పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శరీరంలోని చెక్ పోస్టు – కాలేయం

శరీరంలోని కాలేయం గురించి తెలుసుకుందాం.

jun007.jpgపచ్చ కామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనబడుతుందంటారు. వారి కళ్లు, ఒకోసారి శరీరం కూడా పసుపు రంగులోకి మారతాయి. దీనికి కారణం వారి కాలేయం దెబ్బతినటం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో భర్తలు చనిపోయిన ఒంటరి స్త్రీలు ఎక్కువగా ఉన్నట్లు ఒక సర్వేలో గుర్తించారు. దీనికి కారణాలు విశ్లేషిస్తే పేద కుటుంబాల్లో మద్యానికి బానిసలైనవారు సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కాలేయ వ్యాధులతో, కామెర్లతో చనిపోయినట్లు గుర్తించారు. అనేక కుటుంబాలు వీధి పాలుకావడానికి మద్యం కారణమవుతుంది. ఈ ఆల్కహాల్ ప్రభావానికి మన శరీరంలో మొదట గురయ్యేది కాలేయం (Liver). దాని గురించి తెలుసుకుందాం.

మన శరీరంలో అతి పెద్ద గ్రంథి కాలేయం. కార్జం అని కూడా పిలుస్తాం. దీని బరువు పెద్ద వారిలో 1.2 నుండి 1.5 కిలోల వరకుంటుంది. శరీర కుహరంలో డయాఫ్రంకు క్రింది భాగంలో కుడివైపున ఉంటుంది. ఇది రెండు తమ్మెలను (Lobes) Cystic కలిగి ఉంటుంది. కాలేయపు ప్రతి తమ్మె duct Hepatic Lobules తో తయారై పలుచటి సంధాయక కణజాలంతో కప్పబడి ఉంటుంది. క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణాలు చెప్పబడే Hepatic Cells తో నిర్మించబడి ఉంటాయి. ఇవి క్రమపద్ధతిలో ప్రధాన సిరకు అనుసంధానించబడి ఉంటాయి.

Hepatic Cells పైత్య రసాన్ని (Bile) స్రవిస్తాయి. దీనిలో ఎంజైమ్ లుండవు. బిలిరూబిన్, బిలివర్జిన్ అనే వర్ణకాలు (Pigments) ఉంటాయి. పైత్య రసం చిక్కబడి పిత్తాశయం (Gall Bladder)లో నిలువ ఉంటుంది. ఏం పనులు చేస్తుందో తెలుసుకుందాం.

  1. పిండి పదార్థాలు (Carbohydrates), క్రొవ్వు పదార్థాలు (Fats) జీర్ణం చేయడంలో సహకరిస్తుంది.
  2. jun008.jpgప్రోటీన్స్ జీర్ణం కావడం వల్ల విడుదలయ్యే అమ్మోనియాను యూరియాగా మార్చి విసర్జిస్తుంది.
  3. విష పదార్థాల ప్రవేశాన్ని అడ్డుకొని శరీరాన్ని కాపాడుతుంది.
  4. ప్రోటీన్ ల సంశ్లేషణలోను, రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే ఫైబ్రినోజన్, ప్రోత్రాంబిన్ లను ఉత్పత్తి చేస్తుంది.
  5. Kupffers Cells అతి పెద్ద భక్షక కణాలు. ఇవి శరీరంలోకి వచ్చే విషపదార్థాల(Toxins)ను నియంత్రిస్తాయి.

అందుకే మన శరీరంలో కాలేయాన్ని ఫస్ట్ చెక్ పోస్ట్ అంటాం. విష పదార్థాలు, వ్యర్థాలు, ఆల్కహాల్ ఏవైనా శరీరంలోకి ప్రవేశిస్తే మొదట hepatic portal vein ద్వారా కాలేయంలోకి ప్రవేశిస్తాయి. కాలేయం వాటిని విషరహిత పదార్థాలుగా మారుస్తుంది. అధికంగా సారాయి తాగే వారిలో వెదట కాలేయం దెబ్బతింటుంది. ఇది Liver Cirrhosis అనే కాలేయ వ్యాధికి దారి తీస్తుంది. అదే కాలేయ క్యాన్సర్ గా కూడా రావచ్చు. మన శరీరంలో తనకు తాను చికిత్స చేసుకొనే భాగం ఏదన్నా ఉందంటే అది కాలేయం మాత్రమే. తనను తాను పునఃసృష్టి (Regenerate) చేసుకుంటుంది.

ఆ అవకాశం కూడా దానికివ్వకపోతే మరణం తప్పదు. పైత్యరసం జీర్ణవ్యవస్థలోకి కాకుండా రక్తంలోకి చేరడం వల్ల పచ్చకామెర్ల వ్యాధి వస్తుంది. ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటం ప్రధాన లక్షణాలు. పరిశుభ్రమైన నీరు త్రాగకపోవడం దీనికి ప్రధాన కారణం. విశ్రాంతి తీసుకుంటూ, సులభంగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో నూనె పదార్థాలు లేకుండా చూసుకోవాలి. వైరస్ ల వల్ల వచ్చే కామెర్లను తెల్ల కామెర్లు అంటాం. ఇది రక్త పరీక్షలోను కనిపించవు. వీటినే హెపటైటిస్ ఇ గా పిలుస్తారు. ఒకసారి లివర్ పాడైతే దాన్ని సరిచేయడం సాధ్యం కాదు. దానికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఒక్కటే మార్గం. అది అతి ఖరీదైనది, అనేక జాగ్రత్తలతో కూడినటువంటింది. (వేరొకరి లివర్ ను అమర్చడాన్నే ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం). మనల్ని నిత్యం కాపాడే కాలేయంను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కామెర్లు వచ్చిన వారు పసరు వైద్యాలు, నాటుమందులతో అనేక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటూ వైద్యుల పర్యవేక్షణతో సరియైన ఆహారం తీసుకుంటే మన కాలేయాన్ని కాపాడుకోవచ్చు.

ఆధారం: వీరమాచనేని శరత్ బాబు.

2.99401197605
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు