హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / సంపూర్ణ సూర్య గ్రహణం – సాపేక్ష సిద్దాంతం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంపూర్ణ సూర్య గ్రహణం – సాపేక్ష సిద్దాంతం

సంపూర్ణ సూర్యగ్రహణాలు పరిశీలించాక సాపేక్ష సిద్దాంతం అక్షర సత్యమని రుజువైపోయింది.

అది క్రి.శ. 1550 ఆగస్టు 21వ తేది. ఫ్రాన్సులో సూర్యగ్రహణం ఆ దినం పట్టబోతోందని ముందుగానే ప్రకటించేశారు. ఇంకేముందీ? ప్రభుత్వం పడిపోతుందని కొందరూ ప్రభుత్వం పైపోతుందని కొందరూ, ప్లేగు వ్యాపిస్తుందని కొందరూ ప్రపంచమంతా వరదల్లో మునిగిపోతుందని కొందరు ప్రచారాలు ప్రారంభించారు. ఇక చూసుకోండి ఫ్రెంచి ప్రజలు తలుపులు ముందుగానే బిడాయించి కూచున్నారు. కొందరైతే అడవుల్లో కొండగుహల్లో దాక్కొన్నారు. అసలు సమయం దగ్గర పడేకొద్ది ఈ భయాందోళనలు మరింత ముదిరి చాలామంది పాపులు ప్రీస్టుగారి దగ్గర తమ తప్పులు ఒప్పేసుకున్నారు. ఇలా ఒప్పేసుకోనేవారి రద్దీకి హద్దూ పద్దు లేకపాయింది. ఈ రద్దీకి తట్టుకోలేక పండితులు గ్రహణాన్ని పదిహేను రోజులు పోదిగించేశారు. ఆ పిచ్చి జనం పాపం గ్రహణం అరిష్టం వస్తుందన్నా నమ్మరు. పోస్టుపోన్ అయిందన్నా నమ్మారు.

ఇలా గ్రహణాల మీద ఎన్ని పువ్వులు పుశాయో! ఎన్ని కుక్క మూతి పిందెలు కాశాయో ! ఎన్ని మూడ నమ్మకాలు స్దిర నివాసం ఏర్పర్చుకొన్నాయో లెక్కలేదు,. సైన్సు పెరిగే కొద్ది ఈ నమ్మకాలు సరికొత్త జడలు విరబోసుకొంటున్నాయి కూడా.

కాని గ్రహణాలు , ప్రత్యేకించి సంపూర్ణ సుర్యగ్రహణాలు పరిశోధకులకు ఎంతో ఇష్టమైనవి. ఎన్నో అద్భుత రహస్యాల్ని చెంధించుకొనేందుకవి ఎంతో మంచి అవకాశాలు!

మహాభారత యుద్దంలో కృష్ణుడు సైంధవున్ని పంతం పట్టి సుర్యాస్తమయం లోగా చంపుతానని ప్రతిజ్ఞ చేసినపుడు  సాయంత్రం ఘడియలు దగ్గర పడేటప్పుటికీ కృష్ణుదు సూర్యబింబాన్ని సుదర్శన చక్రంతో కప్పెశాడని మనం విన్నాం. ఒక వేళ అది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు గాదా అని మణి చరిత్రకారులు అరా తీశారు. కురుక్షేత్రం మీదుగా సుర్యస్తామయానికి ముందు సంపూర్ణ సృయగ్రహణం వెళ్ళిన సమయాన్ని నిమిషాలతో సహా లెక్కగట్టి కంప్యూటర్లకి పనిబెట్టి మన మహాభారత యుద్ధ కాలాన్ని నిర్ణయించే యత్నం చేశారు.

అరిస్టాటిల్ మహాశాయుడైతె గ్రహణం నాడు చంద్రుడి మీద పడుతున్న భూమి నిడ ఆధారంగా భూమి గోళాకారంగా ఉందని మొట్టమొదట చెప్పగల్గాడు.

మన సాపేక్ష సిద్దాంతానిక్కుడా సూర్యగ్రహణం సాయపడిందంటే మీరు నమ్ముతారా? బోడిగుండుకు మోకాలికి చుట్టరీక మేక్కడిదని ఎద్దేవా చేస్తారా? సాపేక్ష సిద్దాంతం అనేకా నేక సమకాలీన సిద్దాంతాల్ని మూలంతో సహా కదిలించి వేసిన సిద్దాంతం . కాని ఇదంతాగణిత పాండిత్యమే తప్ప రుజువేది? సామాన్యుడి కావాల్సింది దృగ్గోచరమయ్యే ఋజువు కదా! ఐన్ స్టీన్ ఈ రుజువుకోసం సంపూర్ణ సుర్యగ్రహణాన్ని ఆశ్రయించాడు.

బరువైన వస్తువుల పరిసరాల్లో సాపేక్ష సిద్దాంతం ప్రకారం స్పేస్ వంకరగా ఉంటుంది. వాస్తువు బరువు సామిప్యం పెరిగే కొద్ది ఈ వక్రత పెరుగుతుంది. వస్తువు నుంచి దూరం వెళ్లేకొద్ది ఇది తగ్గుతుంది. పట్టాలు వంపు తిరిగినపుడు రైలు వంపు ననుసరించి వెళ్ళినట్టు బరువైన వస్తువు దరిదాపుల్లో పయనించే వస్తువు ఏదైనా సరే విధంగా వక్రాకాశంలోంచి వంకరగా ప్రయాణిస్తుందంటుంది సాపేక్ష సిద్దాంతం.

నక్షత్రం నుండి బయలుదేరిన శాంతి కిరణం సుర్యగోళం ప్రక్క నుంచి దూసుకొంటూ ప్రయాణం చేసినపుడు సూర్యుని దగ్గర వంపు తిరిగిన స్పేస్ వల్ల తానూ వంగుతోంది. ఆ కిరణం వింత కోణంలో వంగుతుందో ఐన్ స్టీన్ లెక్కగట్టాడు. కాని ఇంట స్వల్పమైన కారణాల్ని లెక్కించి సాపేక్ష సిద్దాంతాన్ని రుజవు చెయ్యగల సున్నిత పరికరాలున్నంత మాత్రాన సరిపోదే. ప్రకాశవంతమైన మాత్రాన సరిపోదే. ప్రకాసవంతవమైన సూర్యకంటిలో నక్షత్రాలు కన్పించవు గదా! వాటిని చూడ్డం ఎలాగ? ఆ కోణాన్ని కొలవడం ఎలాగ? దినికొక్కటే మందు. గ్రహణ సమయంలోనైతే చక్కగా చూడొచ్చు!

అంతే! ఈ మహాదావకాశం కోసం శాస్త్రవేత్తలంతా కాచు క్యుచున్నారు. ఎప్పుడంటే అప్పుడొచ్చే సూర్యగ్రహణం కాదు. గ్రహణ సమయంలో ప్రకాశవంతమైన నక్షత్రాలు సూర్యుడికి దగ్గరలో ఉండాలి. అలాంటి నక్షత్రాలు సూర్యుడు తిరిగే దారిలో వృషభరాశిలో ఉన్నే. సూర్యుడు వృషఫభరాశిలో మే నెల చివర ఉంటాడు. అప్పుడొచ్చే సుర్యగ్రహణమైతే చక్కగా సరిపోతుంది. ఆ గ్రహణం కూడా నేలమీద బాగా కన్పించాలి. సముద్రాల మీద మాత్రమే కన్పిస్తే భూమి మీదలాగా స్దిరమైన టెలిస్కోపులు స్పెక్ట్రాస్కోపులు, కెమెరాలు మార్చుకోవడం కష్టం. అందులోనూ గ్రహణం మితమధ్యహ్నమైతే మంచిది. అన్నట్టు ఆకాశం మేఘావృతం కాకుండా కూడా ఉండాలి సుమా!

ఇన్ని లక్షనాలుండే సంపూర్ణ సూర్యగ్రహణం 1919 మే 29న వచ్చింది. ఐన్ స్టీన్ సిద్దాంతాన్ని ఋజువు చేసి చూసేందుకు ఎక్కడెక్కడి శాస్త్రజ్ఞలు భారి ఎత్తున ప్రయత్నాలు మొదలెట్టారు. అప్పటికింకా మొదటి ప్రపంచ యుద్దపు భీభత్సం కనమరుగు కాకున్నా ఖగోళ శాస్త్రజ్ఞలు ఎల్లలు దాటి టన్నుల కొద్ది బరువైన పరిశోధన సామగ్రి పుచ్చుకొని, వేలమైళ్ళు ప్రయాణించి నెలలు ముందుగానే గ్రహణ మార్గంలో మకాం వేశారు!

సంపూర్ణ సూర్యగ్రహణం రెండున్నర నిమిషాలు అద్భుతంగా నిర్మలాకాశంలో కన్పించింది. పట్టపగలు మిట్టమధ్యానం సంజచికట్లు ముసురుకొచ్చాయి. శాస్త్రవేత్తలు సూర్యుడి దగ్గరి నక్షత్రాల్ని ఫోటోల్లో బంధించారు . ఆ తర్వాత అక్కడే మరో మూడు నెలల మకాం వేసి సూర్యుడా స్ధానం దాటి వెళ్లాక మళ్లి అదే నక్షత్రాల్ని ఫోటో తీశారు.

రెండు ఫిల్ముల్ని పోల్చిచూస్తే నక్షత్రాల స్దానంలో కాంతికిరనపు వంపు ఫలితంగా తేడా కన్పించింది,. ఒక్కసారి గాదు పలుసార్లు, ఒక్క కొలతలు గాదు వందల కొలతలు ఇలానే తర్వాత గూడా తిస్లుకొన్నారు. ఐన్ స్టీన్ చెప్పిన 1-74 సెకనుల వంపుకి కొంచెంత తగ్గినట్లు మొదట కన్పించినా మరిన్ని సంపూర్ణ సూర్యగ్రహణాలు పరిశీలించాక సాపేక్ష సిద్దాంతం అక్షర సత్యమని రుజువైపోయింది. అంతరిక్షంలోని ఒక మహద్బుతం ఇలా ఒక మహా సిద్దాంతాన్ని రుజువు చేయడానికి దోహదపడింది.

ఆధారం: వి. బాలసుబ్రమణ్యం

2.99392097264
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు