অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

యుద్భావం తద్భవతి...

యుద్భావం తద్భవతి...

రంగయ్య, రంగమ్మల కొడుకు సృజన్. వయసు పదమూడేళ్ళు. కానీ, ఆరో తరగతి చదువుతున్నాడు. ఎందుకంటే, వాడికి చదువంటే అంతగా ఇష్టం లేదు. పనులంటే ఇష్టం. కానీ, తల్లిదండ్రులకు వాడు చదువుకోవాలని, గొప్పవాడు కావాలని ఆశ. రంగమ్మకు తన తమ్ముడు పాండు లాగా ఉద్యోగం చేయాలన్నది ఆమె కోరిక. అందుకే వాడికి పని కూడా ఏమీ చెప్పదు. పాండు హైదరాబాదులో బ్యాంకులో పని చేస్తుంటాడు. సృజన్ తల్లిదండ్రుల మాట కాదనలేక బడికి వెళ్తుంటాడు తప్ప పెద్దగా చదవడు.

experiment.jpgఆరోజు ఆదివారం. అమ్మానాన్నా పొలానికి వెళ్లారు. సృజన్ కు ఏం చేయాలో తోచడం లేదు. టీ.వీ.చూద్దామంటే కరెంట్ లేదు. ఇంటిముందు మంచంలో కూర్చుని కాళ్ళు ఊపుకుంటూ దిక్కులు చూస్తున్నాడు. ఉన్నట్లుండి బడిలో సారు చెప్పిన విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. వెంటనే ఇంట్లోకి పరిగెత్తాడు. ఇంట్లో ఉన్న ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఒక మేకుతో బాటిల్కు పైనుండి క్రింది వరకూ 5 రంధ్రాలు పెట్టాడు. బాటిల్ నిండా నీళ్ళు పోసి పరిశీలిస్తున్నాడు. మాటిమాటికి ఒక రంధ్రాలను మూస్తూ, త్తెరుస్తూ తనలో తనే నవ్వుకుంటున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మానాన్నా వచ్చారు. వాడు చేసే పనిని చూసిన వాళ్ళమ్మ,' అయ్యో! అయ్యో! బంగారం లాంటి బాటిల్ నాశనం చేశావు కదరా! వెధవా!” అంటూ వీపుపై ఒక్కటిచ్చింది. అంతే! బాటిలో అక్కడ విసిరేసి, వీపు రుదుకుంటూ, బయటకు పరుగు తీశాడు. "ఏదో చదువుకుంటాడూ! వాళ్ళ మామలాగా బాగుపడతాడని ఏపనీ చెప్పకుండా ఉంటుంటే, పోరంబోకులాగా తయారవుతున్నాడు. పైగా ఇంట్లో వస్తువులన్నీ ఇలా పాడుచేయడమొకటీ అనుకుంటూ తన ఇంటి పనులలో నిమగ్నమైంది.

సృజన్ ఊరిబయట ఉన్న పాఠశాల మైదానం దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ తోటి పిల్లలు కబడ్డీ ఆడుతున్నారు. రాజేష్ అనేవాడు వీడిని చూడగానే, 'రారా! సృజన్. కబడ్డీ ఆడుదాం అన్నాడు.

“అమ్మో! నేను రాను. క్రింద పడితే దెబ్బలు తగులుతాయి బాబోయ్!" అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వారు.

అపుడు కిరణ్, "వాడికి ఆటలు రావురా. అందుకే వాడెప్పడూ ఆడుకోవడానికి రాడు. చదువు కూడా రాదు. మొదోడు. హి..హి..హి." అంటూ ఎగతాళిగా నవ్వాడు. మిగతా పిల్లలూ వాడి నవ్వుకు జత కలిపారు.

ఇంతలో కార్తీక్ అనే మరో పిల్లవాడు, “ ఏయ్! అలా అనకండిరా! వాడు డ్యాన్సు ఎంత బాగా చేస్తాడో తెలుసా? మరి మనకు వస్తుందా చెప్పండీ?! “అనగానే అందరి నవ్వులూ ఆగిపోయాయి. సృజన్ ముఖంలో చిరునవ్వు మొలిచింది.

"అబ్బో వచ్చాడండీ పెద్ద డ్యాన్సు మాస్టర్ ఏదీ? ఒక డ్యాన్సు వేయమను చూద్దాం? వినయ్ కాస్త రెచ్చగొట్టినట్లుగా మాట్లాడాడు.

"అరేయ్, వాడితో మనకేంట్రా? కబద్దీ ఆడండ్రా!" అంటూ జట్టులోని తరుణ్ అన్నాడు. 'అరేయ్! ఉండరా. వీడికి డ్యాన్సు వచ్చంటున్నారుగా, దమ్మంటే ఇప్పడు వేయమను చూద్దాం? " వినయ్ రెట్టించాడు.

“అరేయ్ సృజన్ వేయరా. డ్యాన్సు వీళ్ళ నోళు మూయించు." కార్తీక్ వీపుపై చేయి వేసి ప్రోత్సహించాడు.

సృజన్ తనకు వచ్చిన ఒక సినిమా పాట పాడుతూ, స్టెప్పలు వేయసాగాడు. ఇది విని ప్రక్కన ఇతర ఆటలు ఆడుతున్న మరికొందరు కూడా అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాడి డ్యాన్సు చూసి చివరకు అందరూ మొచ్చుకుని చప్పట్ల మ్రోగించారు.

చీకటి పడడంతో ఇక అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

ఒకరోజు తను బడినుండి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ పాండు మామ కనపడ్డాడు. అంత దూరం నుండి, "మామయ్యా!" అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాండు మామ అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పడూ తిట్టడు, అరవడు అమ్మలా. పైగా తను పనులను మెచ్చుకుంటుంటాడు కూడా.

ఆరోజు రాత్రి తన మామయ్యతో కలిసి భోంచేశాడు. మామయ్యతోనే కలిసి పడుకున్నాడు.

తరువాతి రోజు ఆదివారం. మామయ్య, అమ్మానాన్న తను అంతా పొలం వెళ్లారు. అన్నం కూడా తీసుకుని వెళ్లారు. అమ్మానాన్నలు పొలంలో పనులు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ పొలం ప్రక్కనున్న చెట్టు క్రింద కూర్చున్నారు.

'అల్లుడూ! సంవత్సరం దాటిందిరా మనం కలవక ఏంటి సంగతులు, కబుర్లు?" అంటూ అడిగాడు. సృజన్ ఇక మొదలు పెట్టాడు. అదీ, ఇదీ అంటూ చెబుతూనే ఉన్నారు. విసుగు లేకుండా పాండు వింటూనే ఉన్నాడు. సమయం తెలియకుండా కబుర్లలోకంలోకి మామా అల్లుళ్ళు ఇద్దరూ వెళ్లిపోయారు.

“ఊ..మొదలయ్యాయన్నమాట, మామా అల్లుళ్ళ కబుర్లు," అన్న రంగమ్మ మాటకు ఇద్దరూ ఈలోకంలోకి వచ్చారు. ఇంతలో రంగయ్య కూడా వచ్చాడు. " ఏరా పాండూ! బువ్వ తిండానికి ఖాళీ ఏమైనా ఉందా? లేక అల్లడి మాటలతో పొట్ట నిండిందా?" అన్నాడు.

“అదేం లేదు బావా! వీడు చాలా హుషారైనోడు. వీడు చెప్పేటివన్నీ వింటుంటే, వీడు చాలా గొప్పోడు అవుతాడని అనిపిస్తోంది" అన్నాడు.

“ఏంటి అయ్యేది? ఎప్పడు చూసినా, కోతి పనులు. , ఇంట్లో వసువులు చెడగొట్టడాలూ, కుప్పిగంతులూ,.. ఇలా ఒకటా రెండా? వెధవ పనులు ఎన్ని చేయాలో అన్నీ చేస్తాడు. ఆ చదువు ఒక్కటి తప్ప.” అని, రంగమ్మ నిటూర్పు విడిచింది.

“లేదక్కా! వీడన్నీ నాకు చెప్పాడు. అంత నిజాయితీ ఉంది వీడిలో పిల్లలన్నాక, ఆడాలి, పాడాలి, చదువు ఒక్కటే కాదు. అలా అని చదువు వద్దని కాదు. పిల్లలకు నచ్చచెప్పాలి. వారు చేసే పనులను గురించి అడగాలి. అంతే కొట్టడం, తిట్టడం పద్ధతి కాదు. నువ్వు అలా తిడుతున్నావు కనుకనే నీతో వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు. అసలు నీవు ఆ అవకాశం వాడికి ఇవ్వట్లేదని నాకు అర్థం అవుతోంది.” అనగానే రంగమ్మ మారు మాట్లాడలేకపోయింది.

'సరే! మామా అల్లుళ్ళు ఇద్దరు ఒకటయ్యాక ఇక నేనదేముంది? ముందు బువ్వ తినండి. తరువాత మాట్లాడుకుందురు గానీ" అంటూ క్యారియర్ లో తెచ్చిన అన్నం వడ్డించింది. నలుగురూ కలిసి భోజనం పూర్తి చేశారు.

సృజన్ అక్కడున్న రాళ్ళు ఎగరేసుకుంటూ, ఏదో ఆడుకుంటున్నాడు.

‘ఒరేయ్, తమ్ముడూ! వాడిని ఎలాగోలా చదువుకునేలా చేయిరా. నీయంత కాకున్నా, ఏదో ఒక చిన్న ఉద్యోగమన్నా వచ్చేలా చేయరా. నీకు పుణ్యమంటది" అంది.

ఇక అక్కకు చదువు రాకపోవడం వలన, తను నలుగురి లాగానే అలా మాట్లాడడంలో తప్ప లేదనిపించింది. అందుకే ఇక ఏం చెప్పినా లాభం පීයඩ්ඩ්ටඩ්ටයි. ඩ්ටඩීරාටළු” నిర్ణయించుకున్నాడు. అప్పటికి వాళ్ళక్కతో " సరే! అలాగే అక్కా నేం చెప్తాగా వాడికి, నువ్వెళ్ళు" అన్నాడు.

రంగమ్మ, రంగయ్యలు పొలం పనిలోకి దిగారు. కొంచెం సేపు ఉన్నాక, " ఒరేయ్, అల్లుడూ! ఇంకా చెప్పరా, ఏంటి కబురూ?" అన్నాడు.

"చూశావ్ గా మామయ్యా! అమ్మఎప్పడూ ఇంతే" అన్నాడు.

మీ అమ్మ, చెప్పేదాంట్లో కూడా నిజముంది. నీవు చేసే పనులలో అర్ధమూ ఉంది" అన్నాడు.

"అదేంటి మామయ్యా! అలా అంటావు? నాకు చదువంటే అస్సలు ఇష్టం ఉండదు. బుర్రకు ఎక్కదని చెప్పాగా. మా అమ్మ ఏమో, ఎప్పడూ చదువూ, చదువూ అని అరుస్తుంటది" అంటూ బుంగ మూతి పెట్టాడు.

“సృజనూ. నీకు ఆ పేరు పెట్టింది నేనేరా! యద్భావం తద్భవతి." అన్నాడు.

“ఆ.ఏంటి మామయ్యా" అర్థం కాక నోరు తెరిచాడు.

"అసలు ముందు, నీ పేరుకు అర్థం తెలుసా? “ప్స్. ఊహు”

experimenting.jpg“సృజన్, అంటే సృజనాత్మకత... అంటే,టాలెంట్.

నీలో చాలా టాలెంట్ చాలా ఉందన్నమాట"

“అర్ధం కాలేదు మామయ్యా!?”

“చూడూ. ఎవ్వరికైనా తనలో టాలెంట్ సహజంగానే ఉంటుంది. కానీ, అది తెలియక చాలా మంది నాకేం రాదు. నాకేం తెలియదు, నాకేం చేతకాదు. అని అనుకుంటుంటారు. నీవు కూడా అంతే.”

"ఇంతకూ నీవనేది ఏంటి మామయ్యా"

“చూడు అల్లుడూ! ఇందాక, నేను చెప్పానే. యద్భావం తద్భవతి, అని. అంటే, మనం మనసులో గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నా ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దీన్నే అనుకూలముగా ఆలోచించడం అంటాం. నీవు కూడా అంతే. నీవు తల్చుకున్నావంటే, ఏదైనా సాధించగలవు. నీవే కాదు. ఎవరైనా అనుకున్నది సాధించగలరు."

ఆ మాటలకు ఉత్సాహతో "అయితే, నేనేం చేయాలి మామయ్యా! చెప్పండి" అన్నాడు సృజన్.

"నీవేమన్నావు? సినిమా డైరెక్టర్ అవుతానన్నావు కదా!. నేను చెబుతున్నా నీవు ఖచ్చితంగా అవుతావు. కాకపోతే అందుకు , ముందు మీ అమ్మ చెప్పినట్లు చదువుకోవాలి. చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు."

సృజనాత్మకత, టాలెంట్ అన్నావు?"

“అవును. ఇప్పడూ అదే అంటున్నాను. నీలోని టాలెంట్ను బయటికి తీసే ఆయుధమే చదువు. అందుకే అన్నారు పెద్దలు "విద్య కల్పవృక్షము వంటిది' అని. నీవు ముందు 10 వతరగతి పూర్తి చేయి. మార్ములు ముఖ్యం కాదు. విజ్ఞానం ముఖ్యం. అలా అని ఏదీ అతిగా ఆలోచించకూడదు సుమా! ?

'ఓహూ! ఇప్పడర్థం అయ్యింది మామయ్యోయ్. అంటే, ఆడుతు పాడుతు చదువు కూడా పూర్తి చేయాలన్నమాట. ఓ.కే. ఇంక చూస్కో . నా సామిరంగా! "అంటూ ఎగిరి గంతేశాడు.

ఆరోజుటి నుండి సృజన్ తన డ్యాన్సులు, పాటలు, ప్రయోగాలు, చేసుకుంటూనే తన మనసులో తానొక సినిమా డైరెక్టర్ గా ఊహించుకునేవాడు. అంతే కాదు. పాఠశాల, కాలేజీలలో తన స్నేహితులతో కలిసి ప్రోగ్రాములు కూడా తానే దగ్గరుండి చూసుకునేవాడు.

అలా తాను తన మామయ్యతో కలిసినప్పడల్లా విషయాలు చర్చించేవాడు. సలహాలు వినేవాడు. డిగ్రీ పూర్తి చేసి హైదరాబాదు చేరాడు. మామయ్య ఇంట్లో ఉంటూ అతని సహాయంతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేరాడు. అక్కడ తన మిత్రబృందాన్ని తయారు చేశాడు. షార్జ్ఫిల్మ్ లు తీసూ, మ్యారేజ్ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ తనకు కావలసిన ఖర్చులు కూడా సంపాదించుకోసాగాడు. తనలో ఉన్న పట్టుదలతో పలువురి సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు. చివరకు తాననుకున్న ఫిల్మ్డైరెక్టర్ గా మంచి పేరు సాధించాడు. తన పేరును సార్థకం చేసుకున్నాడు.

"యద్భావం తద్భవతి".

రచయిత: మద్దిరాల శ్రీనివాసులు, సెల్: 9010619066

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate