অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జీవకణాల్లో బైనరీకోడ్

జీవకణాల్లో బైనరీకోడ్

254.jpgఈ కాలంలో కంప్యూటర్ల శక్తి విపరీతంగా పెరిగింది. 2+4+=6 లాంటి చిన్న లెక్కలను కంప్యూటర్లు ఒక సెకండులో మిలియన్ పైగా చెయ్యగలవు. మార్పులు జరుగుతున్నప్పుడు ఆ మార్పులను ఒక ఖచ్చితమైన పద్ధతిలో గుర్తించగల ఏ పదార్థంతోనైనా కంప్యూటర్ల నిర్మించవచ్చు.ఎలక్ట్రానిక్ కంప్యూటర్లు రాకముందు గడియారాలలో ఉండే పళ్ళచక్రాలలాంటి వాటిని వుపయోగించి కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం లెక్కలను చేయగల యంత్రాలను శాస్త్రజ్ఞులు తయారుచేశారు.

మొదట ఎలక్ట్రానిక్ కంప్యూటర్లులో గాజుగొట్టాలలో నింపిన పాదరసం ఉపయోగించటం ద్వారా కంప్యూటర్ల మెమొరీ భాగాన్ని చేసేవారు. ఒక ట్యాప్ కల్గిన నీళ్ళడ్రమ్, కొలత గ్లాసు వాడి నీళ్ల కంప్యూటర్ చేయవచ్చు. ఉదాహరణకు డ్రమ్ లో 4 గ్లాసులు 5 గ్లాసులు, 8 గ్లాసులు, నీళ్ళుపోసి తర్వాత 10 గ్లాసులు, 2 గ్లాసులు నీళ్ళు తీసివేసి డ్రమ్ లోని మిగిలిన నీళ్ళను గ్లాసుతో కొలిస్తే 5 గ్లాసులు నీళ్ళు వుంటాయి. అంటే మనం 0+4+5 +8-10- 2=5 అనే లెక్క కంప్యూటర్ A.L.U (Arthametic and logic unit) లో Accumulator ఉండే పద్ధతిలో చేసినట్లు చెప్పవచ్చు.

జపాన్ లోని సైంటిస్టులకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ప్రాణుల శరీర భాగలలో ఉండే కోట్ల జీవకణాలన్నిటిలో ఉండే డి.ఎన్.ఎ. (D.N.A.) అనే జీవ పదార్థం పొడుగైన హెలికల్ స్ప్రింగ్ వలె ఉండే నిచ్చెన ఆకారంలో ఒక పెద్ద తీగచుట్టలా వుంటుంది. దీనిపై మెట్ల వలె ఇంకా సూక్ష్మమైన జీవపదార్థాలు అమర్చబడి వుంటాయి. కణవిభజన పద్ధతిలో కొత్తకణాలు ఏర్పడేటప్పుడు డి.ఎన్.ఎ.(D.N.A.) తన యొక్క ఒక కాఫీని ప్రతి కొత్తక్రమానికి అందిస్తుంది.

మొదటి కణంలోని డి.ఎన్.ఎ. (D.N.A.) పై వున్న జీనోమ్ జీవపదార్థాలు ఏ వరుసలో అమర్చబడి వున్నాయో ఖచ్చితంగా అదే వరుసలో ప్రతి డి.ఎన్.ఎ. (D.N.A.) కాఫీలోను వుంటాయి. ఈ డి.ఎన్.ఎ పై వున్న జినోమ్ ల వరుస క్రమాన్ని మార్చగలిగితే ఆ జాతి ప్రాణుల శరీరంలోని ప్రతిభాగంలోని ప్రతిజీవకణంలో అదే మార్పును వీటి డి.ఎన్.ఎలో కల్గించవచ్చు. సైంటిస్టులు డి.ఎన్.ఎ. (D.N.A.) పై ఉన్న జీనోమ్ కణాల సముదాయాలను రెండు రకాల సముదాయాలుగా అమరిస్తే ఆ రెండు రకాల సముదాయాలను కంప్యూటర్ బైనర్ లాంగ్వేజ్ లోని 0.1 లుగా వాడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇట్టి 0,1 కోడ్ ను శరీరంలోని కోట్లాది కణాలలో శాశ్వతంగా మిలియన్ల సంవత్సరాల పాటు అంటే వేల తరాలపాటు ఉంచవచ్చని భావించారు. అప్పుడు శరీరంలోని కొన్ని భాగాలకు వచ్చే వ్యాధులకు కణాలే స్వంతంగా వైద్యం చేసుకోగలవు. అవసరమైతే అట్టికణాలు తమను తామే నిర్మూలించుకోగలవు. బయటి మందులు అవసరం ఉండదు.

ప్రయోగం కోసం వారు అత్యంత శుభ్రమైన, ఆరోగ్యవంతమైన దారుఢ్యం కల్గిన “BACILLUSSULTIS” అనే బాక్టీరియా జాతి ని ఎన్నుకొన్నారు. బాక్టీరియాలకు నోరు, చేతులు, కాళ్ళు లాంటి శరీరభాగాలు ఏమీ ఉండవు. పూసల దండల వలె అనేక వేల లేక లక్షల జీవకణాల సముదాయంలా ఒక ప్రత్యేక ఆకారం లేకుండ ఉంటాయి. వీటి జీవకణాలలోని డి.ఎన్.ఎ (D.N.A.) లో ఉన్న జినోమ్ కణాల సముదాయాలను బైనరీ భాషకు సరిపోయే 0.1 ల సముదాయాలుగా రెండు విధాలుగా అమర్చి తర్వాత అట్టి 0.1 ల సముదాయాలతో “E=mc 2 (1905)” అనే ఫార్ములాను సూచించే అక్షరాలు, అంకెల కోడ్ గా మార్చారు. (బైనరీ భాషలో ఏ అక్షరం, అంకె అయినా 0100100010111 లాగా వ్రాయబడుతుంది. అంటే ఈ బ్యాక్టీరియా జీవకణాల్లో “E=mc 2 (1905)” అనే కోడ్ చొప్పించబడింది.255.jpg కొన్ని రోజుల తర్వాత అంటే బ్యాక్టీరియా జీవితంలో అనేక తరాల తర్వాత పుట్టిన బ్యాక్టీరియాలోని జీవకణాలను పరిశీలించి చూడగా దానిలో 0101001 వంటి కోడ్ ఖచ్చితంగా “E=mc 2 (1905)” కి సరిపోయిన బైనరీ కోడ్ లోనే ఉన్నది. ఆ బ్యాక్టీరియాలోని ప్రతి జీవకణం డి.ఎన్.ఎ. (D.N.A.) లో ఈ ఫార్ములా శాశ్వతంగా ముద్రించబడింది. ఇది చాలా ఆశ్యర్యకరమైన విజయమే కాని బ్యాక్టీరియాల శరీరంలో నిర్మాణం అనేది ఏమీ ఉండదు. అంటే అది సాదారణ లాబరేటరీ పరికరంతో సమానం. ఈ ప్రయోగం జీవపదార్థంలో కంప్యూటర్ యొక్క బైనరీకోడ్ చొప్పించటం అనే సిద్దాంతాన్ని ఋజువు పర్చటానికి చేసిన ప్రత్యేక ప్రాముఖ్యం లేని ప్రయోగం మాత్రమే. ప్రతిజాతి యొక్క జీవకణాలోని డి.ఎన్.ఎ. (D.N.A.) లో ఆజాతి లక్షణాలను సూచించే కోడ్ వ్రాసి ఉంటుందని మనకు తెలుసు.

పై ప్రయోగం ఉపయోగం ఉన్నతశ్రేణి ప్రాణుల శరీరభాగాలలోని కొన్ని ప్రత్యేక జీవకణాల్లో వ్యాధులను నిర్మూలించటానికి మాత్రమే అనవచ్చు. ఇట్టి రీసెర్చీ అత్యంత క్లిష్టమైనది కొన్ని వేలమంది శాస్త్రజ్ఞులు దశాబ్ధాలపాటు శ్రమిస్తే కొన్ని శరీరభాగాలలోని జీవకణాలలో వ్యాధులు పోగొట్టటానికి వాటిలో Binary Language యొక్క 0.1 కోడ్ ను చొప్పించటం అనేది సాధ్యం అవుతుంది. ఈ విషయంలో 2004 సం||లో కొంతమంది ఇస్రాయెల్ శాస్త్రజ్ఞులు lung cancer నా నయం చేయటానికి అవసరమైన రసాయినాల శరీరకణాలె చేసుకునే పద్ధతిని Binary Language ద్వారా కనుగొన్నారని తెలియచేయబడింది.

256.jpgమనుషుల వేలిముద్రలకు జంతువుల వేలిముద్రలకు చాలా తేడా వుంటుందన్న సంగతి మీకు తెలిసిందే కదా..అయితే కోలా జంతువుల వేలిముద్రలు మాత్రం అచ్చం మనుషుల వేలిముద్రలనే పోలి వుంటాయి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/4/2022



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate