অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు

ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు

మానవ శరీరంలో అనేక రకాల బ్యాక్టీరియాలు కోటానుకోట్లుగా వుంటాయి. జీవకణంలో కలిగే రసాయనిక మార్పుల విషయంలో కాలేయం కన్నా జీర్ణాశయం పేగులే ప్రధానపాత్ర వహిస్తాయని పరిశోధనలలో తేలిన అంశం. మానవ ఆరోగ్య నిర్వహణలో జీర్ణాశయం ప్రధానపాత్ర పోషిస్తూ రోగనిరోధక శక్తి పెంపొందించుటలోనూ, ఆహారం జీర్ణం కావడంలోనూ తోడ్పడుతుంది.

మన శరీరంలో వుండే బ్యాక్టీరియాలు ప్రధానంగా రెండూ రకాలుగా వుంటాయి.

  • శరీర ఆరోగ్యాన్ని పెంపొందించేవి.
  • శరీర అభివృద్ధికి హానికలిగించే సాల్మోనెల్లా ఇ- కొలి, క్లాస్ట్రోడియా వంటివి.

వ్యక్తి తీసుకొనే ఆహారంపై ఉపయోగకర, హానికర బ్యాక్టీరియాల నిష్పత్తి వుంటుంది. ముఖ్యంగా యాంటిబయోటిక్స్ వాడినప్పుడు, జీర్ణించుకోలేని ఆహారం తీసుకున్నప్పుడు, విషతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, వాతావరణ ప్రభావంలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు వయస్సు మీద పడుతున్నప్పుడు ఇలా పలు కారణాల వల్ల శరీరంలో ఉపయోగకర బ్యాక్టీరియా పరిమాణం తగ్గిపోయి, హానికర బ్యాక్టీరియా పరిమాణం పెరిగిపోయి రోగ నిరోధక శక్తి తగ్గడం, వ్యాదుల తీవ్రత అధికంగా వుండడం, త్వరగా ముసలితనం రావడం వంటి దుష్పలితాలు ఏర్పడుతాయి. వీటి నుంచి రక్షణ పొండటానికి పరిశోధనల ద్వారా అభివృద్ధి పరచబడినవే ప్రొబయోటిక్ ఆహార పదార్థాలు.

మానవ శరీర అభివృద్ధికి తోడ్పడే జీవించి వున్న బ్యాక్టీరియాను నిర్జీత పరిమాణంలో ఆహారపదార్థాలలో చేర్చటం ద్వారా తయారు చేయబడే వాటిని ప్రొబయోటిక్ ఆహారపదార్థాలుగా వ్యవహరిస్తాయి. ఇటువంటి ప్రొబయోటిక్ ఆహారపదార్థాలను ఆహారంలో నిర్జీత పరిమాణంలో తీసుకున్నప్పుడు వాటిలో జీవించి వున్న బ్యాక్టీరియా వల్ల వ్యక్తి ఆరోగ్యం బాగవుతుంది. అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ సంయుక్తంగా తయారుచేసిన నివేదికలో ధృవీకరించటం జరిగింది.

307.jpgనిజం చెప్పాలంటే ఇది విరోచనాలతో బాధపడుతున్న వ్యక్తికి మనం పెరుగు తినిపించడం, మజ్జిగ తాగించటం లాంటిదే. ఎందుకంటే పెరుగుకూడా ఒక ప్రొబయోటిక్ పాల ఉత్పత్తే... నిల్వ చేసిన మజ్జిగ పులిసిపోతుందని అందరికీ తెలుసు. దీనికి శాస్త్రీయ కారణం అధికంగా బ్యాక్టీరియా ఉత్పత్తి కావడమే. బ్యాక్టీరియాతో కూడిన మజ్జిగను కాని చల్లార్చిన పాలకు చేర్చడం ద్వారా పెరుగు తయారవుతుంది. పాతకాలం వారికి బ్యాక్టీరియా, ప్రొబయోటిక్ వంటి పదాలకు అర్థాలు తెలీకపోయినా కొన్ని వేల సంవత్సరాలు క్రితమే పెరుగు తయారుచేయడం, దాని ప్రయోజనాలు మాత్రం తెలుసు.

రష్యన్ ఇమ్యూనాలజిస్టు అయిన Elie Metchnikoff వ్రాసిన The Prplongation of Life అనే పుస్తకంలో ఆహార పదార్థాలలో బ్యాక్టీరియాను చేరచడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. 1906 లో ఫ్రెంచి చిన్న పిల్లల వైద్యుడైన Herry Tesser విరోచనాలతో బాధపడుతున్న పిల్లలకు Bifido bacteria ను ఆహార పదార్థంలో కలిపి ఇవ్వటం ద్వారా pathogenic bacteria ను నశింపచేసి విరోచనాలను తగ్గించవచ్చని నిరూపించాడు. 1930 దశకంలో Minoru shirota అనే జపాన్ పరిశోధకుడు Lactic Acid bacteria (LAB) ద్వారా పాల ఉత్పత్తిల రుచిని పెంచడమే కాక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరచవచ్చని నిర్థారించారు.

308.jpgప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు ప్రయోగాలు అనంతరం ఆహార పదార్థాలలో ముఖ్యంగా పాల ఆధారిత ఆహార పదార్థాలకు ప్రయోజనకర బ్యాక్టీరియాను చేర్చడం ద్వారా వినియోగదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని నిర్ధారించారు. దీనికి ఉదా.. ప్రొ బయోటిక్ పాల ఉత్పత్తులు.

Lacto bacilli, Bifido bactiria, ఇతర LAB, Non – LAB తరగతులకు చెందిన రకాల బ్యాక్టీరియాలను ప్రొ బయోటిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రొ బయోటిక్ ఉత్పత్తులు - ప్రయోజనాలు

  • విరోచనాల నుంచి విముక్తి309.jpg
  • రోగ నిరోధక శక్తి వృద్ధి
  • అజీర్తి నుంచి రిలీఫ్
  • Lactose intolerence వల్ల కలిగే కడుపు నొప్పి నివారణ.
  • క్యాన్సర్ తీవ్రత తగ్గుదల
  • ఎలర్జీల నుంచి రక్షణ ప్రొబయోటిక్ ఆహారపదార్థాలపై జరుగుతున్న పరిశోధనలు మానవాళికి మరెన్నో ఆరోగ్యసేవలందిస్తాయని ఆశిద్దాం...

రచయిత: యం.హరి ప్రసాద్, సైదాపురం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/4/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate