ఏ వస్తువును అయినా మండిస్తే అది కాలి బూడిదవుతుంది. కాని అలా బూడిద కాకుండా నెను మంత్రం వేస్తా! మీలో ఎవరైనా మీ జేబు రుమాలు ఇవ్వండి దాన్ని మండిస్తా! మీ జేబు రుమాలు మళ్ళి మీకీచ్చేస్తా అన్నాడు మెజీషియన్.
అనిష్ తన జేబు రుమాలును మేజిషియన్ కి ఇచ్చాడు. టేబుల్ మీద ఒక బీకర్ లో రంగులేని ద్రవం వుంది. మెజీషియన్ జేబు రుమాలును ఆ ద్రవంలో పూర్తిగా ముంచాడు. రుమాలును నీటిలో నానబెడుతున్నాడనే అంతా అనుకున్నారు. రుమాలును టంగ్ తో బయటికి తీసి, కొంచెం పిండిన తర్వాత అగ్గిపుల్లతో అంటించాడు. మంట వచ్చింది. మండుతున్న రుమాలును టంగ్ తో పట్టుకొని అందరికి చూపించాడు. కొన్ని నిమిషాల్లో మంట ఆరిపోయింది. కాని ఆశ్చర్యంగా రుమాలు మాత్రం కాలకుండా మిగిలిపోయింది. రుమాలును తిరిగి అనిష్ కి ఇచ్చేశాడు మెజీషియన్. అంతా చప్పట్లు కొట్టారు.
ఈ మేజిక్ లో మెజీషియన్ ఏమి మంత్రం వెయ్యలేదు. రుమాలు మీద ఏర్పడింది చల్లని మంట కాబట్టి రుమాలు కాలిపోలేదు.
ఇందుకు కావలసినవి :ఇధైల్ ఆల్కహాల్, నీరు, బీకరు
250 మి.లీ బీకర్ లో 15 మి.లీ ఇధైల్ అల్కహాల్ ను తీసుకోని, దానికి సుమారు 90 మి.లీ నీటిని కలపాలి. ఈ ద్రవంలో రుమాలును నానబెట్టి అంటించాలి. రుమాలు కాలిపోదు.
నీరు-అల్కహాల్ మిశ్రమాన్ని మండించినప్పుడు వేగంగా భాష్పికరణం జరగడం వల్ల చల్లదనం వస్తుంది.
నిర్వహణ: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/9/2020