హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / స్పేస్ క్యాప్సుల్ రికవరి ఎక్స్పెరిమెంట్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్పేస్ క్యాప్సుల్ రికవరి ఎక్స్పెరిమెంట్

స్పేస్ క్యాప్సుల్ రికవరి ఎక్స్పెరిమెంట్ ద్వారా కలిగే ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం.

rocketనెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట సమీపాన ఉండే శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మన భారతదేశం రాకెట్లు ప్రయోగిస్తున్న విషయం మీకు తెలుసుగా. అక్కడినుంచే 28.6.2004 సోమవారం నాడు ఒక కొత్త ప్రయోగం మనవాళ్ళు నిర్వహించారు. ఈ ప్రయోగం ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు మాత్రమే చేశాయి. ఇలాంటి ప్రయోగం చేయగలిగే దేశాల సరసన మన భారత్ కూడా చేరుకొంది. ఈ ప్రయోగం ఏమిటి? దాని ప్రయోజనాలేంటో తెలుసు కుందాం.

మన సైంటిస్టులు అప్పుడప్పుడు శ్రీహరికోట నుంచి రాకెట్లు వదులుతుంటారు. కదా. ఆ రాకెట్లు ఉపగ్రహాలని నిర్ణీత కక్ష్యలో వదులుతారు. ఇలా ఉపగ్రహాలని నిర్ణీత కక్ష్యలో వదలడానికి 3 దశల్లో రాకెట్లు పేలుస్తారు. మొదట భూమి మీదనుంచి ప్రయోగించిన రాకెట్టు ఉపగ్రహాన్ని కొంతదూరం మోసుకెళ్ళిన తరువాత దాని పని అయిపోతుంది. అప్పుడు రెండోదశ ఉపగ్రహాన్ని మోసుకెళ్ళే పని చేపడుతుంది. అలా రెండోదశ రాకెట్టు కూడా కొంతదూరం వెళ్ళిన తరువాత మూడవదశ రాకెట్టు ఈ పనిని చేపడుతుంది. ఇలా ఉపగ్రహాన్ని మూడు దశలుగా రాకెట్టు నిర్ణీత కక్ష్యలోకి చేరుస్తుంది. మొన్న మనవాళ్ళు నిర్వహించిన కొత్త ప్రయోగం ఏంటంటే ఇలా మూడు దశలుగా వెళ్ళే రాకెట్టుకు ఉపయోగించే మోటార్లు కోట్ల రూపాయలు చేస్తాయి. ఇవి ఒక్కొక్క దశలో వాటి పని అయిపోయిన తరువాత రాకెట్టు నుండి విడిపోయి పడిపోతాయి. ఇలా పడిపోయేటప్పుడు ఒక్కోసారి అవి కాలిపోతాయి కూడా. కాబట్టి ఇంతకుముందు ప్రతి ఉపగ్రహ ప్రయోగం జరిగేప్పుడు ఎన్నో కోట్ల విలువైన మోటార్లను మనం నష్టపోయేవాళ్ళం. అలాకాకుండా దశలవారీగా విడిపోయే విలువైన మోటార్లను సురక్షితంగా సంగ్రహించి మళ్ళీ ఉపయోగపడేలా చేసుకొనే పద్ధతి ఈ కొత్త ప్రయోగం ద్వారా సాధ్యమవుతుంది. దీనిని స్పేస్ క్యాప్సుల్ రికవరి ఎక్స్పెరిమెంట్ అంటారు. 28.6.2004 నాడు 16, 720 అడుగుల ఎత్తునుండి ఒక 500 కేజీల బరువున్న క్యాప్సుల్ ను హెలికాప్టర్ ద్వారా భూమిమీదకు జారవిడిచారు. ఈ క్యాప్సుల్ మొడట శరవేగం గా భూమివైపు ప్రయాణించింది. ఒక దశలో దాని గమనాన్ని నియంత్రించే విధంగా ప్యారాచూట్ తెరుచుకొంది. అంతేవేగంగా క్రిందకు పడే క్యాప్సుల్ స్పీడ్ కి బ్రేక్ పడింది. ఎవరో ఎక్సలేటర్ తగ్గించినట్టుగా నెమ్మదిగా కులుకుతూ వయ్యారంగా క్యాప్సుల్ పులికాట్ సరస్సులో పడింది. సురక్షితంగా చిన్న దెబ్బకూడా తగలకుండా భూమికి చేరిన క్యాప్సుల్ ని చూసిన మన సైంటిస్టుల ఆనందానికి అవదుల్లేవు. వాళ్లు చిన్నపిల్లల్లా ఆనందంగా గెంతులు వేస్తూ ఒకర్నొకరు కౌగిలించుకొన్నారు. ఇక నష్టపోకూడదని మన సైంటిస్టులు చేసిన ప్రయోగాలు సఫలం అయ్యాయి. ఇలా దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అనేక కొత్త ప్రయోగాలు సైంటిస్టులు చేస్తుంటారు. సైన్సు మానవాళి అభివృద్ధికి ఉపయోగపడాలి కానీ వారి వినాశనానికి కాదు. మీరు కూడా బాగా చదివి మంచి మనస్సున్న సైంటిస్టులవుతురుగా.

3.00487804878
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు