టేబుల్ మీద ఒక స్టా ఉంది. ఒక గుండ్రని మట్టగల గాజుకుప్పెలో కొద్దిగా నీరుపోసి, కుప్పెను స్టా మీద పెట్టాడు మెజీషియన్ సుబ్బు. సౌ వెలిగించాడు. కుప్పెలో నీరు మరగడం ప్రారంభించింది. నీరు మరుగుతుండగానే ఒక తడిగా ఉన్న రబ్బరు బిరడాను ప్లాస్క్ మూతికి గట్టిగా బిగించి స్టౌ ఆర్పివేశాడు మెజీషియన్. స్టౌ ఆరిపోయినా నీరు మరగడం ఆగిపోలేదు. గాజుకుప్పె కాబట్టి నీరు మరగుతుండడం స్పష్టంగా కన్పిస్తూనే ఉంది. గాజుకుప్పెను స్టౌ నుంచి తీసి ఒక తొట్టెలో ఉన్న మంచు ముక్కల మధ్య ఉంచాడు. ఫాన్లో నీరు మరింత వేగంగా మరగడం ప్రారంభించింది. అంతా చప్పట్లు కొట్టారు. మేజిక్ బాగుంది కదూ!
ఈ మేజిక్ మనమూ చేయగలం.
కావలసినవి: పెద్ద సైజు ఎల్లెన్ మేయర్ ఫ్లాస్క్ లేదా గుండ్రని మట్టుగల గాజుకుప్పె, నీరు, స్టౌ లేదా బున్సెన్ బర్నర్, మెజీషియన్ చేసినట్లుగా గుండ్రని మట్టుగల పెద్ద గాజుకుప్పెలో సుమారు 100 మి.లీ. నీరు తీసుకుని, బుస్సెన్ జ్వాల లేదా స్ట్రా సహాయంతో మరిగించి నీరు మరుగుతుండగానే, ఒక రబ్బరు బిరడాను నీటితో తడిపి ఫ్లాస్క్ మూతికి బిగించి వెంటనే మంటను ఆర్పివేయాలి. చూస్తుండగానే, ఫ్లాస్క్లో నీరు మరింత ఉధృతంగా మరగడం మొదలవుతుంది. ఫ్లాస్క్ ను చల్లటినీరు లేదా మంచు ముక్కలతో మరింతగా చల్ల బరిస్తే, ఫ్లాస్క్ లోని నీరు ఇంకా వేగంగా మరుగుతుంది. ఈ మేజిక్ లో గాజుకుప్పె బదులు, ఒక వార్నిష్ డబ్బా (రేకు డబ్బా) ఉపయోగిస్తే నీరు మరగడం మొదలైన తర్వాత డబ్బా మూతికి రబ్బరు బిరడాను గట్టిగా బిగించి మంటను తొగిస్తే, డబ్బా ఒక్కసారిగా నొక్కుకుపోతుంది.
ఇలా ఎందుకు జరుగుతుంది?
బిరడాను బిగించి మంటను తొలగించిన తర్వాత, ఫ్లాస్క్ లేదా వార్నిష్ డబ్బాలో నీటి ఆవిరి ద్రవీకరించి, పాక్షిక శూన్యం (partial vacuum) ఏర్పడుతుంది. ఫ్లాస్క్న చల్లబరిస్తే ఎక్కువ నీటి ఆవిరి ద్రవీకరించి పాక్షికశూన్యం మరింత పెరుగుతుంది.
వార్నిష్ డబ్బాతో మేజిక్ చేసినప్పుడు, డబ్బాలో పాక్షిక పీడనం ఏర్పడినందువల్ల, బయటిగాలి పీడనాన్ని సమతుల్యం చేసేందుకు డబ్బాలోపల పీడనం సరిపోదు కాబట్టి, డబ్బా నొక్కుకు పోతుంది. గాజుఫ్లాస్క్ తో ప్రయోగం చేసేటప్పుడు, పీడన ప్రభావం వల్ల పాత్ర పగిలిపోవచ్చు. జాగ్రత్త సుమా!
ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మాణ్యం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/9/2020