অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జంతువుల్లో వింతలు

జంతువుల్లో వింతలు

మూడు కళ్ళున్న జంతువు

మనం రెండు కళ్ళున్న చాలా జంతువులను చూశాము కానీ మూడు కళ్ళున్న జంతువును చూడలేదు కదా!? విచిత్రంగా మూడు కళ్ళున్న జంతువు స్ఫెనోడాన్ పంక్టేటస్. ఇది బల్లి ఆకారం కల్గి వుంటుంది. కాని లోపలి అంగనిర్మాణం అందుకు విరుద్ధంగా వుంటుంది.

mar05.jpgఈ జంతువును సరీసృపముల జంతువులలో ఉప తెగగా చేశారు. ఈ జంతువులు న్యూజిల్యాండ్ లోని టాట్వారా ద్వీపాలలో మాత్రమే ఉంటాయి. ఈ జంతువులలో విచిత్రంగా ఉన్న మూడో కన్ను శంఖు ఆకారంలో వుంటుంది. ఈ కన్నును 'పీనియల్ఐ' అంటారు. ఈ కన్ను తలకు, మెదడుకు మధ్య వున్న రంథంలో వుంటుంది. ఈ కన్ను వలన స్ఫెనోడాన్ కు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ జంతువులలో బాగా ఎదిగిన మగ జంతువు ఒక కిలోగ్రాము బరువు వుంటుంది. అదే ఆడ జంతువు అరకిలోగ్రాము బరువు వుంటుంది. ఈ జంతువు 20 కోట్ల సంవత్సరాల పూర్వము నుంచి వుంది. ఈ జంతువు సుమారు వంద సంవత్సరాలు జీవించగలదు.

ఆహారాన్ని నీటిలో కడుక్కుని తినే జంతువు

mar06.jpgరేకూన్ అనే ఈ జంతువు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నివసిస్తుంది. పగటిపూట చెట్టుతొర్రల్లో చుట్టుకుని ఉండి గడిపే ఈ జంతువు రాత్రి వేళల్లో ఆహారం కోసం తిరుగుతుంది. చిన్న క్షీరదాల్ని, చేపల్ని, రొయ్యల్లాంటి ప్రాణుల్ని తింటుంది. వీటితో పాటు పండ్లని, గింజల్ని కూడా తింటుంది. అయితే వాటిని శుభ్రంగా నీటిలో కడుక్కుని తినే అలవాటు ఈ జంతువుకుంది. శీతాకాలంలో ఈ జంతువు ఏదైనా చెట్టు తొర్రలో గానీ, ఇంకేదైనా బొరియలో దూరి కదలకుండా నిద్రపోతూ గడుపుతుంది.

అపోజమ్

mar07.jpgఅపోజమ్ అనే ఈ జంతువు మనం చూసే పిల్ల పరిమాణంలో ఉంటుంది. మెక్సికో ఉత్తరభాగం తూర్పు కెనడా నుంచి, అర్జెంటీనా వరకు కొన్ని ప్రాంతాలలో నివసిస్తుంది.

చెట్లమీద ఎక్కువగా సంచరిస్తూ నివసించే ఈ అపోజమ్ చెట్ల తొర్రలో నివసిస్తుంది. దీనికి ఉ దరభాగంలో సంచిలాంటి భాగం ఉంటుంది. ఈ సంచిలోనే దీని పిల్లల్ని దాచుకుంటుంది. ఒక్కోఅపోజమ్ సుమారు 14 పిల్లల్ని కంటుంది. ఈ పిల్లలు పుట్టినప్పుడు తేనెటీగ పరిమాణంలో ఉంటాయి. సంచిలాంటి భాగంలోనే ఇవి రెండు నెలలు గడుపుతాయి. ఆ తర్వాత తల్లి వీపుమీద కెక్కి ఆడుకుంటాయి. ఈ జంతువు పక్షుల్ని, గుడ్లని, కీటకాన్ని, పండ్లని ఆహారంగా తీసుకుంటాయి. శత్రుజంతువులు వస్తున్నాయని గమనించగానే కదలకుండా చనిపోయినట్లు నటిస్తాయి. 70 మిలియన్ సంవత్సరాల క్రితం శిలాజాల రూపంలో మొట్టమొదటి సారి కనబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అపోజమ్స్ చాలా కొంచెం మాత్రమే మారినాయి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate