অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కంపు కూడా మంచిదే...

కంపు కూడా మంచిదే...

మనిషి చెమట వాసన కొడుతుంది. కొంతమంది శరీరాలు నుంచి చెమట లేకుండానే వాసన వస్తుంటుంది. మనుషుల శరీరాలతో ఈ331.jpg వాసనలకు, పాత్ర, ప్రయోజనం ఉందో లేదో తెలియదుగాని, ఇతర జంతువులలో మాత్రం వాసనలకు గొప్ప పాత్ర వుంది. కొన్ని రకాల పురుగులు శత్రువులను తిప్పి కొట్టడానికి వాసనలను వాడుకుంటాయి. చాలా రకాల ప్రాణులు జంట కట్టడానికి తమ వాసనల ద్వారా సంకేతాలు పంపుతాయి. రకరకాల జంతువుల నుంచి వచ్చే వాసనల గురించి బాగా పరిశీలిస్తే వాటి కారణం, ప్రయోజనం తెలుస్తాయి. జిరాఫీలు దగ్గరకు రాకుండానే వాటి శరీరం నుండి వచ్చే తెలుస్తుందట. దక్షిణాఫ్రికాలో వయసు ముదిరిన మన జిరాఫీలను స్టింక్ బుల్స్ అని కంపుతోనే గుర్తిస్తారట. అలాగే పిలుస్తారట. జిరాఫీల వాసన రెండు వందల యాభైమీటర్లు దాకా తెలుస్తుందని అంటారు. ఇంతటి వాసనకు కారణం ఈ మధ్యనే అర్థమయిందని హుంబోల్ట్ స్టేట్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు విలియం వుడ్ అంటున్నాడు.

జరాఫీలలో వాసన, వాటి వెంట్రుకలలో ఉంటుంది. అందుకు కారణమయిన రసాయనాలు ఆంటిబయోటిక్స్ గా పనిచేసి, పరాన్నజీవులను తిప్పి కొట్టి, జంతువును రక్షిస్తాయని పుడ్ గమనించాడు. పాలిచ్చే జంతువుల శరీరం మీద వెంట్రుకలలో రసాయనం ఉండడం, వాటికి గల ప్రయోజనాల గురించి ఇంతకు ముందు ఎక్కడా పరిశోధనలు జరగనేలేదు. ఈ తొలి ప్రయత్నం ఆసక్తి కరమైనదని వాలెరీస్మిత్ లాంటి ఇతర పరిశోధకులు అంటున్నారు. మనుషులతో సహా, మరెన్నో జంతువుల శరీరాలలో సూక్ష్మజీవులు అరికట్టగల రసాయనాలు సహజంగానే తయారవుతుంటాయని, అయితే ముఖ్యంగా అవి చెమటలోనూ, లేదా చర్మంలోనూ మాత్రమే ఉన్నట్లు గమనించారని వాలేరీ తెలిపారు.

జిరాఫీ వెంట్రుకలలోకి ఈ వాసన రసాయనాలు ఏ రకంగా చేరుతున్నదీ ఇంకా తెలియదు. రసాయనాలు చెమట. గ్రంథులలో లేదా చమురు గ్రంథులలో తయారయి, పెరుగుతున్న వెంట్రుకలలోకి చేరుకుంటాయని వుండ్ అంటున్నారు. ఈ రసాయనాలు జిరాఫీకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వాటిని మనుషులు లేకుండా ఉంది. అది వాసన గాక మన దృష్టిలో మురికికంపుగా ఉంటుంది. గనుక ఎవరూ ఈ రసాయనాలను తమ శరీరం మీద పూసుకోవడానికి ఇష్టపడరు.

వుడ్ తన పరిశోధన కోసం జంతు ప్రదర్శనశాలలో ఉండే జిరాఫీ మెడ, వెన్ను భాగాల నుండి వెంట్రుకలను సేకరించారు. పాల్ వెల్టన్ అనే మరో పరిశోథకుని సాయంతో వాటిలోని రసాయనాలను విడదీసి గుర్తించారు. వెంట్రుకలలో మొత్తం పదకొండు రకాల కంపు రసాయనాలు ఉన్నట్లు తెలిసింది. వాసనకు అసలు కారణం మాత్రం ఇండోల్, త్రీ మితైల్ ఇండోల్ అనే రసాయనాలని కూడా గూర్తించారు. ఈ రసాయనాల వల్లనే మలం ఒక రకమైన వాసన కొడుతుంది. ఈ రసాయనాలు ఫంగస్, స్టాఫిలోకోకస్ వంటి వాటి పెరుగుదలను అరికట్టగలుగుతాయి.

రసాయనాలలో మరికొన్ని కూడా వేరు రకాల సూక్ష్మ జీవులను శిలీంధ్రాలను అరికట్టగలుగుతాయని తెలిసింది. అవి చర్మాన్ని ఈ రకం జీవుల నుంచి కాపాడుతుంటాయి. ఒకటి రెండు రకాలు కలిస్తే ప్రభావం మరింత ఎక్కువవుతుంది. క్రియోసోట్ లో ఉండే పారాక్రిసాల్ అనే రసాయనం కూడా జిరాఫీ ఒంటి మీద ఉంటుంది. ఇది జంతువులను పిడుదుల బారి నుంచి కాపాడగలుగుతుంది.

జిరఫీ ఒంటి వాసన జంటను ఆకర్షించడానికి గూడా పనికి వస్తుందని అనుకుంటున్నారు. మగ జిరాఫీకు వాసన ఎక్కువ. అది నా ఒంటి మీద పిడుదులు, మరో పరాన్న జీవులు లేవు తెలుసా... అని ప్రకటించినట్లుంటుంది. వుడ్ ఇంతకు ముందు జింకలలో రసాయనాలను గురించి కూడా పరిశోధించారు.

రచయిత: కె.బి.గోపాలం.

చివరిసారిగా మార్పు చేయబడిన : 9/8/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate