పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సావిత్రిబాయి ఫూలే

ఈనాడు ఆడపిల్లలు విద్యలో రాణిస్తున్నారంటే సావిత్రిబాయి ఫూలే చేసిన పోరాటాలు త్యాగలే కారణం.

jan19స్త్రీలకు విద్యను దూరం చేసిన సమాజంలో, అక్షరాలు నేర్వలేని అజ్ఞానంలో జాతి యావత్తూ మూఢనమ్మకాలతో కునారిల్లుతున్న. అంధకార యుగంలో భారతావనిలో ఒక వేగుచుక్క మెరిసింది. ఆమె తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి. 1831 వ సం. జనవరి 3 న మహారాష్ట్రలోని సతారా జిల్లా, నయాగావ్ గ్రామంలో లక్ష్మీబాయి, ఖండోజీలకు జన్మించింది. చిన్న తనం నుండే చురుకైన సావిత్రిబాయి. ఆటపాటల్లోనే గాక, వ్యవసాయంలో, పశుపోషణ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేది. చదువంటే చెప్పలేని మక్కువ. కానీ ఆనాడు బాలికలకు విద్య నిషేధం.

తొమ్మిదేండ్ల ప్రాయంలోనే 12 ఏళ్ల జోతిబాఫూలే తో బాల్య వివాహం. కానీ వారిద్దరి సహచర్యం మానవజాతి వికాసానికి బాటలు వేసింది. జోతిబా సావిత్రిబాయిని ప్రోత్సహించి చదివించాడు. నాటి ఆధిపత్య, అనాగరిక సమాజం మహిళలకు విద్య నిషేధమన్న భావజాలాన్ని బద్దలు కొట్టి మరీ స్త్రీలకు విద్యనేర్పేందుకు సిద్దమైంది. దాని కోసం 1847-48 లో అహ్మదాబాద్ లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది.

1848 జనవరి 1వ తేదిన అణచివేయబడిన నిమ్నవర్గాల బాలికల కోసం పూనేలో బడి తెరచిన తొలి భారతనారి సావిత్రి బాయిపూలే. ఆమె బహుజనుల కోసం బడి తెరచేనాటికి ఆమె వయసెంతో ఊహించగలరా? కేవలం 18! ఫూలే దంపతులిద్దరూ కలసి మొత్తం 52 పాఠశాలలు నెలకొల్పారు. ఆనాడు బడి పెట్టడం అంటే, అదీ అణగారిన ప్రజల కోసం అంటే కత్తి మీద సామే. ఎన్నో దాడులు, అవమానాలు జరిగాయి. 1849 లో వీరిద్దరినీ గ్రామ బహిష్కరణ కూడా చేశారు. ఇవన్నీ ఆమెలో అసమానతలు రూపుమాపాలనే సంకల్పాన్ని మరింత దృఢం చేశాయి.

స్త్రీలను చైతన్య పరచటం కోసం 1852 లో ‘మహిళా మండల్' పేరుతో సంఘాన్ని స్థాపించింది. 1873 లో జోతిబాతో కలిసి 'సత్యశోధక సమాజాన్ని’ నెలకొల్పి మూఢనమ్మకాల పై రాజీలేని పోరాటం చేసింది. ఈ నాడు అంటే దాదాపు 170 ఏళ్ల తర్వాత ఆడపిల్లలు విద్యలో రాణిస్తున్నారంటే ఆ తల్లి చేసిన పోరాటాలు, ఆమె చేసిన త్యాగలే కారణం సావిత్రిబాయిలా అన్యాయాన్ని ఎదిరించటానికి, సమాజాన్ని మార్చటానికి మనమెందుకు ప్రయత్నించకూడదు. ఆమె స్ఫూర్తిని నిలబెట్టే బాధ్యత కూడా మనదే కదా!

3.0147601476
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు