియం పేరు బ్రహ్మాండ. ఇది అంతరేజాతియా సంద్రమును కేంద్రంగా ఉంటుంది. డేంటొ వివిధ రంగాలకు సంబందించిన ఎనిమిది  గొళ్ళాలు ఉంటాయి. అవి అంతరిక్ష పరిశోధన రంగం, కృష్ణ సాంకేతిక రంగం, సమాధా సాంకేతికరంగం, వ్వవసాయ రంగం, పరితత్తా రంగం, పంచిన రంగం, శాస్తి సాంకేతిక రంగం, పకృతి-పర్యావరణం. ఎన్నివిడో రంగం ప్రకృతికి సైన్సుకి అనుసంధానంగా  ఉంటుంది. తిరుపతిలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంబరంగా జనవరి 4 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఈ మ్యూజియంకు శుంకుస్థాపన చేశారు.

స్ప్రే పెయింట్ తో ఏ ఉపరితలనైనా టచ్ స్క్రీన్ గ మార్చగలం

ప్రస్తుతం టచ్ స్క్రీన్ ల వాహనడుస్తోంది. మొబైల్ ఫోన్ లు LCD ,ATM లు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు కేవలం స్పర్శ (touch )ఆధారంగానే పనిచేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏ ఉపరితలనైనా ( sun face )ఉదాహరణకు మన ఇంట్లోని టేబుల్ టాప్ ని టచ్ స్క్రీన్ గ మార్చగలం. ఇదేమి హాస్యానికి అంటున్న మాటకాదు. కానీ ఇది సాధ్యం చేసే ఒక టెక్నాలజీ అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ తమాషా ఎలాగంటే. మన ఇంటిలోని ఏదైనా వస్తువు, ఫర్నిచర్, గోడ, ఆటబొమ్మ ఇలా దేనికైనా విద్యుద్వాహకత ఉన్న పెయింటును స్ప్రే చేయడమే (వస్తువు పై భాగానికి కొన్ని ఎలాక్రోద లను అమరుస్తారు ). ఈ కొత్త టెక్నాలజీ పేరు ఎలక్ట్రిక్ (Electric )అన్ని టచ్ స్క్రీన్ లాగానే ఈ టెక్నాలజీ కూడా షంటింగ్ ఎఫెక్ట్ మీదనే ఆధారపడుతుంది. స్క్రీన్ మీద వేలుతో తాకినప్పుడు కొంత పరిమాణంలో విద్యుత్ క్రిందికి తోయబడుతుంది. ఒక సెంటీమీటర్ ఖచ్చితత్వంతో వేలు స్పర్శ ప్రాంతాన్ని గుర్తిస్తుంది. ఏదైనా ఉపరితలాన్ని ఒక బటన్ లేదా సైడర్ గ ఉపయోగించడానికి ఈ ఖచ్చితత్వం సరిపోతుందని శాస్త్రవేత్తల్లో ఒకరైన జాంగ్ చెప్పారు.

సముద్రాల్లో ఆందోళన కల్గించే  స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్తలు

సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. మనం ధరిస్తున్న సింథటిక్ వస్త్రాలు, ప్లాస్టిక్ కరుటైర్లు ఇలా రకరకాల ప్లాస్టిక్ వస్తువులు ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ప్రతి ఏటా హుషారు 9.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోంది, దీనిలో మిక్రోప్లాస్టిక్ కణాలు 15 నుంచి 31 శాతం దాకఉంటుందనిIUCN (International Union for conservation Nature )సంస్థ తెలియజేసింది. మన జీవిత కార్యక్రమాల్లో బట్టలు ఉతకడం, వాహనాల డ్రైవింగ్ వంటివి సముద్రాలను ప్లాస్టిక్ తో ముంచెత్తుతున్నాయని, దీనివల్ల సముద్రాల్లో జీవవైవిధ్యానికి, మనుషుల ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని ఆ సంస్థ చెబుతోంది. సముద్రంలో చేరిన మిక్రోప్లాస్టిక్ కణాలు, కొన్ని మార్గాల ద్వారా మన ఆహారంలోకి, మన నీటి సరఫరాల్లోకి ప్రవేశించి మన ఆరోగ్యం మీద దుష్రభావాన్ని కల్గిస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు కొన్ని మార్గాలను కూడా సూచిస్తున్నారు. టైర్ల కంపినీలు రబ్బరు టైర్ల వైపు దృష్టి పెట్టాలని, వస్త్ర ఉత్పత్తిపైరులు వస్త్రాలపై ప్లాస్టిక్ కోటింగ్ ను నిలిపి వేయాలని INCN సూచిస్తోంది. వాషింగ్ మెషిన్ లో మిక్రోకణాలనే కాకుండా నానో ప్లాస్టిక్ కణాలను కూడా పట్టుకునే ఫిల్టర్ లను వాడాలంటున్నారు.

ఆధారం: డా.ఇ.ఆర్. ఎస

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు