অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నట్టింట్లో ఫౌంటెన్

నట్టింట్లో ఫౌంటెన్

నీటిని పొదుపు చేస్తే నీటిని సృష్టించినట్లే (Water Saved is Water Produced). మీరు ఉదయాన్నే పళ్ళు తోమేటప్పుడు బ్రష్ పై పేస్టు వేసి కొళ్ళాయి క్రింద తడుపుతుంటారు. అలా బ్రష్ చేస్తున్నంత సేపు కొళాయిలో నీరు వృధాగా క్రిందికి పోతూనే ఉంటుంది కదా. నీటిని అలా వృధా చేయరాదు. భూమిలో నీటిని తోడి వేస్తే, మరలా భూమిలోనికి నీరు చేరడానికి చాలా కాలం పడుతుంది. అందుకే నీటిని పొదుపు చేయాలి. సరేనా.

మామూలుగా “నీరు పల్లమెరుగు” అని సామెత. అంటే నీరు ఎత్తు నుండి క్రిందికి ప్రవహిస్తుందని అర్థం. కాని మనం దానికి విరుద్ధంగా నీరుపైకి ఎగబాకుతుందని నిరూపిద్దాం. నీరు పైకి వెదజల్లుతుందని చూపుదాం అంటే 'నట్టింట్లో ఫౌంటెన్' ఏర్పాటు చేద్దామా, రండి చేసిచూద్దాం!

కావలసిన పరికరాలు:

  1. గాజుసీసా,
  2. సీసా మూతికి సంబో కార్కు
  3. గట్టి స్ట్రా
  4. ఓ పెద్ద ట్రే.

చేయువిధానము:

గాజు సీసా తీసుకుని దానిలో సగం వరకు నీరుపోయండి. సీసామూతికి కార్కును గట్టిగా బిగించండి. కారు మధ్యలో ఓ రంధ్రం చేసి గట్టి స్ట్రాను రంధ్రం గుండా సీసాలోనికి దించండి. స్ట్రా సీసాలో దాదాపు క్రింద వరకు చేరేలా దూర్చండి. (కార్కు రంధ్రం స్ట్రా చుట్టూ ఖాళీ లేకుండా చూసుకోవాలి).

ఈ సీసాను ట్రే మధ్యలో వుంచండి. అంతే మన ప్రయోగం అమరిక రెడీ. ఇప్పుడు మీరు గాలి బాగా పీల్చుకొని స్ట్రా గుండా సీసా లోనికి గట్టిగా గాలిని నిలుపకుండా ఊదండి. మొదట్లో మీరు ఊదిన బుడుగలు నీటి లో వస్తాయి. వాటి గురించి పట్టించుకోకండి. ఎంత సేపు నిలుపకుండా గాలి ఊదగలరో ఊది, వెంటనే మీ ముఖాన్ని సీసాక దూరంగా జరపండి. వెంటనే నీరు స్ట్రా గుండా 'ఫౌంటెన్'లాగ ఎగజిమ్ముతుంది. చూశారా “నట్టింట్లో ఫౌంటెన్”. ఇలా కాసేపు ఫౌంటెన్ ఎగజిమ్మి ఆగిపోతుంది. ఇంకోక్క వింత. మీరు గాలి ఊదిన వెంటనే స్ట్రా చివర నొక్కి ఉంచితే ఫౌంటెన్ ఇంకా ఎత్తుకు ఎగిరి, ఇంకా కాసేపు నీరు ఎగజిమ్ముతుంది.

ఇది ఎలా సాధ్యం? అసలేం జరిగింది?

గాలి ఊదక ముందు బాటిల్ లోని నీటిపై గాలి ఆవరించి వుంటుంది. ఈ గాలి పీడనం సీసా వెలుపల వున్న గాలి పీడనానికి సమానంగా వుంటుంది. మీరు గాలి ఊదుతున్నప్పుడు గాలి సీసాలో ప్రవేశించి నీటిలో బుడగలుగా ప్రయాణించి నీటి పై భాగాన్ని చేరుతుంది. కానీ ఇది వరకే అక్కడ గాలి వుంది కదా. ఆ గాలిని నోక్కుతూ మీరు ఊదిన గాలి అక్కడకు చేరుతుంది. అప్పుడు సీసాలోని గాలి పీడనం వెలుపల ఉన్న గాలి పీడనం కంటే ఎక్కువ అవుతుంది. మీరేమో నిలుపకుండా గాలి ఊదుతూ వుంటారు కదా... లోపల పీడనం పెరుగుతూ వుంటుంది.. తద్వారా నీటిపై ఒత్తిడి వల్ల నీరు స్ట్రా గుండా వేగంగా వెలువడి పైకి వెదజిమ్ముతుంది. అదే ఫౌంటెన్. ఇంత ఒత్తిడి లోపల ఏర్పడుతుంది కనుకనే కార్కు సీసామూతికి బిగుతుగా వుండాలి. లేకుంటే కార్కు టప్ మని పైకి ఎగురుతుంది.

స్ట్రా కొసను నొక్కినప్పుడు నీరు వెలువడే మార్గం చిన్నదై, ఇంకా ఒత్తిడి పెరిగి నీరు ఇంకాస్త పైకి ఎగజిమ్ముతుంది. కొంచెం నీరు బయటకు వస్తు కాసేపు ఎక్కువగా ఫౌంటెన్ పని చేస్తుంది. లోపలి పీడనం, వెలుపలి పీడనం సమానం అయ్యేంతవరకు నీరు చిమ్ముతుంది.

కొబ్బరిబొండాం చిల్లు పెట్టినప్పుడు నీరు పైకి ఎగజిమ్మడం మీరు గమనించి వుంటారు. కొబ్బరి బొండాంలో నీరు అధిక ఒత్తిడి వద్ద ఉంటుంది. చిల్లు పెట్టగానే వెలుపలి గాలి పీడనానికి సమానం కావడానికి నీరు పైకి వెదజల్లుతుం అదన్నమాట. ఇదే నా సూత్రం ఆధారంగా నేలచరియల్లో దాగున్న పెట్రోలియం ద్రవాన్ని మన ONGC (Oil and Natural Gas Corporation) వాళ్లు నేల నుంచి, సముద్ర గర్భం నుంచి పైకి చిమ్మేలా చేస్తారు. అధిక మోతాదులో నీటిని లేదా గాలిని పెద్దరంధ్రం గుండా పంపుతారు. అదే రంద్రానికి ఏకాక్ష స్తూపాకారంలో ఉన్న మరో రంధ్రం ద్వారా పెట్రోలు బయటికి వస్తుందన్నమాట.

రచన: యుగంధర్ బాబు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate