పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్వైన్ ఫ్లూ

Be Aware Of Swine Flue .

2000 సం. నాటికి అందరికీ ఆరోగ్యం అన్న ఐక్యరాజ్య సమితి పిలుపు నేటికీ గగన కుసుమంగానే మిగిలిపోయింది. వైద్యం ప్రభుత్వాసుపత్రుల్ని వదిలి కార్పొరేట్ కౌగిట్లో చిక్కుకుంది. ప్రజలు దిక్కుతోచక ఉ క్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉన్న జబ్బులకే వైద్యం దొరక్క బిక్కుబిక్కుమంటుంటే స్వైన్ ఫ్లూ వంటి కొత్త కొత్త జ్వరాలతో బెంబేలెత్తిపోతున్న జనం. దీన్ని సైతం సొమ్ము చేసుకునే దుర్మార్గం మన కళ్ళముందు కనబడుతుంది. నిత్యం జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ ఆలోచన' (Scientific Temper) ఏ రకంగా అవసరమో విప్పిచెప్పాలి. ఉదాహరణకు స్వైన్ ఫ్లూనే తీసుకుందాం. ఇది H1N1 అనే ఒక వైరస్తో వచ్చే వ్యాధి. ముఖ్యంగా ఇది పందులకు వచ్చే జబ్బు. పందుల నుండి మనుషులకు సోకిన దాఖలాలు లేవు. కానీ రెండు వేల సం. ప్రాంతంలో ఈ వైరస్ కొన్ని దేశాల్లో (ఫిలిప్పీన్స్) మనుషులకూ వచ్చింది. ఇటీవల మనదేశంలో కూడా రావటం చూస్తున్నాం. మన హైదరాబాద్లో సైతం ఈ సారి ముప్ఫైమందికి పైగా ఈ వ్యాధి బారిన పడి మరణించారు. ప్రజలు భయంగు ప్పెట్లో గజగజలాడుతున్నారు. 'భయం' అనేది వ్యాధి కన్నా ప్రమాదకరం. అందుకే శాస్త్రీయంగా ఆలోచించాలి. అవగాహన పెంచుకోవాలి. ఈ సం. 'సైన్సు డే'కి ఇది మన బాధ్యత కావాలి. కావలసింది అవగాహన, ఆందోళన కాదు. ప్రజలకు ధైర్యం చెప్పాలి.

feb0018.jpgస్వైన్ ఫ్లూ కూడా అన్ని వైరస్ ల్లాగే సామాన్యమైన , ఫ్లూ జ్వరం కలిగించే జీవి. ఆరోగ్యవంతులకు ఇది సోకినా దానంతటదే వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఏటోచ్చి ఇది మన దేశంలో ఉన్న వైరుస్ కాదు కాబట్టి మనలో దాన్ని నిరోధించే శక్తి కొంత తక్కువ. క్రమంగా మనలో కూడా ఆ నిరోధక శక్తి వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన పోషక ఆహారం తీసుకోవటం అవసరం. అన్నింటికీ మించి పరిశుభ్రత ఆరోగ్యకరమైన అలవాట్లు చాలా అవసరం. తరుచుగా చేతులు కడుక్కోవటం, దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ఇతరులకు హాని కలిగించకుండా రుమాలును లేదా దస్తీని అడ్డుపెట్టుకోవటం చేయాలి. వైరస్ అనేది రోగి నుండి బయటకు వచ్చాక ఎక్కువ సేపు బతకదు. కొన్ని క్షణాల్లో చనిపోతుంది. ఇది సత్యం. కాబట్టి భయం వద్దు. వ్యక్తిగతం గానూ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవటం ఈ వ్యాధినే కాదు ఎన్నో వ్యాధుల్నుండి మనలను రక్షిస్తుంది. మన స్కూళ్లు, మన పిల్లలకు శుభ్రతను ఒక అలవాటుగా, బాధ్యతగా నేర్పాలి. అది మన సంస్కృతిలో భాగం కావాలి. శాస్త్రీయ అవగాహన అంటే ఏదో బ్రహ్మపదార్థం కాదు. మనం ఆరోగ్యంగా ఉండటం - ఇతరులు ఆరోగ్యంగా ఉండేందుకు ఏ తోడ్పడటం - అంతే!

2.99703264095
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు