অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆరోగ్య భోజనం

ఆరోగ్య భోజనం

"అరేయ్, చిన్ని!బాబాయిని, నాన్నను భోజనానికి రమ్మను నాన్నా"! వంటింట్లోంచి కేకేసింది అమ్మ మహాలక్ష్మి.

హల్ లో టీ.వీ. చూస్తున్నానని "అలెగేనమ్మా "! అంటూ రేమోతు పక్కన పెట్టి పైన గెస్ట్ రూమ్ కు వెళ్ళాడు. "నాన్నా ! బాబాయిని, నిన్ను అమ్మ అన్నం తినడానికి రమ్మంటోంది " అని చెప్పి వాష్ రూమ్ కి వెళ్ళాడు.

కిందికి దిగి వస్తున్నా జగదీష్ కి నోట్లో వేలు పెట్టుకొని టీ. వీ చూస్తున్న నిక్కీ కనపడింది.

"హాయ్ నిక్కీ ."అంటూ పాపను ఎత్తుకుని,నోట్లో వేలు పెట్టుకోకూడదమ్మా., తప్పు అంటూ వేలు పక్కకు తీపించాడు.

"ఎందుకు .....?"ముద్దుగా అమాయకంగా అడిగింది.

"చేతికి క్రిములు ఉంటాయి. దుమ్ము ఉంటుంది. అవి నోట్లోకి వెళితే ఆరోగ్యానికి ప్రమాదంరా అందుకని, తెలిసిందా?" అంటూ బుగ్గపై ముద్దు పెట్టాడు.

"ఓ హు! అందుకేనా, మా టీచర్ అన్నం తినే ముందు చేతులు శుభ్రాంగా కడుక్కోవాలి చెప్పింది."అన్నది.

ఆ... అవును. వెరీ గుడ్. నీకు చాల విషయాలు తెలుసురా! అంటూ బుగ్గన ముద్దు పెట్టాడు.

ఆ...ఆ... సరేసరే.. బాబాయి కూతుళ్లు తరువాత తీరిగ్గా మాట్లాడుకున్డురు గని, ముందు కాళ్ళు చేతులు కడుక్కుని రండి. టైం ఒంటి గంట దాటుతోంది." అంది మహాలక్ష్మి.

"ఆ...లా....గే.."అంటూ , "నిక్కీ! కాళ్ళు చేతులు కడుక్కుని వద్దామా ? మరి ...."అంటూ వాష్ రూమ్ వైపు నడిచాడు జగదీష్.

చిన్ని మహాలక్ష్మి, ఆనందరావుల కొడుకు. పేరు నిఖిల్,7 వ తరగతి చదువుతున్నాడు. చాలా తెలివిగలవాడు. వాడిని 'చిన్ని ' అనీ, కూతురు నిఖితను 'నిక్కీ', అనీ ముద్దుగా పిలుచుకుంటారు. నిక్కీ 3 వ తరగతి చదువుతున్నది. పిల్లలిద్దరూ చాలా చురుకైనవారే. క్రమశిక్షణ కలిగినవారును. ఆనందరావు తమ్ముడు జగదీష్ తన సొంత ఊరు సుబ్బరాజుపల్లెలో డాక్టర్ గా పని చేస్తున్నాడు. మంచి హస్తవాసి ఉన్నవాడిని ఊరిలో పేరు. తన సొంత ఊరిలోనే సేవలు అందించాలని అతని ద్యేయం. ఆపల్లె, పట్నానికి 245కి. మీ .లా దూరంలో ఉంటుంది. అందుకే, వీలు దొరికినప్పుడు ఆలా వాచిపోతుంటాడు. చిన్ని, నిక్కీ లంటే చాలా ప్రేమ. అన్నయ్య, వదినలు పై అభిమానం. ఎందుకంటే, తండ్రి చిన్నప్పుడే చనిపోతే అన్నయ్యే చదివించాడు. పిల్లలకు కూడా బాబాయ్ అంటే చాలా ఇష్టం.

ఆనందరావు ఎలిమెంటరీ చదువు చదువుకున్న తెలివితేటలున్నవాడు. మహాలక్ష్మి కూడా అంటే. వారిది పట్నంలో ఫాన్సీ వ్యాపారం. హాస్పిటల్ లో కాస్త తీరిక దొరికిందని, ఆదివారం అంట ఇంట్లో ఉంటారని, ఒక పూత వారితో గడిపి వెళదామని వచ్చాడు జగదీష్.

వాష్ రూమ్ నుండి ఆనందరావు, వచ్చేసరికి అందరికి భోజనం వడ్డించడం పూర్తి అయింది. "ఆ ... ఇక మాట్లాడకుండా తినందమ్మ !" అంది మహాలక్ష్మి తాను మాత్రం వడ్డించుకోలేదు.

"వదినా! నీవు కూడా వడ్డించుకో. మధ్యలో అవసరమైతే .. ఎవరికి కావాల్సినవి వారు వడ్డించుకుంటారులే"అన్న జగ్గు మాటలకూ తాను కూడా వడ్డించుకోసాగింది.

ఇంతలో నిక్కీ "అమ్మ ! ఖుషి టీవీ పెట్టు."అన్నది.

"మీ బాబాయ్ అన్నం తినేటప్పుడు టీవీ పెట్టనివ్వడమ్మా!"ఆనందరావు అన్నాడు.

"ఎందుకూ?"నిక్కీ అమాయకంగా ప్రశ్నించింది .

"మనం ఏ పని చేసేటప్పుడైనా, ఆ పనిపై కాన్సంట్రేషన్ ఉండడానికి!' అన్నాడు జగ్గు.

"అంటే....?" మరల సందేహ వ్యక్తపరిచింది.

"అంటే... ఏకాగ్రత. దీనినే ద్యాస/శ్రద్ధ అనీ కూడా అంటారు. మనం ఏ పని చేసిన ఆ పనిపై ద్యాస ఉంచాలి. ఇప్పుడూ...నీవు బజారుకు నడిచి వెళుతున్నావనుకో. నీవు అక్కడ చుప్ నడవాలి?

"రోడ్డుమీద"

"బడిలో హోంవర్క్ ఇస్తారు కదా. అప్పుడు పక్కకు చూస్తూ చేస్తావా ? నోటుబుక్ వైపు చూసి చేస్తావా?" "నోటుబుక్  వైపు"

"ఆ.. వెరీ గుడ్ .. అలాగే బడిలో చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుల వైపు చూడాలి. తినేటప్పుడు మనం తినే పదార్థాలు వైపు చూడాలన్నమాట ఆలా పనిపై ద్యాస పెట్టడం మంచిది. "ఇవన్నీ చెబుతుంటే  అందరు  తినకుండా జగదీష్ వైపే చూడసాగారు.

అవ్వరు ఏమి మాట్లాడలేదు. నిక్కీ మాత్రమే చూడకపోతే ఏమవుతుంది?" మరల ప్రశ్న సంధించింది.

"మా నిక్కీ వెరీ గుడ్ గర్ల్ అంటా... తినేటప్పుడు మాట్లాడకూడదంట. కాబట్టి, ఇప్పుడు వెంటనే దిక్కులు చూడకుండా భోజనం చేస్తుందంటా...చేశాక మంచి మంచి కబుర్లు, చాలా గొప్ప విషయం చెబుతానంటా..." అన్నాడు జగ్గు.

ఆ మాట వినగానే నవ్వుతు తినడం ఓరారంభించింది. తనతో పటు అందరు నిశ్శబదంగా భోజనం పూర్తి చేశారు.

జగదీష్ చదువుకున్నవాడని ఆనందరావుకి మహాలక్ష్మి లకు చాలా గౌరారం. పిల్లలకు కూడా తాను వచ్చినప్పుడు చాలా చాలా కొత్త విషయాలు చెబుతుంటాడు కూడా. తాను డాక్టరుగా తక్కువ ఖర్చుతోనే మంచి వైద్యం చేస్తాడు. ఇలా పట్నం వచ్చినప్పుడు మంచి మంచి పుస్తకాలను కొంటాడు ప్రతిరోజు చీకట్లోనే నిద్రలేచి వాటిని చదువుతుంటాడు. తన విజ్ఞానాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉంటాడు. అందుకే తాను చెప్పే విషయాలన్ని చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలైనా, పెద్దలైనా డాక్టర్ చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారు. నిక్కీ చిన్ని, వాళ్ళ అమ్మానాన్నలు అంతే.

భోజనం చేశాక పిల్లలిద్దరినీ పైన గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లాడు జగ్గు. బెడ్ పై బాబాయికి ఎదురుగా కూర్చున్నారు ఇద్దరూ.

కూర్చోగానే, "బాబాయ్!తినేటపుడు మాట్లాడకూదన్నావ్. టీవీ చూడకూదన్నావ్. ఎందుకని?"చిన్ని అడిగాడు.

"అవును చెప్పు బాబాయ్ "చేతులు పట్టుకుని అడిగింది నిక్కీ కూడా.

"ఆ...ఆ... చెబుతా.. చెబుతా... వినండి అంతే కాదు. మీరు అన్నం తినేటప్పుడు చేసిన తప్పులు కూడా చెబుతాను"అంటూ ప్రారంభించాడు.

'అన్నం తినేటప్పుడు తప్పుచేశారనగానే...'పిల్లలకేమి అర్థం కాకా జగ్గు చెబుతున్న విషయాలపై దృష్టి పెట్టారిద్దరూ.

అన్నం తినేటప్పుడు మాట్లాడమనుకోండి. తినే ఆహరం ఆహారణాలములో దరి తప్పుతుంది. శ్వాసనాళములోకి చొరబడుతుంది. ముక్కులోకి వెళుతుంది. అక్కడి మ్యూకస్ పోరా దెబ్బ తింటుంది. దీన్నే మనం 'పోరా తప్పడం లేదా పొరబోవడం ' అంటాము. ఆలా పలుసార్లు జరిగితే శ్వాసకోశ సమస్యలు వస్తాయి తెలిసిందా ?"

"ఓ! అందుకేనేమో బాబాయ్, నాకు ఇంతకు ముందు చాలా సార్లు పొరబోయింది. అప్పుడు ముక్కు మంటబట్టి ఏడ్చానుకూడా. ఇంకెప్పుడు తినేటప్పుడు మాట్లాడాను బాబాయ్"అన్నాడు చిన్ని.

"నేను కూడా..."అర్థమయినట్లు అన్నది నిక్కీ.

"మరి ఇవన్నీ సరే. తినేటప్పుడు తప్పులు చేశామన్నావ్?" చిన్ని ఆసక్తిగా అడిగాడు.

"అరేయ్. నీ ప్రశ్నలు, తెలుసుకోవాలనే ఆసక్తి చూస్తుంటే, నువ్వు ఖచినఁగ సైన్టిస్ట్ అవుతావని అనిపిస్తోందిరోయ్ "

బాబాయ్ అన్న ఆ మాటకు చిన్ని ఉప్పొంగిపోయి,"నిజంగానా బాబాయ్!అయ్.. నేను సైన్టిస్టును అవుత, నేను సైంటిస్టును అవుత.." అంటూ ఆనందంతో చేతులు ఎగరేశాడు.

నిక్కీ.., "నేను కూడా .. నేను కూడా .., " అనీ చేతులు ఎగరేసింది.

"ఆ.. ఆ .. సరే.. సరే.. మరి, కూరలో వేసిన కరివేపాకును తినకుండా పారేశారు. తప్పు కదా"!

"అదేంటి బాబాయ్ ! కరివేపాకు పారేయక, తింటారా/ అవ్వరన్న ! అమ్మ, నాన్నా కూడా పారేశారుగా", నిక్కీ సందేహం వెలిబుచ్చింది.

"సరే, అయితే, కరివేపాకు వలన లాభాలు చెబుతాను =, వినండి కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ ఉండడం వలన రక్తహీనత ర్యాంమివ్వదు. ఇందులో పీచు పదార్థం ఉంటుంది. అందువలన బరువు పెరగకుండా చేస్తుంది. యాన్తి ఆక్సిడెంట్లు ఉండడం వలన, రక్తంలోని చేదు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అప్పుడు గుండె జబ్బులు రావన్నమాట."

"ఆమ్మో!" అంటూ ఇద్దరూ నోళ్లు వెళ్ళబెట్టారు. "అయితే, రేపటినుండి మేము కరివేపాకును కూడా తినేస్తాం. 'కరివేపాకు.. జిందాబాద్ '' అంటూ గలగలా నవ్వారు.

"వెరీ గుడ్ ." అంటూ మెచ్చుకున్నాడు జగదీష్. "ఆ.. ఇంకో తప్పు అంతంతే, మీరు అన్నం నోట్లో పెట్టుకోగానే గబగబా నమిలి మింగేస్తున్నారు. అది కూడా తప్పే.

అనగానే, "ఆ.. అవునా !' అంటూ, ముఖం అదోరకంగా పెట్టాడు చిన్ని.

"ఆ.. అవునూ... ప్రతి ముద్దా బాగా నామాలలో. ఇలా నిదానంగా ఆహరం నమలడం వలన నోట్లో లాలాజలం బాగా ఊరుతుంది. దాంతో జీర్ణక్రియ బాగా జరుగుతుంది".

"ఓహు .. మన నోట్లో ఉన్న పళ్ళన్నీ సార్లు అన్నమాట."అంటూ చిన్ని నోట్లో పళ్ళను చూపిస్తూ అనగానే, నిక్కీ, 'హి...హి ...హి ,,," అంటూ నవ్వింది.

అయితే సరే బాబాయ్ ! ఇకనుండి బాగా ...నమిలే తింటాం" అన్నాడు.

అన్నం తినేటప్పుడు టీవీ చూడొద్దన్నావ్?" నిక్కీ భాదను వ్యక్తపరిచింది.

"ఊ.....అవునూ మరి... ఆ సంగతీ చెబుతాను వినండి." అంటూ చెప్పడం ప్రారంభించాడు.

"టీ.వీ . చూస్తూ అన్నం తిన్నామనుకోండి. తినే పదార్థాలు రుచులను ఆస్వాదించలేము. అలాగే, మనం ఎంత తింటున్నామో?అర్థం కాదు. అందువలన, తినాల్సిన దానికంటే ఎక్కువగా కూడా తింటాము. కనుక, అధిక బరువు వస్తుంది. ఆరోగ్యం పాడవుతుంది.

అంతేకాదు. అన్నం తింటూ సెల్ ఫోన్ చూడడం, మాట్లాడడం ..., వార్తాపత్రికలూ, పుస్తకాలూ చదవడం లాంటి పనులు కూడా చేయకూడదు. దాని వలన కూడా మనం తినే తిండి పై ఏకాగ్రత ఉండదు.

"ఆమ్మో ! టీ.వీ . చూస్తూ అన్నం తింటే ఇన్ని సమస్యలా?" చిన్ని ఆశ్చర్యపోయాడు.

"ఊ ....మరి, అందుకే అన్నం తినేటప్పుడు టీ. వీ. చూడకూడదనేది"

"అయితే, ఇక మీద తినేటప్పుడు టీ. వీ . చూడలేం బాబాయ్! మౌనంగా ఉంటాము .!" అంది నిక్క

ఇంతలో ఆనందరావు వాస్తు మెట్లపైనుండే ఏంటార్రా?బాబాయిని తీసుకోనివ్వకుండా గంటలతరబడి కబుర్లు పెట్టారు " అన్నాడు.

వెంటనే నిక్కీ "నాన్నా!నాన్నా!బాబాయి ఈ రోజు బోలెడు విషయాలు చెప్పారు. తెలుసా?

"అవునా! నా చిట్టి తల్లే...."అంటూ ఎత్తుకుని బుగ్గన ముద్దు పెట్టాడు.

"అరేయ్౧ జగ్గూ.....ఈ మధ్య నువ్వు రాకా చాల రోజులైందిగా. పద.., ఆలా సరదాగా సినిమాకు వెళ్ళొద్దాం" అనగానే ,

"అయ్ .... సినిమా.... నేను,... నేను......"అంటూ పిల్లలిద్దరూ సంతోషంతో ఎగిరి గంతులేశారు.

"మరి వెళ్ళి రెడీ అవ్వండి మరి ...."అన్నాడు ఆనందరావు. ఇద్దరు క్రిందికి హుషారుగా  వెళ్లారు.

అంతా కలిసి కారులో సాయంత్రం ఫస్ట్ షో సినిమాకు వెళ్లిపోయారు.

ఆధారం: చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate