অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తడి నీటిలో పొడి చేయి

తడి నీటిలో పొడి చేయి

విన్నవాని కన్నా కన్నవాడధికుండు

కన్నవాని కంటే కలయువాడు

యున్నతోన్నతుడయి యుర్విలోపల నుండు

విశ్వదాభిరామ వినురవేమ

ఈ జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం జరిగింది కదా ఢిల్లీలో సంబరాలు జరిగాయి కదా. ఆ సంబరాలలో భాగంగా కొంతమంది పిల్లలకు వారి ధైర్యసాహసాలకు మెచ్చి రాష్ట్రపతి అవార్డులు ఇచ్చారు కదా. ఇలా ప్రతి సంవత్సరం ఇస్తారు అని మీకు తెలుసు. తోటివారిని కాపాడినందుకు తన ఊరిని కాపాడినందుకు... ఇలా ఇతరులకు సహాయ పడినందుకు ఈ Bravery అవార్డు ఇస్తారు. ఏదైనా సమాచారాన్ని విన్నవారికంటే ఆ విషయాన్ని చూసినవారు గొప్పవారని, చూసిన వారికంటే ఆ విషయంలో కలిసి పాల్గొన్న వారు ఇంకా గొప్పవారని, యుర్విలో అంటే ఈ భూమిలో వారే ఉన్నతులని వేమన గారు ఎప్పుడో చెప్పారు. ఎక్కడో పిల్లలు చెట్లు నాటి పెంచుతున్నారని వినడం కన్నా. చెట్లు నాటుతూ వునప్పుడు చూడడం కన్నా, మీరే వారితో కలిసి చేట్లు నాటితే అదే మిన్న. అవకాశమున్నప్పుడు వెనుక అడుగు వేయక ఇతరులకు సహాయం చేయండి సరేనా.

ఇక అసలు విషయానికి వస్తా. 'తడి నీటిలో పొడి చేయి' ఏం లేదు. ఒక వెడల్పాటి గ్లాసులో నీరు పోసి అందులో ఓ పదిరూపాయల నాణెం వేసి చేతితో తీయమని మీ స్నేహితునితో ఓ పందెం కాయండి. ఓ చిన్న మెలిక. చేతికి నీటి తడికాకుండా నాణెం బయటికి తీయాలి. రబ్బరు క్లౌజు, ప్లాస్టిక్ క్లౌజు లాంటివి వేసుకోకుండా అని చెప్పండి. అంతే మీ స్నేహితుడు పందెం ఓడిపోతాడు. మీరు ఇక పందెం గెలిచేయండి. ఎలాగంటారా, రండి చేసి చూద్దాం.

పైన చెప్పిన గ్లాసులో నీటిపై లైకోపోడియా పౌడరు లో (ఇది రసాయనాల షాపులో దొరుకుతుంది)ను పొరలాగ చల్లండి. ఇప్పుడు మీ చేయిని మెల్లగా నీటిలో దింపండి. ప్రతి లోపల గల 10 రూపాయల నాణెంను బయటకు తీసి చేతిని చూడండి. ఆశ్చర్యం మీ చేతికి తడి అంటి ఉండదు. ఇలా అదే ‘తడి నీటిలో పొడి చేయి' మీరు పందెం గెలిచారు.

అసలేం జరిగింది: మీరు నీటిలో చేయి పెట్టగానే లైకోపోడియా పౌడరు మీ చేతిని పూర్తిగా కప్పివేస్తుంది. ఈ లైకోపోడియం పౌడరుకు తడవకుండా వుండే గుణం (Not wettable) వుంది. తామరాకుపై నీరు పోస్తే మన ఆకు తడవదు కదా. అలాగే అన్నమాట. లైకోపోడియం పౌడరు నీటి లోపల మీ చేతికి గ్లౌజులాగ చేతిని అంటి పెట్టుకొని వుంటుంది. నీటికి చేతికి మధ్య పొరలాగ, నిరోధంలాగ పనిచేసి water proof లాగ పనిచేస్తుంది. ఇక అందువల్ల మీ చేయి తడవదు. నాణెం తీసివేయవచ్చు. ఒక వేళ లైకోపోడియం పౌడరు దొరకకపోతే టాల్కం పౌడరుతో కూడా ప్రయత్నించవచ్చు.

ఆధారం: యుగంధర్ బాబు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate