অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ల్యాబ్ లో దెయ్యం

ల్యాబ్ లో దెయ్యం

apr005.jpgసైన్స్ మాష్టారు గౌతమ్ టెన్త్ క్లాసులో అడుగుపెట్టే సమయానికి క్లాసులో విద్యార్థుల మధ్య , వాడిగా, వేడిగా దయ్యాల ఉనికిని గురించిన చర్చ జరుగుతోంది . విద్యారలు రెండు గ్రూపులుగా విడిపోయి చర్చించుకుంటున్నారు. అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, ఇరుగుపొరుగు వారు చెప్పిన అనుభవాలను ఒకరితో ఒకరు పోటీ పడి మరీ చెప్తున్నారు. సహజంగానే దయ్యాలున్నాయని ఎక్కువమంది విద్యార్థులు వాదిస్తుండగా, కొద్ది మంది మాత్రం లేవని వాదిస్తున్నారు. ఆ సమయంలో సైన్స్ మాష్టారు గౌతమ్ క్లాసులో అడుగుపెట్టాడు.

గౌతమ్ రెండు సంవత్సరాల క్రిందటే సైన్స్ అసిస్టెంట్ గా విధుల్లో చేరాడు. మంచి ఆశయాలు, సామాజిక స్పృహ ఉన్నవాడు. విద్యార్థి దశ నుండి అభ్యుదయ భావాలు అలవరచుకొని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతుండే వాడు. చాలా కాలం నుండి జనవిజ్ఞాన వేదికలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరగానే తాను విద్యార్థులను మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యవంతులను చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.

గౌతమ్ మాష్టారు క్లాసులో అడుగు పెట్టగానే విద్యార్థులందరూ మాష్టార్ని దయ్యాలకు సంబంధించి అనేక ప్రశ్నలతో చుట్టుముట్టారు.

“సార్, దవ్యూలు ఉన్నాయా? లేవా? చెప్పండి సార్. మీరు ఎప్పుడు ఏ. విషయం చెప్పినా చాలా చక్కగా చెప్తారు. అలాగే దయ్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని కూడా తేల్చి చెప్పండి సార్” అంటూ మోహన్ అనే విద్యార్థి అందరి తరపునా గౌతమ్ మాష్టార్ని అడిగాడు.

ఉపాధ్యాయులు ఏది చెప్పినా విద్యార్థులు దానికి మరెవరు చెప్పిన అభిప్రాయం కంటే కూడా ఎక్కువ విలువ ఇస్తారు. విద్యార్థుల ఈ సైకాలజీని బాగా అర్థం చేసుకున్నవాడు గౌతమ్. అందుకే అవకాశం చిక్కినప్పుడల్లా విద్యార్థులలో ఉన్న మూఢనమ్మకాలను దూరం చేసేందుకు వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై విద్యార్థులలో సరైన అవగాహనను పెంపొందించేందుకు, వారిలో శాస్త్రీయ అవగాహనను, హేతువాద దృష్టిని పెంపొందించేందుకు కృషి చేస్తుంటాడు గౌతమ్.

విద్యార్థులకు నేరుగా తన అభిప్రాయాన్ని చెప్పే అలవాటు గౌతమ్ మాష్టారుకు లేదు. ఏవో కొన్ని ఉదాహరణలు చెప్పి, వాటి ప్రకారం “సమాధానం మీరే ఊహించుకోండి” అంటూ విద్యార్థులలో ఆలోచనకు, చర్చకూ అవకాశమిస్తాడు. ఆ రోజు కూడా అలాగే దయ్యాల విషయమై ఇలా చెప్పసాగాడు.

“నేను దయ్యాల విషయమై నా అభిప్రాయం చెప్పడం కంటే కూడా, నేను మీలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను మీకు చెప్తాను. అది వినిన తర్వాత దయ్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయమై మీరే ఒక అభిప్రాయానికి రండి. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే మీకొసంఘటన గూర్చి చెప్తాను, ఓకేనా అని గౌతమ్ మాష్టారు చెప్పగానే రిక్కించి మాష్టారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినడానికి సిద్ధమయ్యారు. ఆ వయసు పిల్లలకు బాగా ఇష్టమైన విషయం కదా మరి!

“ఇది నా చిన్నతనంలో జరిగిన సంఘటన. నేనప్పుడు 8వ తరగతి చదువుతున్నానన్నమాట. అప్పుడు మాకు మూర్తిగారని సైన్స్ టీచర్ ఉండేవారు. వారు సైన్స్ పాఠాలను చక్కగా అరటిపండు ఒలిచి పెట్టినట్టు చాలా చక్కగా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. సాధ్యమైనంత వరకూ అన్నీ ప్రయోగ పూర్వకంగానూ, సజీవ ఉదాహరణలతోనూ విద్యార్థులకు వివరించేవారు.

“ఒక రోజు మూర్తి గారు మాకు “మానవ శరీర నిర్మాణం’ పాఠం చెప్తున్నారు. ఇంతలో మాష్టారు సత్యం అనే కుర్రాడిని లేపి జువాలజీ ల్యాబ్ కు వెళ్లి బీరువాలో ఉన్న మానవ కపాలం (పుర్రె) మోడల్ ను తీసుకుర.. పురమాయించారు.

వెళ్లినవాడు ఓ ఐదు నిముషాల తర్వాత రొప్పుతూ రోజుతూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి మొహం భయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భయం వల్ల కావచ్చు మాట తడబడుతోంది. వాడు భయభయంగా, సార్.... సార్.... ల్యాబ్ లో ద.. ద... దయ్యం .. ఉంది సార్ అంటూ భయంతో వణికిపోతూ చెప్పాడు.

మాష్టారు ఆశ్చర్యపోతూ “దయ్యమా?! ల్యాబ్ లోనా? ఏందిరా నువ్వు చెప్పేది. ల్యాబ్ లో దయ్యం ఉండటమేమిటిరా? నీగ్గాని మతేమైనా పోయిందా??... అంటుండగానే అటుగా స్కూలు అటెండర్ నరసయ్య వచ్చాడు.

నరసయ్య ఆ స్కూల్లో చాలా కాలంగా పనిచేస్తున్నాడు. అతనికి సుమారు యాభై ఏళ్ళ వయసుంటుంది. కానీ కాస్త ఎక్కువ వయస్సున్న వాడిలా కనిపిస్తాడు. ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ అందరి అభిమానానికి పాత్రుడయ్యాడు.

మాష్టారు నరసయ్యను పిలిచి ల్యాబ్ కు వెళ్లి పుర్రె మోడల్ తెచ్చే పనిని అప్పగించాడు. నరసయ్య ఆ పని మీద వెళ్లి, వెళ్లినవాడు వెళ్ళినట్టు వెనక్కి వచ్చాడు. నరసయ్యలోను ఆందోళన, భయం అందరికి కనిపించాయి.

“ల్యాబ్ లో ఏదో దెయ్యం ఉనట్లుగా ఉంది సార్. బీరువాలో పుర్రె అటూ ఇటూ తిరుగుతూ, గెంతులు ఉంది సార్ అన్నాడు.

విద్యార్ధులలో కలకలం బయలుదేరింది. వారందరూ దెయ్యం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. సైన్స్ మాష్టారు తానే స్వయంగా క్యాబేకు వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు. సార్ వెనకే మేము గూడా అనుసరించి వెళ్లాం.

ల్యాబ్ కు వెళ్లిం తర్వాత సైన్స్ మాష్టారు, సార్ తో పాటు మేము కూడా సంభ్రమాశ్చర్యాలకు గురైనాము. మేమైతే భయకంపితులమైనాము.

బీరువాలో ఉన్న పుర్రె అటూ ఇటూ వేగంగా కదులుతున్నది. మధ్యమధ్యన పైకి ఎగురుతున్నది. ఆ దృశ్యాన్ని చూసి మరీ భయస్తులైన కొందరు విద్యార్థులు బైటికి పరుగెత్తారు.

మాష్టారు మాత్రం ధైర్యంగా బీరువా దగ్గరకు వెళ్లి బీరువా తలుపులను బార్లా తెరిచారు. బీరువా తెరచిన కొంతసేపటికి పుర్రె అటూ, ఇటూ వేగంగా కదలి చివరకు క్రింద పడింది. పిల్లలు భయంతో అరుస్తూ దూరంగా జరిగారు. అందులో నుండీ ఒక ఎలుక గబాల్ని బయటకు దూకి ప్రాణభయంతో పారిపోయింది. అది చూచి అప్పటిదాకా భయంగానూ, ఆశ్చర్యంగానూ జరుగుతున్న తంతును చూస్తున్న అందరిలోనూ నవ్వులు విరబూశాయి.

“ఇక పదండర్రా, పాఠం చెప్పుకుందాం. దయ్యం పారిపోయింది చూశారుగా!” అన్నాడు నవ్వుతూ.

“ఇదీ మా ల్యాబ్ లో దయ్యం కథ. ఇప్పుడు మీకేమి అర్థమయ్యింది” అని అడిగారు గౌతం మాస్టారు.

“ఏదైనా ఒక కొత్త విషయం జరిగితే వెంటనే వెళ్లి అభిప్రాయానికి రాకుండా దాని అసలు కారణం సిన తెలుసుకోవాలే గాని మూఢనమ్మకాల పాలు కాకూడదు కు అని” చెప్పింది అపర్ణ.

"రైట్. కాబట్టి ప్రతి దయ్యం వెనుక ఇట్లాంటిది కు ఏదో ఉంటుందని అర్థమయ్యింది కదా!” అని తేల్చేశారు చి గౌతం మాస్టారు.

ఆధారం: తుర్లపాటి రామమోహన్ రావు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 11/20/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate