অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిల్లలకు మర్యాద నేర్పుదాం

పిల్లలకు మర్యాద నేర్పుదాం

పిల్లలు అనేక విషయాలు అనేక విధాలుగా నేర్చుకుంటూ వుంటారు. కొన్ని కొన్ని విషయాలు తల్లిదండ్రుల వద్ద, మరికొన్ని విషయాలు ఉపాధ్యాయుల వద్ద, మరిన్ని విషయాలు మిత్రుల ద్వారా, ఇంకొన్ని విషయాలు స్వయంగా తెలుసుకొంటారు. పిల్లలు యిలా నేర్చుకుంటారనే విషయంలో మన పూర్వీకులు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తెలిపారు. వారి మాట ప్రకారం.

ఆచార్యాతో పాదమాదత్తే పాదఃశిష్యః స్వమేధయా! పాదం సబ్రహ్మచారిభ్యః పాదః కాలక్రమేణచ ||

పై మాట ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థి పావుభాగం ఉపాధ్యాయుని వల్ల, మరో పావు భాగం తన తెలివితేటలవల్ల, మరో పావు భాగం తన సహచర విద్యార్థుల వల్ల, మరో పావుభాగం జీవితంలో క్రమంగా తెలుసుకుంటాడు. అయినా పిల్లలకు ఏ విషయాలు నేర్పితే బావుంటుంది. ఇందులో అనేకమందికి అనేక అభిప్రాయాలు వుంటాయి. ఇవే తప్పకుండా నేర్పాలి. అన్న నియమము లేదు. ఐనా పిల్లలకు మర్యాద నేర్పితే బావుంటుంది కదా! అనే అభిప్రాయం చాలా మందికి వుంటుంది. ప్రస్తుతానికి 'మర్యాదకే పరిమితమౌదాం.

  1. ఎవరైనా మాట్లాడుతున్నపుడు మధ్యలో ఆటంకపరచకుండా వారి సమయం వచ్చినపుడు మాట్లాడమనడం.
  2. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మధ్యలో జోక్యం చేసుకోవడం సహజం. ఇందువల్ల పెద్దలు తాము ఏ విషయమై మాట్లాడదలచుకున్నారో ఆ విషయాన్ని మరచిపోవడం గాని, లేక ఆ (అ)సందర్భ ప్రేలాపన వల్ల పరువునష్టం జరగడం గాని సంభవించవచ్చు. కాబట్టి ఎవరైనా మాట్లాడుతున్నపుడు మధ్యలో అడ్డుపడకూడదని సున్నితంగా చెప్పాలి.

  3. పిల్లలకు 'కృతజ్ఞత' చెప్పడం - అది వారు వినేలా మీరు చెప్పడం.
  4. పిల్లలు ఎంత చిన్నవారైనా వారు మీకు సహాయపడినప్పుడల్లా 'థ్యాంక్స్ చెప్పడం మరవకండి. దీనివల్ల వారు ఇతరుల వద్ద ఏ చిన్న సహాయం పొందినా కృతజ్ఞతలు తెలియజేస్తారు.

  5. మీ పిల్లలను ఏదైనా పనిచేసి పెట్టమన్నప్పుడు “ప్లీజ్” అనే పదాన్ని వుపయోగించండి.
  6. దీనివల్ల మీవల్లనే ఎవరినైనా ఏదైనా అడగాలనుకుంటే వారు కూడా అలానే చేస్తారు. ఇందువల్ల వారిలో వినయం పెరుగుతుంది. ఎవరినైనా ఏ విధంగా ఆర్థించాలో తెలుస్తుంది. తద్వార తమ జీవనాన్ని ఆనందంగా గడిపేస్తారు.

  7. టేబుల్ మీద వున్న వస్తువులను చూడొచ్చు కాని తాకకూడదు.
  8. అది మీ ఇల్లు అయినా ప్రక్కిల్లు అయినా ఖచ్చితంగా ఈ సూత్రాన్ని అమలు చేయండి. పిల్లలకు కొత్తగా విషయాలు తెలుసుకోవాలన్న తపన, ఆసక్తి వుంటుంది. అందువల్ల వారు జంకు లేకుండా ఏ వస్తువునైనా తీసుకునేందుకు, తాకేందుకు, ప్రయత్నిస్తూ వుంటారు. ఇందువల్ల ఇతరులకు ఇబ్బందికరంగా వుంటుంది. ఈ సూత్రాన్ని మనం నేర్పితే పిల్లలు తమ హగ్గులను తెలుసుకుంటారు.

  9. ఇతరుల కోసం తలుపు తెరను నేర్పడి.
  10. మనం పెద్ద పెద్ద షాప్ లకు వెళ్ళినప్పుడు తలుపు దానంతట అదే మూత పడేవిధం ఏర్పాట్లు వుంటాయి. అటువంటప్పుడు పిల్లలకు తలుపు తీసుకుని లోపలికి పొయ్యే విధంగా కాకుండా ఎవరైనా వస్తున్నారేమో అని తలుపు తెరచి చూడమని చెప్పాలి. ఈ విధంగా చెయ్యడం వల్ల పిల్లలు తరువాత తమ యింటికి ఎవరు వచ్చినా తలుపు తీసి ఆనందంగా లోనికి ఆహ్వానిస్తారు.

  11. పిల్లల ముందు పెద్ద వారిని గౌరవించండి.
  12. మీ యింటికి ప్రక్కింటి తాతయ్య గారు వచ్చారు, వెంటనే మీరు లేచి మీ కుర్చీలో కూర్చోడానికి ఆ తాత గారిని ఆహ్వానించండి. దీంతో పెద్దలను గౌరవించాలనే విషయం పిల్లలకు వెంటనే స్ఫురిస్తుంది.

  13. పిల్లల ప్రవర్తన జాగ్రత్తగా గమనించండి.
  14. పిల్లలు కొన్నిసార్లు తెలియకుండా పొరబాట్లు చేస్తారు, మరికొన్నిసార్లు పొరపాటు చేస్తే తల్లితండ్రులు ఏమి చేస్తారు అని పరీక్షించడానికి చేస్తారు. వారు యెలా ప్రవర్తిస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి. తగిన సలహాలివ్వాలి.

  15. ప్రేమ చూపండి.
  16. పిల్లలు తప్పు చేస్తే వెంటనే దండించకండి. ఆ తప్పు తిరిగి ఎలా చెయ్యకూడదో తెల్పండి. ఆ సంఘటన జరిగిన తరువాత వారిని కౌగిలించుకోండి. దీనితో వారికి ప్రేమ, నమ్మకంతోబాటు తప్పు చెయ్యరాదనే భావన కలుగుతుంది.

  17. మీరు వారికి ఏది నేర్పాలనుకుంటున్నారో దానిని ఆచరించం.
  18. మీ పిల్ల వాడిని 6 గంటలకు లేపి చదివించాలనుకోండి. మీరు కూడా 6 గంటలకు లేవండి. మీరు మీ పని చేసుకోండి. మీ పిల్లవాడు తన పని తాను చేసుకుంటాడు.

  19. పిల్లలతో సానుకూలంగా వ్యవహరించండి.
  20. పిల్లలు యేమి చెయ్యకూడదో చెప్పే బదులుగా ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలో చెప్పండి. ఉదాహరణకు 'అల్లరి చెయ్యద్దు' అని చెప్పేందుకు బదులుగా మంచిగా వుండమని చెప్పండి.

    ఆధారం: కె. గోపాలకృష్ణయ్య.

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate