অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గ్రహణములు (నాటిక)

గ్రహణములు (నాటిక)

ఈ నాటిక ద్వారా గ్రహణం అనేది ఛాయ. అంతేగాని రాహుకేతువులనే పాములు సూర్యచంద్రులను మింగుతాయన్నది కట్టుకథ అని తెలియజేయుటకు ప్రాముఖ్యం.

ఈ నాటిక వలన విద్యార్థులల్లో ప్రయోగం ద్వారా గ్రహణం ఏర్పడు విధానం అవగాహన చేసుకుంటారు.

(ఇందులో పరిశీలన, ప్రశ్నించడం, పోల్చడం, ఊహించడం, సూచనలు పాటించడం, పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకోవడం వంటి అంతర్గత శక్తులను వెలికి తీయవచ్చు)

నానమ్మ: సూర్యం! శాస్త్రి గారింటికెళ్ళి దర్భ పట్టుకురా! రేపు గ్రహణం.

సూర్యం: ఏం గ్రహణం నానమ్మా!

నానమ్మ: సూర్యగ్రహణం రా!

సూర్యం: సూర్య గ్రహణానికీ, దర్భకూ ఏమిటి సంబంధం. ఆ ధర్భతో 'అబ్రకదబ్రా'.. అంటూ గ్రహణాన్ని ఆపుతావా నానమ్మా!

నానమ్మ: ఆకతాయి వెధవ. చెప్పింది చేయరా! వెదవ ప్రశ్నలూ... నువ్వునూ...

సూర్యం: అలాగే తెస్తా. దర్భతో ఏం చేస్తావో చెప్పు నానమ్మా...

నానమ్మ: దర్భని నీటిలో, పప్పులో, బియ్యంలో, ఇలా వస్తువుల్లో కొంత కొంత వేస్తే గ్రహణ దోషం అంటదు. అందుకని (తాతయ్య పుస్తకం చదువుతూంటారు)

సూర్యం: తాతయ్యా! బీరువా పై ఉన్న ఫుట్ బాల్, టెన్నిస్ బాల్, అలాగే టార్చ్ కూడా ఇవ్వాలి.

తాతయ్య: ఎందుకురా అవన్నీ.

సూర్యం: చిన్న పనుంది తాతయ్యా!

తాతయ్య: అలాగే తీసుకో! మళ్ళీ వాటిని జాగ్రత్తగా తెచ్చి పెట్టు. (సూర్యం అవన్నీ తీసుకొని వంటింటి వైపు వెళ్తుంటే తాతయ్య సూర్యంను అనుసరిస్తాడు. )

నానమ్మ: ఏంట్రా సూర్యం. ఇంకా ఇక్కడే ఉన్నావా? శాస్త్రి గారింటికి వెళ్ళలేదా!

సూర్యం: వెళ్తా నానమ్మా! ముందు నేను ఒక చిన్న ప్రయోగం చూపుతా. దాన్ని చూసి నేనడిగిన దానికి జవాబు చెప్పు. ఆ తర్వాత వెళ్ళి దర్భ తెస్తాను.

నానమ్మ: ఏంటో. ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం అంటూ, తికమక పెట్టేస్తావ్. అలాగే చూపించు చెప్తాను. డైనింగ్ టేబుల్ పై బాల్స్, టార్చి పెట్టి సూర్యం కిటికీ తలుపులు మూసి గదిని చీకటి చేస్తాడు. (టార్చితో టెన్నిస్ బాల్ పై కాంతిని ప్రసారం అయ్యేలా మూడింటిని అలా ఉంచి)

సూర్యం: చూశావా నానమ్మా! టెన్నిస్ బాల్ రెండో సగం నీడ ఫుట్ బాల్ పై కొంత భాగం పడి నీడ ఏర్పడేలా చేసింది. ఇప్పుడు ఇంట్లోనే గ్రహణం పట్టింది చూశావా! ఇప్పుడి ఫుట్ బాల్ ని ఏ పాము మింగుతోంది. చెప్పవా!

aug08.jpgనానమ్మ: ఏ పామూ మింగలేదు. టెన్నిస్ బాల్ నీడ ఫుట్ బాల్ పై పడినంత భాగం చీకటిగా ఉంది అంతే.

సూర్యం: కరెక్టుగా చెప్పావు నానమ్మా! విశ్వంలో కూడా ఇలాగే జరుగుతోంది. భూమి, చంద్రుడు, సూర్యుడు ఇలా ఒకే ఋజురేఖపైకి వస్తే ఇలాంటి గమ్మత్తు జరిగే గ్రహణాలు ఏర్పడతున్నాయి నాaug010.jpgనమ్మా! అంతే. సూర్యకిరణాలు చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడితే ‘చంద్రగ్రహణం', భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే ‘సూర్యగ్రహణం' ఏర్పడుతున్నాయి. ఈ చిన్న విషయానికే నీవింత హైరానా పడుతున్నావ్ నానమ్మా, ఇక వెళ్లి దర్భతేనా?

నానమ్మ: వద్దురా! ఇంత వివరంగా నీవు చెప్పాక నా మూఢనమ్మకం ఎప్పుడో ఎగిరిపోయింది. నా బంగారు తండ్రి. ఎన్ని తెలివితేటలో...

సూర్యం: థ్యాంక్స్ నానమ్మా! చాలా చక్కగా అర్థం చేసుకున్నావు.

తాతయ్య: (చప్పట్లు కొడుతూ) అయితే నీవు స్కూల్లో పాఠాలు చాలా చక్కగా వింటున్నావన్న మాట. గుడ్ బాయ్.

సూర్యం: థ్యాంక్స్ తాతయ్యా!

ఆధారం: ఎ.ఎస్. రెడ్డెమ్మ.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate