పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సౌర తుఫాన్

సౌర తుఫాన్ విషయాలను తెలుసుకొందామా!

jun5చెకుముకి నేస్తాలూ! సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారి దట్టమైన నల్లని మేఘాలు, ఉరుములు మెరుపులు, పిడుగులతో అల్లకల్లోలంగా పంటకు, చెట్లకు, ఇండ్లకు తీవ్ర నష్టంచేయటం మీరు గమనించే ఉంటారు కదూ!

మరి సౌరతుఫాన్ ఎలా ఉంటుంది? మీరు ఊహించే తుఫాన్ లా ఉంటుందా? అది ఎలా ఏర్పడుతుంది? దానిని ఎలా గుర్తించవచ్చు అనే విషయాలను తెలుసుకొందామా!

అప్పుడప్పుడు సౌరతుఫాన్లు భూమిని తాకుతూనే ఉంటాయి. వాటి మనుగడను చూడలేము, వినలేదు. కానీ భూవాతావరణంలో తీవ్రమైన మార్పులకు కారణమవుతాయి. సూర్యుడు కాంతివంతంగా వెలిగే ఏ మార్పూ జరగని ద్వీపం అనుకొంటారు. కదూ! కానీ సూర్యుడు ఘన స్థితిలో ఉన్న వాయుపులతో మనం నమ్మలేనంత మండుతున్న పెద్ద గోళంలా ఉంటుంది. అలాంటి మండుతున్న సూర్యగోళంలో అప్పుడప్పుడు సంభవించే విస్ఫోటనంతో అత్యధికశక్తి జ్వాలలు, వర్తులాకార ఎర్రని కాంతులతో ద్రవ్యరాశి అతివేగంతో వెలువడుతుంది. సూర్యునిలో సంభవించే ఈ అసాధారణ చర్యతో విద్యుదావేశాలు, అయస్కాంత క్షేత్రాలు ప్రవాహంలా భూమి వైపునకు గంటకు 30 లక్షల మైళ్ళ వేగంతో దూసుకొని వచ్చి తాకినప్పుడు మిరుమిట్లు కొలిపే నార్దరన్ లైట్స్ (Northern lights) ఆర్కిటిక్ మృత సమీప పర్యావరణంలో కనిపిస్తాయి. దీనినే సౌర తుఫాన్ అంటారు. హిరోషిమా, నాగసాకి నగరాలపై ఒక్కొక్క అణుబాంబుకే లక్షలాది ప్రజలు బలి అయినారు. నేల నిస్సారమైనది, రెండు నగరాలు శిథిలమైనాయి.

jun6సూర్యునిలో అత్యధిక విస్పోటం జరిగినప్పుడు వంద కోట్ల అణుబాంబులు పేలితే వెలువడే శక్తి కంటే ఎక్కువ శక్తి వెలువడి, ఆ శక్తి సౌర జ్వాలల రూపంలోను, ఆవేశం గల ప్లాస్మా పుంజాల రూపంలోనూ గంటకు లక్షల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. ఆవేశం గల ప్లాస్మా పుంజాలను కరోనల్ మాస్ ఎజెక్షన్లు (Coronal Mass Ejections) (CMES) అంటారు. ఈ CMES భూమిని ఢీకొన్నప్పుడు భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి కృత్రిమ ఉపగ్రహాలకు, విద్యుత్ పవర్ గ్రిడ్లకు అంతరాయం. కలిగిస్తాయి. ఫిబ్రవరి 2011 లో సౌరజ్వాలలతో సంభవించిన సౌరతుఫానుతో బలమైన కరోసల్ మాస్ ఎజెక్షన్ జరిగి మొత్తం చైనాలో రేడియో ప్రసారాలు ఆగిపోయాయి.

నేస్తాలూ! ఒక సౌరతుఫాన్తో జరిగే నష్టం సుడిగాలి తుఫాన్ (hurricane)తో జరిగే నష్టానికి 20 రెట్లు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సౌరజ్వాలల ఆవృతి 11 సంవత్సరాల కాలచక్రంగా సౌరతుఫాన్ ల అధ్యయన శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సూర్యుడిలో అత్యధిక క్రియాశీలత ఉన్నప్పుడు ఒకరోజులోనే చాలా సౌరతుఫాన్లు వచ్చే అవకాశమున్నదని, క్రియాశీలత తక్కువ ఉన్నప్పుడు వారంలో ఒక సౌరతుఫాన్ కూడ రాకపోవచ్చని అధ్యయనాలు చెపుతున్నాయి.

నేస్తాలూ! సూర్యుని ప్రస్తుత క్రియాశీలత ఆధారంగా అత్యధిక సౌరతుఫాన్లు 2024 సంవత్సరంలో సంభవించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.

ఆధారం: ప్రొ. ముండ్రా ఆదినారాయణ

2.98795180723
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు