పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి

కాలం విలువను గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఆ వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకోవటానికి మార్గం సులభమైనట్లే.

timeకాలం ఎంతో విలువైనది. ప్రతి క్షణం అమూల్యమైనది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వారే పనులను విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. కాలం విలువను గుర్తించి దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఆ వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకోవటానికి మార్గం సులభమైనట్లే.

కాలం ఎవరికీ కట్టుబడదు, మనమే కాలానికి కట్టుబడి ఉండాలి. పనిచేయటానికి అనువుగా మనకు కాలం కలిసి రాదు. కాలం చూసుకొనే మనం పని చేయాలి. కనుక కాలానికి – పనికి అన్యోన్య అవకాశం లభించదు. చేయాల్సిన పనులన్నీ కాలయాపన చేయకుండా సకాలంలో నెరవేర్చాలి. అందరికీ కాలపరిమితి ఒక్కటే, కొందరు ఆ కాలాన్ని సదివినియోగంపరుచుకుంటారు. మరికొందరు ఆ కాలాన్ని వృధా పరుస్తారు. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయాలి. వాయిదా వేయకూడదు. గడిచిన కాలం తిరిగి రాదు. చేయాల్సిన పనిని చేయాల్సిన టైం లో చేయకపోవడం, కాల హరణం చేయటమంటే టైం వేస్ట్ చేయటం. అలా చేయటం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ అలా అనుకుంటూనే సగం కాలం వేస్టు అయిపోతూ ఉంటుంది. ఆ సంగతి మనం గమనించం.

మనం చేసే పని చాలా సమయం తీసుకుంటున్నది అంటే మనకాపని చాలా కష్టంగా ఉందని తెలుస్తుంది. మనం చేయవలసినదంతా చేయలేకపోతున్నామని అర్థం. మనం ఆ పనిని మొదలుపెట్టి వదిలేస్తే అది మనకే ఒక సమస్యగా పరిణమిస్తుంది. సమస్యలున్న చోట తప్పకుండా కాలం వృధా అవుతుంది. సమస్య ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయ పరిష్కారాల వైపు దృష్టి పెట్టాలి. (క్రియేటివిటి తో ఉండాలి)

ఆ పని చేయటానికి టైం సరిపోలేదని అంటుంటాం. అది టైం సరిపోక కాదు, చేయటం ఇష్టం లేక. పని చేయాలనుకుంటే టైం దొరకకుండా వుంటుందా. చేయాలనే పట్టుదల లేకపోవడం, ఉద్దేశ్యం లేకపోవటం. సరియైన టైంలో పనులు ఎందుకు చేయలేమంటే...

  • చేయవలసిన పని మన దృష్టిలో అంత ముఖ్యమైనది కాదు గనుక.
  • చేయకపోవటం వల్ల వచ్చే నష్టం, ఇబ్బంది కాదని అనుకోవటం వల్ల.
  • ఇంతకంటే అతి ముఖ్యమైన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని అనుకోవడం వలన.
  • సమయానికి పూర్తి చేయాలనే స్పృహ లేకపోవడం వలన.

మనం చేయాల్సిన పనిని చేతకాకపోవడానికి గల కారణాలతో మనల్ని మనం మోసగించుకోవటం వల్ల మనమేమీ సాధించలేం. అసలు మనం చేయాల్సిన పనులు ఎందుకు నెరవేరటం లేదో నిజాయితీగా ఆలోచించాలి. మనమెందుకు సహాయంలో మనం చేయాలనుకునే పనులు చేయలేకపోతున్నాం. మనం లేచిన తరువాత ఏయే పనులు చేస్తున్నాం, వాటికి ఎంతకాలం పడుతుంది, మిగితా వేళల్లో ఏం చేస్తున్నాం, కాలం పట్ల మనకున్న సదవగాహనకు మనం చేస్తున్న పనులే నిదర్సనాలు. టైం చాలక పనులు చేయటం లేదా? లేదా టైమున్నా పనులు చేయాలనిపించక మనం పనులు చేయటం లేదా? మనకు కావల్సినదొక్కటే, మనం ఆ పని చేయాలని నిర్ణయించుకోవడం. పనిపై మనకు పట్టుదల, సకాలంలో చేయాలనే కార్యదీక్ష ఉండాలి. లక్ష్యంపై స్పష్టత ఉండాలి., అవగాహన, ఉత్సాహాన్ని పెంచుకోవాలి. మన పనులను ప్లాన్ చేసుకోవటం చూసి కొన్ని తెలుసుకోవచ్చు. మనకంటే బిజీగా ఉండే వ్యక్తులు పనులు ఎలా పూర్తి చేయగలుగుతారో తెలుసుకోవాలి.

  • బిజీగా ఉండేవారు వారి పనులను అర్జంటుగా నెరవేర్చుకుంటారు.
  • వారు చేయాలనుకున్న పనులకు ఒక టైం ఏర్పచుకుని ఆ టైం ను ఎట్టి పరిస్థితుల్లోను దాటనివ్వరు.
  • సకాలంలో వారి పనులను పూర్తి చేసుకునే టెక్నిక్సు వారికి బాగా అలవాటు వుంటాయి.
  • వారు చేయదల్చుకున్న పనులకు పూర్తి బాధ్యతలను వారు స్వీకరిస్తారు.

తోటి వారు మన నుండి ఆశించే పనుల ఒత్తిడిలో సకాలంలో మనమనుకున్న పనిని సాధించలేకపోవచ్చు.ఎలాంటి అడ్డంకులు ఎదురైనా మనం మాత్రం మన పనిని సకాలంలోనే పూర్తి చేయకపోతే పని పెరుగుతూనే ఉంటుంది.  చేయాల్సిన పనిని ఎంత టైం లో పూర్తి చేయగలమో అవగాహన వుండాలి. అది చాలా ముఖ్యం, ఆ టైం లోగా ఎట్టి పరిస్థితులలో మన పని పూర్తి కావాలి. ఆ విధంగా ప్లాన్ చేయలేకపోతే మనం ఏ పనిని చేయలేం.

మనం ఏర్పరుచుకున్న డెడ్ లైన్ కు పని పూర్తి కావాలంటే ఆ టైం నుండి వెనుకకు మన పనికి పట్టే కాలాన్ని లెక్క చూసుకొని అప్పుడు ఆ టైమ్ కు ప్రారంభించాలి. అంటే ఎప్పుడు పనిని ప్రారంభిస్తే డెడ్ లైన్ లోగా అది పూర్తి కాగలదనే సంపూర్ణ అవగాహన మనకుండాలి. మనం అనుకున్న డెడ్ లైన్ చాలా తక్కువైతే మరో విధంగా ఏర్పరుచుకోవాలి. ఈ విధంగా ప్లాన్ చేయటం వల్ల మనకున్న టైం లోగా మన పనిని పూర్తి చేయగలుగుతాం. సమయానికి ముందస్తు ప్రణాళిక వేసుకోవటం కీలకం.

ఆధారం: డి. ప్రేమాజీ

2.99488491049
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు