పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేచూరు గోవు

వేచూరు జాతి ఆవు ప్రపంచంలోనే తి చిన్న ఆకృతి గల జాతి ఆవుగా గుర్తించబడింది.

8క్రీ.పూ. 8000 – 10,000 సం. మధ్యలోనే మనిషి ఆవుల మందలను పోషించేవాడు. పాలు త్రాగడం మనిషి ఆహారంలో బాగమైంది, పాలు సమగ్రమైన పోషకాహారం.

ఆయుర్వేదంలో ఆవుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. వివిధ రకాలైన ఆవులు, ఎడ్లు మన దేశంలో వున్నాయి. హర్యానా, సింధూ, విసూరి, హల్లీకార్, ఒంగోలు, కృష్ణావ్యాలీ, హరియానా, హిస్సార్, అమృత్ వాలీ ఇలాంటి ముప్పయి రకాలను భారత వ్యవసాయ పరిశోధనా సంస్త (ICAR – Indian Council for Agricultural Research) భారతీయ జంతుజన్యువనరుల సంస్థ (NBAGR – National Bureau of Animal Genetic Resources) గుర్తించాయి. వాటిలో వేచూరు ఆవు జాతిని ఆహార వ్యవసాయ సంస్థ (FAO – Food and Agricultural Organisation) అనే ఐక్యరాజ్య సమితి విభాగం తన స్వదేశీ జంతువైవిద్య సమాచార వ్యవస్త (DADIS – Domestic Animal Diversity Information System) లో అపాయకర స్థితిలో ఉన్న జాతిగా గుర్తించింది. అంటే ఈ జాతి అంతరించిపోయే దశలో ఉన్నదని అర్థం.

వేచూరు జాతి ఆవు ప్రపంచంలోనే తి చిన్న ఆకృతి గల జాతి ఆవుగా గుర్తించబడింది. గిన్నెస్ ప్రపంచ రికారడుల పుస్తకంలో దీని ఎత్తు కేవలం 90 సెం.మీ. గా పేర్కొన్నారు. వేచూరు జాతి ఆవుని ఈ విధంగా గుర్తించక ముందు 1 మీటరు ఎత్తులో ఉన్న ఒక మెక్సికన్ ఆవు జాతిని అతి చిన్న ఆకృతి గల ఆవు జాతిగా గుర్తించారు.

9కేరళలోని వేచూరు గ్రామం ఈ చిన్న ఆవులకు పుట్టినిల్లు. ఆ పేరుతోనే ఈ ఆవుల్ని వేచూరు ఆవులని పిలుస్తున్నారు. వీటి ఎడ్లని మూపురంతో సహా కొలిస్తే వీటి ఎత్తు కేవలం 105 సెం.మీ. మాత్రమే వుంటుంది. ఇవి బలిష్టంగా వున్నా వీటి బరువు తక్కువే. వీటితో వేచూరు గ్రామంలో పొలాలు దున్నేవాళ్ళు. కేరళలో మాత్రమే ఈ మరుగుజ్జు ఆవులు, ఎడ్లు కనపడ్డాయి.

1960 సంవత్సరము వరకు ఈ ఆవులు, ఎడ్లూ కేరళలోని ఇతర ప్రాంతాలు కొట్టాయం, ఎర్నాకుళం అలపుయ జిల్లాల్లో అధిక సంఖ్య కనబడేవి. అయితే అప్పటి కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో అధిక పాలదిగుబడి కోసం బలిష్టమైన ఎడ్లతో సంకర జాతి ఆవులనభివృద్ది చేయాలని సంకల్పించింది. వేచూరు ఆవులు రొజుకు కేవలం మూడు లీటర్లు పాలు మాత్రమే ఇచ్చేవి. వేచూరు ఆవులు ఆకృతితోనూ వేచూరి ఆవుల బరువుతోనూ పోలిస్తే ఈ పాల దిగుబడి ఎక్కువే. వేచూరు ఆవులు కేవలం 107 కిలోల బరువు తూగేవి. పైగా వేచూరు ఆవుల నిమిత్తం అయ్యే ఖర్చుకంటే పాల మూలంగా వచ్చే రాబడి ఎక్కువ.

కానీ ఎక్కువ పాల దిగుబడి కోసం అప్పటికీ కోరళ ప్రభుత్వం కోళ్ళ పశుసంపద చట్టం 1961 తీసుకు వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఒకే జాతి ఆవులు, ఎడ్ల మధ్య సంపర్కాన్ని ప్రభుత్వం నిఫేధించింది. దానితో 1980వ సంవత్సరం వచ్చేసరికి వేచూరు ఆవుల సంఖ్య క్రమంగా కొంత కాలానికి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో పడింది.

1980 ప్రాంతంలోనే కేరళ రాష్ట్ర ప్రభుత్వం “నిషబ్దలోయ” (Silent Valley)లో ఒక జలవిద్యూత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయదల్చింది. ఈ లోయ నీలగిరి కాండల్లో పాలకాడ్ జిల్లాలో వుంది. అయితే ఈ ప్రాంతంలో 240 చ.కి.మ. లలో ఉన్న సహజ అటవీప్రాంతం ఒక గొప్ప ఔషదమొక్కలు గల ప్రాంతమని 1847లోనే రాబర్ట్ ఫైట్ అనే వృక్షశాస్త్రజ్ఞుడు గుర్తించాడు. జల విద్యూత్కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతమంతా మునిగిపోతుందని, అసలీ ప్రాంతాన్ని ఒక గొప్ప జాతీయ ఉద్యానవనంగా తయారు చేయాలని పర్యావరణ ప్రేముకులు ఒక ఆందోళనను లేవదీశారు. దానితో ప్రభుత్వం తమ ప్రతిపాదన ఉపసంహరించుకుంది.

ఈ విజయంతో ఇతర రంగాల్లో ప్రమాదంలో వున్న అంశాలపై దృష్టి సారించి వాటిని సంరక్షించాలని స్వచ్చంద సంస్థలు భావించాయి. ఆ విధంగా వేచూరు ఆవులు గిన్నెస్ ప్రపంచం రికార్డుల్లో ఉన్న మేలైన ఆవులుగా ప్రొఫెసర్ సోసమ్మ ఒప్ భావించారు. ఆమె త్రిస్సూర్ లోని పశువైద్య కాళాశాలలో జంతు జన్యు విభాగంలో ఆధ్యాపకురాలు. ఈ కళాశాల కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. ఆమె వేచూరు ఆవుల ఉత్పాదక బీజ పదార్థం (Germiplasm) గుర్చి ఆలోచిందింది. చిన్నతనంలోని జ్ఞాపకాల్లో ఆవులనగానే ఆమెకు ప్రస్ఫుటంగా వేచూరు ఆవులు గుర్తుకు వచ్చేవి. దానిలో పర్యావరణ స్పృహ కలిగిన కొంతమంది విద్యార్థుల సాయంతో వేచూరు ఆవులు, ఎడ్లు ఎక్కడైనా మిగిలివున్నాయో వెతకటం మెదలెట్టారు.

ఈ వెదుకులాట కొట్టాయం, ఇద్దుక్కి, అలపుయా, త్రిస్సూర్ జిల్లాల్లో విస్తృతంగా కొనపాగింది. దీనికి పశు సంవర్థక శాఖ సిబ్బంది, గ్రంధాలయాలు, పాఠశాలలు, పంచాయితీలు, స్వచ్చంద సంస్థలు, అనేక మంది వ్యక్తులు తీవ్రంగా శ్రమించారు. అది “వేచూరి ఆవుని కాపాడండి” ఉద్యమంగా రూపొందింది. వేచూరి ఆవుని సంరక్షించడం ఒక ప్రధాన కర్తవ్యంగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం భావించింది.

1989 జులై నెలలో పశు వైద్య కశాశాల, త్రిస్సూర్ వేచూరి సంరక్షణ పధకాన్ని రూపొందించింది. 8 వేచూరి ఆవుల్ని, ఒక వేచూరు ఎద్దుని ఎట్టకోలకు సంపాదించాయి. కాలక్రమంలో మరో రెండు డజన్లు పశవులను చేర్చుకోగలిగారు. తర్వాత భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా ఈ పథకానికి చేయూత నివ్వడంలో వేచూరు ఆవుల ఉత్పాదక బీజపదార్థం పధకం తయారైంది. 1993 – 98 కాలానికి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ 47 లక్షల రూపాయలు మంజూరు చేసింది.

పిండ మార్పిడి సాంకేతికతో ఆవుల్లో స్వచ్చమైన వేచూరు జాతి సంతానోత్పత్తిని అనతికాలంలోనే శాస్త్రవేత్తలు సాధించారు. ఇప్పుడు కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ పశువుల దొడ్లలోనే 135 వేచూరు ఆవులు, ఎడ్లు ఉన్నాయి. వీటి ద్వారా మరో 30 శాఖలను ఏర్పాటు చేసి వేచూరు పశు సంతతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు.

వేచూరు ఆవు దూడలు పుట్టుకలో మరణించడం జరగదు. ఈ మరుగుజ్జు ఆవులు త తొందరగ వ్యాధులకు గురికావు. ముఖ్యంగా కేరళలోని ఇతర సంకర జాతుల ఆవులు నోట్లో, కాళ్ళల్లో వచ్చే కొన్ని వ్యాధుల వల్ల మరణిస్తాయి. కాని వేచూరు ఆవులకు ఆ ప్రమాదం లేదు. వేచూరు ఆవులకు వ్యాదినిరోధక గుణం ఎక్కువ.

బాక్టీరియాలను నిరోధించగలిగే శక్తి ఈ ఆవులకు ఎలా కలిగిందన్న అంశం మీద ఎన్.సి.ఎమ్.ఎస్ జీవవిజ్ఞాన, జీవ సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి సంస్త, కొచ్చి పరిశోధనలు చేసింది. వీటి పలితాలు ఒక అంతర్జాతీయ పత్రిక జీన్ లో డిసెంబర్ 30, 2011 సంచికలో ప్రచురించారు.

వేచూరు ఆవుపాలలో ఔషధగుణం వున్నదని ఈ పరిశోధనలు దృవీకరించాయి. ఈ పాలలో గల లాక్టోఫెరిన్ జన్యువుని విశ్లేషించి జన్యువు పరిరర్తనా గుణం కలిగిందని నిర్ధారించారు. దీనిలో గల ఆర్ణినైస్ అనే అమినో ఆమ్లం గాయాల్ని మాన్పే గుణం కలదిగాను, జీవానువులను శ్రీఘ్రంగా వృద్ది చేసేదిగాను వుండటమేగాకుండా, గుండె సంబందిత వ్యాధుల్లో ఫోషణకుపయోగిస్తుందని దృవీకరించారు.

వేచూరు ఆవు చిన్న ఆకృతి కలిగివుండటం వలన గడ్డీ, కనుపు తక్కువగా తీసుకుటుంది. ఇళ్ళలో వాటిని తక్కువ ఖర్చుతో  పెచుకుని వాటు పాలనఉపయోగించుకోవడం లాభసాటిగా ఉంటుంది. అయితే  ఆవుల్లో పాల దిగుబడి తక్కువ కావడం వలన పాడి పరిశ్రమకు టే డైరీలలో ఈ ఆవుని పెంచడం ప్రయోజనకారి కాదు. కాని ఈ పాలకు న్న ఔషధవిలువ ఇతర జాతి ఆవుల్లో లేదు. ఈ ఆవులు ప్రస్తుతం కేరల మొత్తంలో 200లకు మించి లేదని ఒక అంచనా.

వేచూరి ఆవుపాలల్లో వుడే పాస్ఫోలిపిడ్స్ అనే పదార్థాలు మెదడు, నాడికమాలు పెరగడంలో తోడ్పడతాయి. పైగా క్రొవ్వుని జీర్ణం చేసే శక్తి ఈ పాలకు ఉంది. ఇతర సంకర జాతి అవు పాలలో ఈ గుణం లోకపోగ కొవ్వు శరీరంలో పేరుకుపోవడానికి అవకాశం ఉంది. ఆందుకే వేచూరు ఆవుల పాలు పసిపిల్లలకు రోగాలు రోగాలబారిపడిన వారికి రోగం నుంచి తేరుకునే వారికి జవసత్వాం కలుగజేస్తుంది.

ఆ ఆవుల జాతి అంతరించిపోకుండ కేరళలోని  పర్యావరణ స్పృహ కలిగిన మేధావులు, విధ్యార్థులు స్వచ్ఛంద స్స్థల కార్యకర్తలు చేసిన కృషి అనన్య సామాన్యమైనది.  దీని స్పూర్తిగా తీసుకొని మనం కూడా మన రాష్ట్రం చిత్తూరు జిల్లాలో “వుంగనూరు ఆవు”గా ప్రసిద్ధి చెందిన మరుగుజ్జు ఆవులను కాపాడుకుందామా!

ఆధారం: పైడిముక్కల ఆనంద్ కుమార్

3.04609929078
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు