অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అందమైనవీ.....అద్భుతమైనవీ....ఈ పూలు....

రఫ్లీషియా ఆర్నాల్డి

ఆకుపచ్చగా ఉండే మొక్కల్ని చూస్తే అందరికీ ఆనందమే ... 296.jpgఇక పూలైతే పరవసింపజేస్తాయి. ప్రపంచంలో కెల్లా పెద్ద పుష్పం రఫ్లీషియా. దీని పువ్వులు 3 అడుగుల వ్యాసంతో 11 కిలోల బరువుంటాయి. ఈ మొక్కలు తూర్పు, దక్షిణ ఆసియా అడవుల్లో పెరుగుతాయి. ఈ మొక్కలు వూపులేకుండా గుర్తుపట్టటం కష్టం. ఎందుకో తెల్సా ? దీనికి ఆకులు, కాండం చివరకు వేళ్లు కూడా ఉండవు. ఇదొక పరాన్నజీవి. పూసినపుడే ఇక్కడో మొక్క ఉందని తెలుస్తుంది. దీని పూమొగ్గలు వికసించటానికి కొన్ని నెలలు పడుతుంది. ఒకసారి విచ్చుకుంటే మాత్రం వారం రోజులే ఉంటుంది. ఎర్రగా, అందంగా, అద్భుతంగా ఉండే ఈ పువ్వు దరిదాపుల్లో నిలబడటం కూడ కష్టమే. ఎందుకో తెలుసా.. ? ఎందుకంటే ఈ పువ్వు కుళ్లిన మాంసం కంపుగొడుతుంది. ఇంత అందమైన పువ్వుకు అంత దుర్వాసనా ? విచిత్రంగా ఉంది కదా.. ఎందుకలా ఉందో ఆలోచించండి.

రఫ్లీషియా ఆర్నాల్డై మొక్క అంతరించిపోతున్న మొక్క. వీటిలో మగ, ఆడ పుష్పాలుండీ మొక్కలు వేర్వేరుగా ఉండి, పరాగ సంపర్కం అరుదుగా జరుగుతుంది. ఈ మొక్కను కృత్రమంగా పెంచటంలో కూడా విజయం సాధించలేకపోయాము. రఫ్లీషియా ఆర్నాల్డై కుటుంబపు ఈ మొక్కను 2007 వ సంవత్సరంలో జరిగిన అణు జీవశాస్త్ర పరిశోధనల ఫలితంగా యూఫర్బియేసీ కుటుంబంలో చేర్చారు.

అమోర్ఫోఫాలస్ టైటానమ్

అన్నింటికన్నా అతి పెద్ద పుష్ప విన్యాసం ఉన్న మొక్కగా టైటాన్ ఆరమ్ ను 1878 లో ఇటలీ వృక్ష శాస్త్రజ్ఞుడు ఒడార్డో బెక్కారీ మొదటిసారి వర్ణించాడు. అరుదుగా పూసే ఆ మొక్క 1889 లోని రాయల్ బొటానికల్ గార్డ్ న్స్ లో పూసింది. ఆ తర్వాత ఇప్పటి వరకూ 100 సార్లు మాత్రమే పూసిందీ మొక్క. ఏరేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా అమోర్ఫోఫాలస్ టైటానమ్ గా పిలుస్తారు.

(చెకుముకి ఆగస్టు సంచికలో పెరిగే ఈ రఫ్లీషియాగా వచ్చింది. పొరపాటుకు చింతిస్తున్నాం). సుమత్రా, ఉష్ణమండల అడవుల్లో సహజంగా పెరిగే ఈ మొక్క కూడా రఫ్లీషియా లాగే కుళ్లిపోయిన శవపుష్పం (Corpse Flower) గా పిలుస్తారు. దీని పుష్ప విన్యాసపు మట్ట 3 మీ ఎత్తు ఉండి, మంచి కుంకుమ ఎరుపులో ఉంటుంది. దీనిలో ఆడ, మగ పుష్పాలు రెండూ ఒకే విన్యాసంలో ఉండి స్త్రీ పుష్పాలు రెండు రోజులు ముందుగా తెరుచుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతోందో చెప్తారా ? ఆత్మ పరాగ సంపర్కం జరక్కుండా ఉండటానికి ... పువ్వు వికసించిన 8 -12 గం|| 297.jpgవరకు మాత్రమే చెడు వాసననిచ్చే ఈ పువ్వు నశించాక మాత్రమే భూమిలో ఉండే కొమ్ము నుండి ఒకే ఒక పెద్ద ఆకు వస్తుంది. ఇదొక చిన్న చెట్టుగా పెరుగుతుంది. దీని పొడవు సుమారు 6 మీటర్లు అంటే 20 అడుగులన్నమాట. దాదాపు 5 మీ. 15 (15 అడుగులు) వ్యాపించి ఉంటుంది. ప్రతి సం. పాత ఆకు నశించి దాని స్థానంలో వచ్చే ఏడాది మరో కొత్త ఆకు వస్తుంది. దీని కొమ్ము నాల్గు నెలలపాటు సుప్తావస్థలో వుండి ఒక్కసారిగా పెద్దపూవులా బయటకు వస్తుంది.

ఈ మొక్కను రఫ్లీషియాలా కాకుండా ఉద్యానవనాల్లో పెంచుతున్నారు కూడ ఇలా పెంచిన మొక్కల నుండి 2003 సంవత్సరంలో దాదాపు 9 అడుగుల ఎత్తు ఉండే పూలను జర్మీలోని బాన్ ఉద్యానవనంలో కనుగొన్నారు. ఇది గిన్నీస్ బుక్ రికార్డు కూడ. ఈ రికార్డు 2005 లో బద్దలైంది. జర్మనీలోని స్టుట్ గార్ట్ లో 2.91 మీ (9.6 అడుగులు) ఎత్తైన పుష్ప విన్యాసం వ్చింది.

టాలిసోటాపామ్ (కొరీఫా అంబ్రాక్యులిఫెరా)..

298.jpgఇది దక్షిణ భారతదేశపు మలబారు తీరంలో, శ్రీలంకలో పెరుగుతుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద తాటిచెట్లలో ఒకటి. 25 మీ. పొడవు. 1.3 మీ. లావుతో 5 మీ. వెడల్పైన పెద్ద ఆకులతో అందంగా ఉండే ఒకరకం తాటి చెట్టు ఇది. ఒక్కోఆకులో 130 చిన్న ఆకులుంటాయి. పత్రవృత్తం 4 మీ పొడవు ఉంటుంది.

దీని మరో ప్రత్యేకత అన్నింటికన్నా పెద్దదైన పుష్ప విన్యాసం ఉండటం. దీనిలో పుష్ప విన్యాసం శాకీభవనం లేదా కొమ్మలు కొమ్మలుగా ఉంటుంది. అదే అమోర్ఫోఫాలస్ లో ఈ శాకీభవనం ఉండదు. ఒకటి నుండి లక్షలాది పూలుండే దీని విన్యాసం చెట్టుకొన భాగంలో వస్తుంది దీని పొడవు 6-8 మీటర్లు.

ఈ చెట్టు 30 నుండి 80 సంవత్సరాలు జీవిస్తుంది. తన జీవితకాలంలో ఒకే ఒకసారి మాత్రమే పూస్తుంది. కాయపండటానికే ఏడాదిపడుతుంది. ఒక్కసారి పూసిందంటే ఆ చెట్టు చనిపోతుంది. దీన్ని తూర్పు, దక్షిణ ఆసియా, చైనా ప్రాంతాల్లో పెంచుతున్నారు. దీని ఆకులు మనకు కాగితాలు లేని రోజుల్లో రాసుకోటానికే వాడేవారు. అవే మన తాళపత్ర గ్రంథాలు. అన్ని తాటి చెట్లలాగే ఇది కూడా కల్పవృక్షమే సుమా.... దీని శాస్త్రీయ నామం కొరిఫా అంబ్రాక్యులిఫెరా. చూస్తే రఫ్లీషియాది అది పెద్ద పుష్పం. శాకీభవనం చెందని పుష్ప విన్యాసంగా చూస్తే అమోర్ఫోఫాలస్అది పెద్దది. కొమ్మలు కొమ్మలుగా శాకీభవనం చెందిన పుష్ప విన్యాసాల్లో అతి పెద్దది కొరిఫా. ఏకంగా చూసినా ఈ మూడూ అద్భుతాలే.. ప్రపంచ వింతలే......

రచయిత: కట్టా సత్య ప్రసాద్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate