పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

శక్తిని ఆదా చేద్దాం

శక్తిని ఆదా చేద్దాం – ప్రత్యామ్నాయాలను అన్వేషిద్దాం - నూతన ఆవిష్కరనలకు ద్వారం తెరుద్దాం – అదే మన లక్ష్యం

బల్బులు, కార్లు, టెలివిజన్ లు, వంట కోసం ఉపయోగించే పొయ్యిలు,  యంత్రాలు మొదలైనవి అన్నీ పనిచేయాలంటే శక్తి కావలసిందే. అలాగే మనుష్యులు, మొక్కలు, జంతువులు అన్నీ కూడా శక్తి కోసం బయట వనరుల మీద ఆధారపడవలసిందే. మొక్కలు సూర్యుని వేడి మీద ఆధారపడతాయి. జంతువులు, మనుషులు తమ ఎదుగుదలకు పని చేసేందుకు ఏదో ఒక రూపంలోని రసాయన శక్తి మీద ఆధారపడవలసినదే. అంటే ఈ భూమి మీద బతకాలంటే శక్తి కావల్సిందే.

బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు లాంటి బంధనాలు పెద్ద మొత్తంలో వాడటం క్రమంగా వనరులు తగ్గిపోవడమే కాకుండా మన ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. శక్తిని వినియోగిస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరు రెండు విషయాలను గుర్తించాలి.

 1. స్థాయికి మించి తరిగిపోయే ఇంధన వనరులను ఉపయోగిస్తున్నాము.
 2. శక్తి వనరులను విపరీతంగా వాడటం వల్ల ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాము.

వీటి కారణంగా అనేక ఇబ్బందులను మనం ఎదుర్కొంటున్నాము. కనుక మనకు జీవం పోసే శక్తి, ప్రాణం తీసే శక్తిగా మారకుండ ఉండాలంటే ఏం చేద్దాం?

శక్తిని ఆదా చేద్దాం

శక్తిని తక్కువగా వాడదాం అంటే అవసరం మేరకే ఉపయోగిద్దాం. ఉదాహరణకి అవసరం లేనప్పుడు విద్యుత్ సాధనాలను అపి వేయటం, అభివృద్ది చెందిన తక్కువ విద్యుత్ తో పనిచేసే సాధనాలు, ఇంధన సామర్థ్యం అధికంగాగల వాహనాలు ఉపయోగించటం...

ప్రత్యామ్నాయాలను వెదుకుదాం

చాలాకాలం పాటు ఏ ఇబ్బంది లేకుండా పెద్దమొత్తంలో, తక్కువ ధరలో వచ్చే సమర్థవంతమైన ఇంధనాలు కనుగొనటం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సౌరశక్తి, బయోమాస్, పవనశక్తి... లపై ప్రత్యేక దృష్టి సారించింది.

కొత్త ఆలోచన, కొత్త ఆవిష్కరణ సాధ్యం కావాలంటే శాస్త్రీయ ఆలోచనతో నిరంతర పరిశోధన చేయాల్సి ఉంటుంది. కొత్త విషయాన్ని ఆవిష్కరించాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీకు తెలుసా? ధామస్ అల్వా ఎడిసన్ 1878లో బల్బు  కనిపెట్టారు. దానిని కనిపెట్టాటానికి ఆయన 1600 రకాల ఫిలమెంట్ లను తన ప్రయోగాలలో వాటి చూశాడు. చివరికి తన సహాయకుడి తల వెంట్రుకను కూడా ఫిలమెంట్ లా వాడి చూశారట.

చూసారా, చీకటి పోవాలంటే, వెలుగు రావాలంటే ఎంత ప్రయత్నించాలో...

అందుకే మనం ప్రాజెక్టులు చేద్దాం చలో చలో... చలో...

ఇంధన సమర్థత ఎంత?

చిన్న మార్పులతో 30% వరకు వంటగ్యాస్ లేదా కిరోసిన్ ను ఆదా చేసుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయేత్తర ఇంధన వనరుల అభివృద్ది సంస్థ (NEDCAP) ఒక పరిశోధనలో తెలిపింది.

 1. గ్యాస్ వృధా కాకుండా వంట చేయటానికి ముందు సామగ్రి అంతా రెడీ చేసుకుంటున్నారా?
 2. అవును/లేదు

 3. ఫ్రెషర్ కుకింగ్ వినియోగిస్తున్నారా?
 4. అవును/లేదు

 5. వంట పరిమాణాన్ని బట్టి నీటిని వినియోగిస్తున్నారా?
 6. అవును/లేదు

 7. ఉడుకు రాగానే మంటను తగ్గిస్తున్నారా?
 8. అవును/లేదు

 9. తృణ ధాన్యాలను వండే ముందు నీటిలో నానబెజుతున్నారా?
 10. అవును/లేదు

 11. వంటకు లోతు లేని, వెడల్పాటి గిన్నెలను ఉపయోగిస్తున్నారా?
 12. అవును/లేదు

 13. వండేటప్పుడు పాత్రపై మూత పెడుతున్నారా?
 14. అవును/లేదు

 15. గ్యాస్ బర్నర్ ను తరుచుగా శుభ్రం చేస్తున్నారా?
 16. అవును/లేదు

 17. పాత్రల అడుగు భాగం పరిశుభ్రంగా ఉంచుతున్నారా?
 18. అవును/లేదు

 19. మీరు, మీ కుటుంబం అందరూ కలిపి భోజనం చేస్తారా?
 20. అవును/లేదు

ఈ ప్రశ్నావలి సహకారంతో సమాచారం సేకరించి అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారంతో ఇందనం ఎంత వృదా అవుతుందో, ఎందుకు వృధా అవుతుందో, వృధా కాకుండా ఉండటానికి ఏం చేయాలో సూచుంచవచ్చు.

ఏదేని ఒక ద్విచక్ర వాహనం తీసుకొని దానిలో

 1. పెట్రోల్
 2. పెట్రోల్ + ఇథనాల్ (20%, 30%, 10%)
 3. పెట్రోల్ + ఇథనాల్ + ఆముదం (5%, 7%, 9%)
 4. పెట్రోల్ + ఇథనాల్ + కొబ్బరినూనె
 5. పెట్రోల్ + ఇథనాల్ + ఇతర ఆయిల్

లను ఉపయోగించి ఇంధనాల నిష్పత్తులు మారుస్తూ ఒకే రోడ్డుపై, ఒకే వాహనంలో, ఒకే వ్యక్తితో, ఒకే వేగంతో, ఒకే పరిస్థితులల్లో వాహనాన్ని నడిపి వాహన Fuel efficienceyను కనుగొనే ప్రాజెక్టులు చేయవచ్చు కదా.

ఆధారం: వి. గురునాధరావు, యం. శ్రీవాణి

3.00313479624
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు