অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

డా ఏ. ఎస్. రావు

డా ఏ. ఎస్. రావు

డా ఏ. ఎస్. రావు

జననం: 20 సెప్టెంబర్ 1914

స్వగ్రామం: మెగలు (పశ్చిమ గోదావరి )

తల్లితండ్రులు: వెంకటాచలం, సుందరమ్మ

చదువు: ఎం. ఎస్ . సి , బనారస్ హిందూ యూనివర్సిటీ , వారణాసి .

వ్యవస్థాపన: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL ) (హైదరాబాద్)

మరణం: 31 అక్టోబర్ 2003 (హైదరాబాద్)

గుర్తింపులు: 1 . పద్మశ్రీ ( 1960 )

2 . శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ( 1965 )

3 . పద్మభూషణ్ ( 1972 )

4 . నాయుడమ్మ స్మారక స్వర్ణ పతకం ( 1989 )

5 . హైదరాబాద్ లోని ECIL దగ్గర వున్న కాలానికి ఆయన  పేరు పెట్టారు . (ఏ. ఎస్. రావు నగర్ )

6 . శతజయంతుయుతవాలా సందర్భంగా 16 నవంబర్ 2014 ఆయన చిత్రం గల పోస్టల్ కవర్ విడుదల.

అత్యంత బీద కుటుంబం లో వెంకటాచలం,  సుందరమ్మ దంపతులకు 25 సెప్టెంబర్ 1914 లో జమించిన అయ్యగారి సాంబశివరావు ఏ. ఎస్. రావుగా ప్రసిద్ధుడు. ఆయన స్వగ్రామం మెగలు లో తన పాఠశాల అబ్యాసం పూర్తి చేసాడు. పై చదువులు చదవడానికి డబ్బులేక పోతే తల్లి సుందరమ్మ ఎంతో బధ్రగా తాను దాచుకున్న పెళ్ళి పట్టుచీరను అమ్మింది. దానికి అప్పుడు పలికిన ధర కేవలం రెండు రూపాయలు , కానీ ఆ కలం లో ఆ రెండు రూపాయలకు ఎంతో విలువ ఉండేది. ఆ డబ్బుతో ఆయన వారణాసికి ప్రయాణం కట్టి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ ఆయన యం.ఎస్.సి పట్టని 1939 లో పొందాడు. తర్వాత ఆరేళ్ళు అదే యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థిగానూ, లెకచ్రరారుగాను పనిచేశాడు. 1946 లో టాటా ఉపకార వేతనం తో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం ( కాలిఫోర్నియా, అమెరికా )లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. అతడికి స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రోపేసర్ గా లక్ష యాభై వేల (ఇండియా కరెన్సీ లో ) జీతం యివ్వడానికి ఒప్పందం కుదుర్చుకోమని అడిగింది. కానీ, 'తను టాటా వారి ఉపకారవేతనంతో చదువుకున్నాను కాబట్టి తను తిరిగి భారతదేశానికి వెళ్తానని' ఏ. ఎస్. రావు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ యిచ్చిన ఆవకాశాని తిరస్కరించి వచ్చి టాటా ఇన్నిస్తూటే అఫ్ ఫాండమెంటల్ రీసెర్చ్ ( TIFR )లో  నెలకు కేవలం మూడు వందల రూపాయలు జీతానికి ఉద్యోగం లో చేరాడు. అక్కడే అతడికి డా|| హుమ్మి జె బాబా తో పరిచయం ఏర్పడింది. విష్వకిరణాల మీద ( Cosmic Rays) పరిశోధనతో ప్రారంభమైన అతని షధశక్తులు క్రమంగా ఎలక్ట్రానిక్ సాధన నిర్మాణం (instrumentation ) వైపు మళ్ళాయి. అతడు బాబా అణుపరిశోధన కేంద్రం ( Bhabha Atomic Research Center- BARC ) లో అనుధర్మక ప్రసారంలో ఆరోగ్య పరిరక్షణ, ఎలక్ట్రానిక్స్ విభాగానికి డైరెక్టర్ గా ఉండేవ

1953 లో ట్రాంబేలో ఆయన హూమి జె బ్ బాబా ,ఎన్. బి ప్రసాద్ , రాజా రామన్న , యల్ .ఎం . సింజివలా తో కలిసి 'అప్సర' (జలదేవత) అనే అణు రియాక్టర్ కి రూపకల్పన చేసి, దాని నిర్మాణంలో పాల్గొన్నాడు. అగస్ట్ , 1956 లో అది పనిచేయడం ప్రారంభించిన మొట్ట మొదటి అణురియాక్టరు. రేడియో ఐసోటోవుల ఉత్పత్తి, వాటిని వైద్యరంగంలోను పరిశామిక రంగంలో ను వినియోగం గిరించి ఆ సైంటిస్టులు బృందం పరిశోధనలు చేసింది.

1967 లో ఆయన ప్రతిపాదనలు వలన కేంద్రప్రభుత్వంలో అణుశక్తి విభాగం (Department of Atomic Energy -DAE) ఎలక్ట్రానిక్స్ పరికరాల వ్యాపార సరళిలో ఉత్పత్తిచేయాలని నిర్ణయించాడు. మొదట సనత్నగర్, హైదరాబాద్ లో ECIL ప్రారంభించాడు దానికి సంచలకునిగా ఏ.యన్. రావు నియమితుడయ్యాడు. తర్వాత ECIL . ప్రస్తుత ప్రాంతాలు స్వంతభావనలోకి తరిలించారు. ఆయన కనిపెట్టిన సాంకేతికతను యితర రాష్ట్రాలకు కూడా అందచేసాడు. ECIL మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి నలుపు రెండవది తెలుపు ఆ తర్వాత రంగుల టెలివిజన్ EC Tv  చాల మందికి గుర్తుండేవుంటుంది./s

ఆయన నిరంతరం శ్రమించడమే కాకుండా ECIL లో వున్నా సహాబీయోగుల బాగోగులపట్ల నిబద్దతతో వ్యవహరించేవాడు. ఉద్యోగులకు కాలనీ ఏర్పాటు చేయడంలో ఆయన ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాడు. ఈనాడు హైదరాబాద్ లో ఏ. ఎస్ రావునగర్ ప్రసిద్ధిపొందిన ప్రాంతంగా రూపొందింది. ఆయన పదవి విమరణ చేసినాడు సన్మానం చేయాలనీ ఉద్యోగుల కోరికను సున్నితంగా తిరస్కరించి కంపెనీ కారులో కాకుండా బస్సుల్లో ఇంటికి వెళ్లి నిరాడంబరత మూర్తీభవించిన వ్యక్తి ఆయన.

ఇంటి నుండి అప్పుడప్పుడు ECIL కి రావడానికి అయన బస్సులోనే ప్రయాణం చేసేవాడు. ఎనభై ఏళ్ళు దాటినా వయస్సులో ప్రయాణం చేసే ఆయన ఒకసారి కండక్టరును ఏ. యస్. రావునగర్ వెళ్ళిపోయింది ?" అని పడే పడే అడగడంతో కండక్టరు విసుకున్నప్పుడు బస్సులోనే కండక్టర్ ని వరించి "ఆయనే ఏ. యస్. రావు " అని తోటి ప్రవణికులు చెబితే కండక్టర్ కు నోటమాట రాలేదు.

ఆయన చివరిరోజుల్లో అయన హాస్పిటల్లో నిజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ -(NIMS) లో చేరాడు. అయన కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు. కానీ, ఆయన తన కుమారులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక తన ఆరోగ్య పరిస్థితి వారికీ తెలియజేయలేదు. చివరి వరకు అయన సహుద్యోగులు, మిత్రులు ఆయనను చూసుకున్నారు. ఆయన ఇదే నెల (అక్టోబర్ ) ౩౧, 2014న చనిపోయారు. అప్పుడు మరణశయ్య మీద వుండి కూడా ఆయన ఎదుటి వ్యక్తి బాగోగుల పట్ల మాత్రమే ఆసక్తి చూపించేవాడని ఆయన స్నేహితుడు డాక్టర్ రత్నాకర్ వివరించారు.

'దార్శనిక మానవుడు (A Man With a Vision)' అనే పుస్తకంలో ఆయన స్నేహితుడు డి. మోహన్ రావు ఏ .ఎస్.రావు. జీవిత విశేషాలను విశదీకరించారు.

ప్రతిభావంతుడై వుంది కూడా ధన పేక్షలేకుండా దేశ సౌభాగ్యం పట్ల ఆసక్తి చూపడమే కాకుండా మానవీయ విలువలను కలిగిన మనుషులనుద్దేశించి 'దైవం మానుష రూపేణ' అంటారు. సమాజ హితవు కోరే నిగర్వి, సామాన్యరూపంలో వున్నా అసామాన్యుడి ప్రతిరోపమే కీర్తిశేషుడు ఏ. ఎస్.రావు.

ఆధారం:చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate