నీటికణాల సమూహం కాంతిని పరిక్షేపించడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. నిజానికి ప్రయోగశాలలో ఏదైనా రసాయన చర్యలో పొగమంచు ఏర్పడేందుకు కావాల్సిన పరిస్థితులు కల్పించడం చాలా కష్టం. కాని, ఒక ప్రయోగం ద్వారా మనముందు పొగమంచును సృష్టించి, కొద్దిసేపు మనం మాయమైనట్లు చేసుకోగలం.
నేనిప్పుడో మేజిక్ చేస్తాను. మీ ముందు మాయమౌతాను' గమనించండి అన్నాడు మెజీషియన్. విద్యార్థులంతా ఆతృతతో చూస్తున్నారు.
మెజీషియన్ ఒక పొడవైన లోహపు మూసను (24x1X1) టేబిల్ మీద ఉంచి, దానిలో ఏవో గుళికలను పరచి, ఆ గుళికల మీద ఒక పదార్థాన్ని ఉంచి కప్పివేశాడు. ఒక గాజుకడ్డీతో మూసలోని పదార్థాన్ని వేగంగా కలిపాడు. రెండు నిమిషాల్లో ఆ మూస అంచుల వెంబడి దట్టమైన పొగమంచు ఏర్పడి పైకి లేచింది. అప్పటిదాకా టేబిల్ దగ్గరే నిలబడి ఉన్న మెజీషియన్ మాయమైపోయాడు. కొంత సేపటికి పొగమంచు తగ్గిపోయింది. మెజీషియన్ మళ్ళీ అందరికీ కన్పించాడు. అంతా చప్పట్లు కొట్టారు.
ఈ మేజిక్ మనం కూడా చాలా తేలికగా చేయుగలం. ఇందుకు కావల్సినవి. పొటాషియం హైడ్రాక్సైడ్ గుళికలు (20 గ్రా.), హైడ్రాక్సిల్ ఎమీన్ హైడ్రోక్లోరైడ్ (20 గ్రా).
ముందుగా రెండడుగుల పొడవు (24 అంగుళాలు), ఒక అంగుళం వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న ఒక లోహపు మూసను తీసుకుని, అందులో 20 గ్రా. పొటాషియం హైడ్రాక్సైడ్ గుళికలను ఒక పొరలాగా పరచి, వాటికి 20 గ్రా. హైడ్రాక్సిల్ ఎమీన్ హైడ్రోక్లోరైడ్తో కప్పాలి. వెంటనే ఒక గాజు కడ్డీతో వేగంగా కలియబెట్టాలి. రసాయన చర్య జరగి దట్టమౌన పొగమంచు ఏర్పడుతుంది........... పొగమంచు ఇదే.
ఇలా ఎందుకు జరుగుతుంది? హైడ్రాక్సిల్ ఎమీన్ వినియోగం చెందినపుడు అమ్మోనియా, నైట్రోజన్, నీరు ఏర్పడుతాయి. ఒక గ్రాము హైడ్రాక్సిల్ ఎమీన్ హైడ్రోక్లోరైడ్ (NH2OH.HCI) ఒక లీటరు పైగా పొగమంచును ఏర్పరుస్తుంది! పొటాషియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరికామ్లంల తటస్థీకరణ చర్యలో ఏర్పడే ఉష్ణశక్తి, నీటిని పొగమంచును పోలిన కణాలుగా మార్పు చెందిస్తుంది. జాగ్రత్త! ఈ మేజిక్ చేసినపుడు మూసలో తెల్లని అవశేషం ఏర్పడుతుంది. మూస బాగా వేడెక్కుతుంది.
ఆధారం: డా. ఇ. ఆర్. సుబ్రహ్మణ్యం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020