অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ద్రవ ధర్మామీటర్

ద్రవ ధర్మామీటర్

మెజీషియన్ చేతిలో ఒక మరుగునాళిక (Boiling tube) ఉంది. ఆ నాళికలో ఒక పింక్ రంగు ద్రావణం పోసి అందరికీ చూపించాడు. టేబుల్ మీద ఉన్న సారాదీపాన్ని (spirit lamp) వెలిగించి, నాళికను ఆ జ్వాల మీద వేడి చేశాడు. విద్యార్ధలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అందరూ చూస్తుండగానే ద్రావణం నీలిరంగులోకి మారిపోయింది. వేడి చేయడం ఆపి నాళికను స్టాండ్ లో ఉంచాడు. చల్లారిన తర్వాత ద్రావణం మళ్ళీ పింక్ రంగులోకి మారిపోయింది. అంతా చప్పట్లు కొట్టారు. “చూశారుగా. ఇదో ద్రవ థర్మామీటర్ ఉష్ణోగ్రతలో మార్పులను పసిగట్టి పింక్, నీలం రంగుల మధ్య కదలాడుతూ ఉంటుంది” అన్నాడు మెజీషియన్.

ఈ మేజిక్ ను మనం కూడా చెయ్యగలం. ఇందుకు కావల్సినవి.

కోబాల్ట్ క్లోరైడ్ హెక్సా హైడ్రేట్... 1 గ్రా. ఆల్కహాల్ ... 170 మి.లీ.

కోబాల్ట్ క్లోరైడ్ ను ఆల్కహాల్లో కరిగించాలి. పింక్ రంగు ద్రావణం ఏర్పడుతుంది. సుమారు 25 మి.లీ. ద్రావణాన్ని ఒక మరుగునాళికలోకి తీసుకుని, నెమ్మదిగా వేడిచేయాలి. ద్రావణం నీలం రంగులోకి మారుతుంది. చల్లారిస్తే మళ్ళీ పింక్ రంగులోకి మారుతుంది.

ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. సార్ట్ కోబాల్ట్ క్లోరైడ్ పింక్ రంగులో ఉంటుంది. వేడి చేయడం వల్ల కోబాల్ట్ క్లోరైడ్ అణువులకు కలపబడి ఉన్న నీటి అణువుల సంఖ్యలో మార్పు వస్తుంది. కోబాల్ట్ క్లోరైడ్ అణువులను విడిచిపెట్టే నీటిని ఆల్కహాల్ శోషణం చేసుకుంటుంది. చల్లార్చినప్పుడు ఈ ప్రక్రియ వెనక్కి మళ్ళుతుంది. ద్రావణాన్ని వేడిచేయడం చల్లార్చడం ఇలా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చేసినా ద్రావణం రంగు పింక్, నీలంల మధ్య మారుతూ ఉంటుంది.

ద్రావణాన్ని ఒక బీకరులో పోసి బీకర్ ను హాట్ ప్లేట్ మీద ఉంచి స్విచ్ ఆన్ చేస్తే ఆ వేడికి ద్రావణం పింక్ నుంచి నీలంకు మారుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ పింక్ రంగుకు తిరిగివస్తుంది. బీకరు వెనక ఒక ప్రకాశవంతమైన విద్యుద్దీపం పెడితే ఈ రంగు మార్పులు చాలా ఆకర్షణీయంగా, గమ్మత్తుగా కన్పిస్తాయి.

ఈ మేజీక్ ను మరింత ఉపయోగపడేలా కూడా చేయవచ్చు. పింక్ రంగు ద్రావణాన్ని బీకరులో తీసుకుని, గది ఉష్ణోగ్రత కంటే కొంచెం ఎక్కువగా వేడిచేయాలి. నీలంరంగుకు మారిన తర్వాత పింక్ రంగు వచ్చేదాకా కొన్ని చుక్కలు నీరు కలిపితే, ఈ ద్రావణం గది ఉష్ణోగ్రత వద్ద పింక్ రంగులో ఉంటుంది. ఉష్ణోగ్రతలో మార్పును చాలా తేలిగ్గా కనిపెడుతుంది.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate