హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / సైన్సు మానవ కళ్యాణానికా ? వినాశనాలికా ?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సైన్సు మానవ కళ్యాణానికా ? వినాశనాలికా ?

మానవుడు తినమనుగడ కోసం జరిపిన పోరాటంలో, అనేక కొత్త విషయాలను కనుగొంటూ, తన జీవితాన్ని సుఖమయం చేసుకొన్నాడు. ఇలా మానవుడి అనుభవాల నుండి పుట్టిందే సైన్స్. నాటి రాతియుగం మానవుణ్ణి, నేటి రాకెట్ యుగం మానవుడిగా మార్చింది సైన్స్. గ్రహాంతర జీవకోటి ఉనికిని అన్వేషిస్తోంది సైన్స్.

ఆకులు అలములు తిని ఆరోగ్యం కాపాడుకున్నM.jpg దశ నుండి, జన్యుపట రహస్యాలను సైతం ఛేదించి, అనేక వ్యాధులను అంతరింపజేయడానికి కృషి చేస్తోంది సైన్స్. క్షణాల్లో సమాచారాన్ని విశ్వవ్యాప్తంగా చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జీవ రహస్యాన్ని ఛేదించి, క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టికి ప్రతి కృష్టి చేయగల శక్తి మానవాళికి మనకూర్చింది.

సైన్స్ మానవ సౌభాగ్యానికీ, సంతోషానికీ, అభివద్ధికి ఉపయోగపడిందనడానికి ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.

సైన్స్ మానవ కళ్యాణానికే కాదు. వినాశనానికి, కూడా కారణం కాగలదని 1945 ఆగస్టు, 6న జరుగిన ఒకానొక సంఘటన నిరూపించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ లోని హిరోషిమా నగరం మీద మొట్టమొదటి అణుబాంబును ప్రయోగించింది. ఫలితంగా ఎంతో ఆస్తి, ప్రకృతి వనరులతో పాటు లక్షలాది మంది మరణించారు. మానవ దుర్మార్గానికి సాక్ష్యంగా లక్షలాది మంది వికలాంగులుగా మారారు. ఇంతటి ఘోర వినాశనానికి కారణమైన ఆ అణుబాంబుకు వారు పెట్టుకున్న ముద్దు పేరు లిటిల్ బాయ్, ఈ దృష్కృత్వానికి యావత్ ప్రపంచం తల్లడిల్లింది. మానవత్వం సిగ్గుతో తలదించుకుంది. ఆటంకాలు నిర్మాణానికి కృషి చేసిన ఎందరో శాస్త్రవేత్తలు, గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ వినాశకర సంఘటన నుండి కోలుకోక ముందే ఆగస్టు 9వ తేదీన జపాన్ లోని నాగసాకి పట్టణం పై మరో ఫ్లూటోనియం బాంబు పేలింది. మానవ జాతి సైన్సు చరిత్రలో ఈ రెండు పేజీలు రక్తాన్ని పులుముకున్నాయి.

ప్రపంచ శాంతి కోసం సైన్స్ ఉపయోగపడాలనీ వినాశనానికి కాదని ఎందరో శాంతిని కోరే శాస్త్రవేత్తలు ఎలుగెత్తి చాటారు.N.jpg అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్ట్ 6వ తేదీని హిరోషిమా డే ను ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించారు. అణుశక్తిని బాంబుల తయారీకి కాకుండా మానవ కళ్యాణానికే ఉపయోగపడాలన్న శాస్త్రవేత్రతల కలలు నేటికీ నెరవేర లేదు. అమెరికా లాంటి దేశాలు ఇతర దేశాలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడానికి విపరీతంగా అణు బాంబులు నిర్మించి, బెదిరిస్తూ బేరమాడుతూ మరోవైపు శాంతి సూత్రాలు వల్లిస్తున్నాయి. అమెరికా తాను మాత్రం అణ్వాయుధాలు తయారు చేస్తూ, అనేక ఇతర దేశాలను, అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకాలు చేయాలని వత్తిడి తెస్తున్నది.

ప్రపంచ శాంతి విఘాతం కల్గించే రీతిలో అమెరికా అణ్వాయుధాలను తయారు చేస్తున్నది. తనకు ప్రతికూలంగా ఉన్న దేశాధినేతలను దించడానికి ఆ దేశాలపై యుద్ధం ప్రకటిస్తున్నది. ఇటీవల అమెరికా మన దేశంతో కుదుర్చుకొన్న అణు ఒప్పందం ద్వారా మన అణు స్థావర రహస్యాలన్నీ బట్టబయలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిన్నారులూ మనం సైన్సును మానవ కళ్యాణానికి వినియోగించేవారిని అభిమానిద్దాం వినాశకారులను తరిమికొడదాం సరేనా.

3.03703703704
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు