పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సముద్రం పొంగిన వేళ

ఎప్పుడు సముద్రం పొంగినట్లు మనం వార్తల్లో వినలేదు. కారణం ఏంటో చెప్పుకొందామా!

oct18మీరు ఎప్పుడైన సముద్రాన్ని చూసారా? చాలా బాగుటుంది కదా. పెద్దగా శబ్ధం చేస్తూ పెద్ద పెద్ద అలలు ఒడ్డుకు వస్తుంటాయి. ఒక అల వచ్చి వెళ్ళిన తరువాత ఇంకొక అల వస్తుంటుంది. కంటికి కనిపించేంత దూరం నీళ్ళుంటాయి.

ఇన్ని నీళ్ళు సముద్రంలోకి ఎక్కడునించి వచ్చాయి అనే అనుమానం కలుగుతుంది. మనకు తెలుసు నదులన్ని సముద్రంలో కలుస్తాయని. మనదేశంలోని జీవనదులు గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి లాంటివి, ఇంకా అమేజాన్, నైలు లాంటి ఇతర దేశాలలోని నదులన్ని సముద్రాలలో కలుస్తుంటాయి. మరి ప్రతి రోజు ఇన్ని నదులలోంచి నీళ్ళు కొన్నివేళ సంవత్సరాలుగా సముద్రంలో కలుస్తుంటే అందులో నీరు ఎక్కువైపోయి సముద్రం పొంగాలి కదా, ఎప్పుడు సముద్రం పొంగినట్లు మనం వార్తల్లో వినలేదు (ఒక్క సునామి వచ్చినప్పుడు తప్ప). కారణం ఏంటో చెప్పుకొందామా!

మన భూమిని నీటి గ్రహం (water planet) అంటారు. ఎందుకంటే భూమి 70% నీటితో నిండి ఉంది. భూమి మీద ఉండే నీటిలో 97.2% సముద్రాలలోనే ఉంటుంది. మిగితా 2.8% నీరు నదులతో, చెరువుల్లో, మంచుకొండల్లో (ద్రువాలు, హిమాలయాలలో) ఉంటుంది. పర్వతాల మీద మంచు కరిగి ఆ నీరు జీవనదులుగా ప్రవహిస్తుంటుంది. సముద్రం నీరు ఉప్పుగా ఉండడానికి కారణం ఈ జీవనదులు తమ నీటితో పాటు భూమి మీది లవణాలను నిరంతరం సముద్రంలో కలవడం వల్ల ఆ నీరు ఉప్పుగా మారింది.

భూమి మీద సముద్రం చంద్రుని వైశాల్యం కంటే 9 రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇంత విస్తీర్ణం ఉన్న సముద్రంలోనే నీరు ప్రతిరోజు ఎండ తాకిడికి ఆవిరిగా మారి వాతావరణంలో కలుస్తుంది. ఈ ఆవిరి మేఘాలుగా మారి చల్లబడి వానలుగా కురుస్తాయి. ఇలా సముద్రంలోన నీరు ప్రతినిత్యం నీటి ఆవిరిగా మారి వాతావరణంలో కలవడం వల్ల నదులు నుండి వచ్చే నీరు సముద్రంలోకి ఎక్కువ అవదు. ఈ విధంగా భూమి మీద సముద్రాలు ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు సముద్రాలలో నీటి పరిమాణం మారకుండా ప్రకృతి నియంత్రిస్తుంది. దీనినే హైడ్రోలాజిక్ సైకిల్ (Hydrologic Cycle) అంటారు.

భూమి మీద నీరు ఎప్పుడూ ఒకే పరిమాణంలో ఉంటుంది. అది నీరు, నీటి ఆవిరి లేక మంచు రూపంలో ఉంటుంది. ఇలా నీరు నిరంతరం తన రూపం మార్చుకోవడం వల్ల మనిషి బ్రతకగలుగుతున్నాడు. దీని కారణం ప్రకృతి. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాం.

ఆధారం: ఆనంద్

2.99371069182
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు