অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గణితంపై ఇష్టం ఎలా పెంచుకుందాం

గణితంపై ఇష్టం ఎలా పెంచుకుందాం

పెద్దలందరూ గణితం ముఖ్యమని, గణితం నేర్చుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. కాని ఇష్టం లేకుండా చదువుకోవడం కష్టం కదూ! గణితం మన నిత్యజీవితంలో ఒక భాగం. మనకు తెలియకనే మనం గణితాన్ని ఉపయెాగిస్తుంటాం. నేటి శాస్త్రీయ సాంకేతిక విషయాలకు కూడా గణితం ముఖ్యం. గణితం ఒక చెట్టు అనుకుంచే ఆ చెట్టుకు కాసిన ఫలాలే శాస్త్రీయ సాంకేతిక విషయాలు. శాస్త్రీయ సాంకేతిక ఒక మాలగా అనుకుంటే అందులో కట్టి పెట్టి ఉన్న దారమే గణితం. గణితం గురించి తెలుసుకుంటే మనకు ఇష్టం పెరుగుతుంది. ఆ ఇష్టమే మిమ్మల్ని గణితం వైపుకు అడుగులు వేయిస్తుంది.

అమ్మ అన్నం చేసేటప్పుడు ఎన్ని కప్పుల బియ్యానికి ఎన్ని కప్పుల నీళ్ళు పోస్తుందో గమనించండి. అందులో ఏ గణిత భావన దాగి ఉందో ఆలోచించండి.

పాలు తీసుకునేటప్పుడు, దాని ఘన పరిమాణాన్ని ఎలా కొలుస్తున్నామో గమనించండి.

మనం ఏదైనా వస్తువులను, జంతువులను చూసినప్పుడు మన మెదడు మాటు ఆకారాలను, అవి ఆక్రమించిన స్థలాన్ని, వాటి బరువును లెక్కించుకుంటుందని మీకు తెలుసా!

మనం సమయాన్ని లెక్కింటి చెప్తున్నాం కదా! మనం చెప్పే తేదీలను ఖగోళ శాస్త్రజ్ఞులు లెక్కించి చెప్పినవే.

ఒక అంగడికి వెళ్ళినప్పుడు వస్తువుల ధరలను పోల్చుకొని ఏవి కొనాలి, ఏవి కొనకూడదు అని నిర్ణయించుకుంటాం కదా! వస్తువుల పై రిబేటును శాతంలో లెక్కిస్తాం.

మనకు జ్వరం ఉందా లేదా అని డిగ్రీలలో లెక్కించుకునే చెప్తాం.

రక్త పోటును గుండె సంకోచ వ్యాకోచాల నిష్పత్తి రూపంలో చూపెడతాం. వాతావరణాన్ని వార్తలలో స్టాటిస్టికల్ రూపంలో చూపెడతారు. ఏదైనా వస్తువును ఎత్తాలి అంటే దాని బరువును మనం ఉపయెాగించే బలం నిష్పత్తిని లెక్కించుకునే మనం వస్తువును ఎత్తుతాం.

సంగీతంలోని సరిగమలు కానివ్వండి, సంగీత వాయిద్యాలు కానివ్వండి మనం ఖచ్చితమైన సమయంలోనే వాటిని ఉసయెాగిస్తాం.

ఇంకా మనం వాడే కంప్యూటర్, సెల్ ఫోన్ ఇవన్ని కూడా పని చేయడం గణితం వల్లే సాధ్యపడింది. కంప్యూటర్, సెల్ ఫోన్ లో ఉన్న ఎలక్ట్రానిక్ వలయాలు ద్విసంఖ్యా మానం వల్లే పని చేస్తాయి.

మనలో ఇంతగా ముడివేసుకున్న గణితాన్ని నిత్యజీవితానికి ఉపయెాగించుకుంటూ నేర్చుకోండి. నేర్చుకోవటంలో ఉన్న ఆననందాన్ని అనుభవించండి.

ఆధారం యం.జి. శ్రీధర్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate