অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మంచి నీళ్ళు తస్మాత్ జాగ్రత్త

మంచి నీళ్ళు తస్మాత్ జాగ్రత్త

సృష్టిలోని 'జీవ రసూళ్లన్నింటికీ ప్రాణాధారం నీళ్లు '. అసలు నీళ్లు లేకుంటే ఈ జీవం పుట్టేది కాదు. మనుషులకు, జంతువులకు , చెట్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఇలా ప్రతి పనిలోను నీళ్లు కావాలి. ఏ దేశంలో నీళ్లు సమృద్ధిగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి పథంలో ఉంటుంది. అంట ప్రతేక్యమైన నీళ్ళ చరిత్ర తెలుసుకుందామా ! ఈ భూపటలం పై 70  శాతం నీలున్నాయి. ఐనప్పటికిని నీటి కొరత వీపరీతంగా ఉంది. కారణం 97 శాతం నీళ్లు సముద్రాలలో, మంచు కొండలుగా ఉండడమే. అవి మన అవసరాలకు  ఉపయోగపడేవి కావు. కేవలం ౩ శాతం నీళ్లతో మన అవసరాలన్నీ తీరాలి. అన్ని నీళ్లు మంచి నీళ్లు కావు. మనం కేవలం మంచి నీలానే త్రాగాలి. రక్షిత మంచి నీళ్ళలో ఏ మోతాదులో లవణాలు ఉండాలో క్రింద పత్తిలో చుడండి.

సృష్టిలోని 'జీవ రసూళ్లన్నింటికీ ప్రాణాధారం నీళ్లు '. అసలు నీళ్లు లేకుంటే ఈ జీవం పుట్టేది కాదు. మనుషులకు, జంతువులకు , చెట్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఇలా ప్రతి పనిలోను నీళ్లు కావాలి. ఏ దేశంలో నీళ్లు సమృద్ధిగా ఉంటాయో ఆ దేశం అభివృద్ధి పథంలో ఉంటుంది. అంట ప్రతేక్యమైన నీళ్ళ చరిత్ర తెలుసుకుందామా ! ఈ భూపటలం పై 70  శాతం నీలున్నాయి. ఐనప్పటికిని నీటి కొరత వీపరీతంగా ఉంది. కారణం 97 శాతం నీళ్లు సముద్రాలలో, మంచు కొండలుగా ఉండడమే. అవి మన అవసరాలకు  ఉపయోగపడేవి కావు. కేవలం ౩ శాతం నీళ్లతో మన అవసరాలన్నీ తీరాలి. అన్ని నీళ్లు మంచి నీళ్లు కావు. మనం కేవలం మంచి నీలానే త్రాగాలి. రక్షిత మంచి నీళ్ళలో ఏ మోతాదులో లవణాలు ఉండాలో క్రింద పత్తిలో చుడండి.

All  the Parameters  are  in  ppm except pH
pH: 6.5-8.5 Hardness:200             Ca:75            Mg :30           Floride:1.5       Chloride:250      Nitrate: 45
Sulphate:200      Total solids : 500         Zn:5.0          As: 0.01           Cu: 0.05           Cr; 0.05           Fe: 0.3

మన భారత దేశంలో 55 శాతం ప్రజలు కేవలం నీళ్లను త్రాగుతున్నారు, మిగతా 45 శాతం ప్రజలు మంచినీళ్లు త్రాగుతున్నారు. ఇవి రక్షిత మంచి నీళ్లు కావు. దీనిని బట్టి మన ప్రభుత్వాలు రక్షిత మంచి నీటి విషయంలో ఎంత అజాగ్రత్తగా ఉన్నాయో తెలుస్తున్నది.నూటికి 80  శాతం జబ్బులు కేవలం కేవలం నీటి వలెనే వస్తాయి.అందువల్ల ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికి రక్షిత మంచి నీళ్లు చేరేటట్లు చేయాలి.తద్వారా ప్రజలు ఆరోగ్యాంగా ఉంటారు. అలాగే ప్రతి వ్యక్తి ౩-5 లీటర్ల మంచి నీళ్లు త్రాగాలి, తక్కువ మంచి నీళ్లు త్రాగినప్పుడు మూత్రము పసుపు రంగులో వస్తుంది. దీన్ని గుర్తు పెట్టుకొని తగినన్ని రక్షిత మంచి నీళ్ళనుత్రాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముక్యంగా నీళ్ళ వల్ల వచ్చే జబ్బులు ఫ్లోరోసిస్ అనే వ్యాధి చాల ప్రమాదకరమైనది. ఈ వ్యాధి మనం త్రాగే నీటిలో ఫ్లోరైడ్ గాఢత 1 .5 పామ్ (parts per million )కన్నా ఎక్కవగా ఉన్నప్పుడు వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా (WHO) త్రాగే రక్షిత మంచి నీటిలో ఫ్లోరైడ్ గాఢత 0 .4-1 .0 పిపియం రేంజ్ లో ఉండాలి. కానీ భరత్ ప్రమాణాల బ్యూరో (BIS)ప్రకారంగా ఫ్లోరైడ్ గాఢత ౦.4 -1 .5 పిపియం అంటే 1 లీటరు నీటిలో 1మి. గ్రా  ఫ్లోరైడ్ ఉన్నట్లు ).

ఆహారపుటలలవాట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫ్లోరైడ్ 0 .4 పిపియం కన్నా తక్కువగా ఉన్నాకూడా ప్రమాదమే . దంతాలకు సంబంధించిన జబ్బులు వస్తాయి.0 .4 నుండి 1 .0పిపియం ఫ్లోరైడ్ ఉన్నప్పుడు ఆ నీళ్ళు రక్షిత మంచి నీళ్ళు (ఫ్లోరైడ్ వరకు )కాబట్టి నిరభ్యంతరంగా ఆ నీళ్ళను త్రాగవచ్చు. ఫ్లోరైడ్ గాఢత 0 .4-1 .5పిపియం ఉన్నప్పుడు ఈ క్రింది ఆహారపు అలవాట్లను పాటిస్తూ త్రాగవచ్చును.

  1. టీ కాఫీ త్రాగవద్దు. ఎందుకంటే అందులో కూడా ఫ్లోరైడ్ ఉంటుంది.
  2. క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి ఊదా,రాగి మాల్టు.
  3. విటమిన్-సి ఆహారాన్ని తినాలి. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే మంచిది.
  4. ఆకు కూరలు ఎక్కువగా తినాలి. అందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
  5. చింతపండు రసం వాడటం మంచిది.

పై ఆహారపు అలవాట్లతో ఫ్లోరైడ్ 1 .5 పిపియం వరకున్న నీళ్ళు కూడా త్రాగవచ్చు . 1 .5 పిపియం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితులలో అలంటి నీరు త్రాగకూడదు. తద్వారా ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఏ వ్యాధికి చికిత్స లేదు, నివారణ లేదు, కేవలం రాకుండా చూసుకోవాలి. జీవితాంతం బాధపడుతూనే బ్రతకాలి. ఫ్లోరోసిస్ వ్యాధి లక్షణాలు.

  1. పళ్ళపై పసుపు పచ్చగార ఏర్పడుంది .(ప్రారంభంలో )
  2. కలం గడిచిన శరీరపు ఎదుగుదల ఉండదు, నిలవడం తలపైకి ఎత్తి చూడడం కూడా చేయలేరు.
  3. వేళ్ళు వంకరంగా తిరుగుతాయి.
  4. వ్యాధి ముదిరినకొద్దీ వెన్నుముక నాడీమండలం దెబ్బతింటుంది.

ఇంత భయంకర లక్షణాలున్న ఫ్లోరోసిస్ వ్యాధిని రాకుండా చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం త్రాగే నీటిలో ఫ్లోరైడ్ ఏమోతాదులో ఉందొ పరీక్ష చేయించాలి. దీనికొరకు ప్రతి జిల్లాలో ఉండే Public Health  Department ను సంప్రదించాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది క్యాన్ వాటర్ కొనుక్కొని త్రాగుతున్నారు. అందులో ఫ్లోరైడ్ అనుమతి మోతాదులో ఉందొ లేదో తెల్సుకోవాలి. అందుకొరకు మీరు వాటర్ ప్లాంటువారిని నీటి పరీక్షల రిపోర్టు అడగండి . వారు తప్పని సరిగా రిపోర్టు మీకు ఇవ్వాలి. ఇవ్వనప్పుడు మీరు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. భూగర్భ జలాన్ని శుద్ధిచేసే సమయంలో ఫైల్ట్రేషన్, ఆల్ట్రావయిలెట్ , యోగినేషన్ 12 రకాల శుద్ధి ప్రక్రియలు నిర్వహిస్తున్న వాటర్ ప్లాంటు 5శాతమైనా లేవు. అరకొర శుద్ధితోనే సరిపెడుతున్నారు. ఇలా ప్రమాణాలు పాటించిన వాటరుప్లాంటువారికి ISI సర్టిఫికెట్ లభిస్తుంది. ISI మార్కుఉన్నవారే వ్యాపారం చేయాలి. అందువల్ల ISI మార్కు ఉన్నదో లేదో చూసుకోండి. ISI ప్రమాణాల ప్రకారం సీసాలు ,క్యాన్లు, పాళీ ఇథిలీన్ పాళీ వినైలు క్లోరైడు , పాళీ ప్రొపైలీన్ లతో తయారైనవే వాడాలి. నాణ్యమైన బాటిళ్ళు,క్యాన్లు వాడకపోవడం వాళ్ళ నీటిలో త్వరగా బాక్టీరియా చేరుతుంది.

కాచి, చల్లార్చి వడపోసుకొని త్రాగినట్లే=అయితే బాక్టీరియా లాంటి క్రిములండవు, కాబట్టి ప్రతివారు ఇది పాటిస్తే మంచిది. జనవిజ్ఞాన వేదిక చెప్పేదేమిటంటే "స్నానానికి చన్నీళ్ళు- త్రాగడానికి వేడి నీళ్ళు ". స్నానం చాన్నేల్ల్లు ద్వారానైనా పర్వాలేదు. కానీ వేడిచేసి ,చల్లార్చింది నీటిని త్రాగడం ఆరోగ్యానికి చాల మంచిది కాబట్టి ఆ జాగ్రత్తలను పాటిద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

ఆధారం: చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate