నేషనల్ సైన్స్ డే సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన కెమిస్ట్రీ మేజిక్ షా ఆసక్తికరంగా సాగుతోంది. మెజీషియన్ సుబ్బు ఇష్టం కదా. రసాయనాలతో ఒక హర్మోనియం సృష్టించి మీకు శ్రావ్యమైన సంగీతం వినిపిస్తాను అన్నాడు.
టేబుల్ మీద ఒక ఉల్ఫ్ పాత్రను ఉంచి దానిలో కొని చిన్నచిన్న రాళ్ళను ఉంచాడు. పాత్రకు ఒక ధిసిల్ గొట్టం గుండా ఏదో ద్రవాన్ని పోసి, గాజు గొట్టం చివరన అగ్గిపుల్లను వెలిగించి ఉంచాడు. మంట వచ్చింది. ఒక గాజుగోట్టాన్ని తీసుకుని, ఆ గొట్టం మంటను చుట్టి ఉండేటట్లు చేతిలో పట్టుకున్నాదు. గొట్టాన్ని పైకి కిందకి నెమ్మదిగా కదిపాడు. అంతే శ్రావ్యమైన ధ్వని వినిపించింది. అంతా చప్పట్లు కొట్టారు. ఇది పాటపాడే మంట (singing flame) అనుకున్నారు.
ఈ మేజిక్ ను మనం కూడా చేసి చూద్దాం.
మెజిషియన్ ఉల్ఫ్ పాత్రలో ఉంచినవి. మామూలు రాళ్ళు కావు. జింక్ ముక్కలు. వాటి మీద పోసిన ద్రవం సల్ఫ్యూరిక్ ఆమ్లం.
కావలసినవి: జింక్ ముక్కలు, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం, గాజుగొట్టం. ఉల్ఫ్ పాత్రలో జింక్ ముక్కలు ఉంచి పాత్రకు ధిసిల్ గరాటును. వంపు గాజు గొట్టాన్ని అమర్చాలి. ధిసిల్ గరాటు గుండా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం పోయాలి. రసాయన చర్యజరిగి హైడ్రో జన్ వాయువు వెలువడుతుంది.
అగ్గిపుల్లను వెలిగించి గొట్టం చివరన ఉంచాలి. హైడ్రోజన్ అంటుకుని మండుతుంది. ఒక అగుళం వ్యాసం ఉన్న గాజుగొట్టాన్ని తీసుకోని ఆ గొట్టం పైడ్రోజన్ మంటను చుట్టి ఉండేటట్లు చేతిలో పట్టుకొని, నెమ్మదిగా అగ్గిపుల్లను వెలిగించి గొట్టం చివరన ఉంచాలి. హైడ్రోజన్ అంటుకుని మండుతుంది. ఒక అంగుళం వ్యాసం ఉన్న గాజు గొట్టాన్ని తీసుకోని ఆ గొట్టం హైడ్రో జన్ మంటను చుట్టి ఉండేటట్లు చేతిలో పట్టుకొని నెమ్మదిగా పైకి కిందకి కదపండి. శ్రావ్యమైన ధ్వని విన్పిస్తుంది.
ఆధారం : డా. ఇ.ఆర్. సుబ్రమ్మాణ్యం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020