অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వైజ్ఞనిక ప్రగతిని మలుపు తిప్పిన మూడు ఆవిష్కరణలు

వైజ్ఞనిక ప్రగతిని మలుపు తిప్పిన మూడు ఆవిష్కరణలు

కృత్రిమ కణం

వాటిలో ప్రముఖంగా పేర్కొనదగినది-డాక్టర్ క్రెయిగ్ వెంటర్ కంప్యుటర్ సహాయంతో మైకోబాక్టిరియ మైకాయిడిస్ అనే సుక్ష్మజివి జినోమ్ ను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసి, వినూత్న జీవిని తయారు చేయటం. ఇది సృష్టికి ప్రతిసృష్టి చేయటంతో సమానమని ప్రపంచం యావత్తూ కొనియోడిందంటే ఎంత గొప్ప పరిశోధనో అర్ధం చేసుకోవచ్చు.

jan5.jpgక్రెయిగ్ వెంటర్ అనే అమెరికన్ శాస్త్రవేత్త 2010 మే నేల 20వ తేదిన తన సహచర శాస్త్రజ్ఞాలుబృందం కృత్రిమంగా తయారుచేసిన జీవం గురించి ప్రకటించారు. ఆధునిక కంప్యూటర్ పరిజ్ఞానంలో నూతనంగా న్యూక్లియోటైడ్లను ఓ పధ్ధతి ప్రకారం కలిపి కృత్రిమ ముక్కను తయారుచేశారు. అంటే పూర్తి నిర్జీవ రసాయనిక పదార్ధాలను క్రమెపీ సంశ్లేషించి ఇదివరకు ఏ జీవిలోనూ లేని విధంగా పూర్తిగా తాజా రూపం, జన్యు నిర్మాణాలు ఉన్న పోలికను తయారుచేశారన్నమాట. ఆ తర్వాత ఎస్టరిషియా కోలై అనే బాక్టిరియా కణాల్లోకి కేంద్రకాల్లో (nuclei) ఉన్న క్రోమోజోములను పూర్తిగా తీసేశారు. ఆ ఖాళీ కణాలలోకి కృత్రిమంగా నిర్జీవ పదార్దాలనుంచి ప్రయోగశాలలో సంశ్లేషించిన జన్యుపదర్ధాన్ని ఇమిడ్చారూ. నిర్జీవ ద్రవమైన సైటోప్లాజం (కణద్రవం) ను కూడా ఇంజక్ట్ చేశారు. ఇంకే ముంది! క్రమేణా కొత్త కణాలు వచ్చాయి. కాన విభజన (Cell Division) జరగడం, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడం జివులకున్న అత్యంత కీలక లక్షణం. అంటే కొత్త జీవి ఏర్పడ్డట్టె కదా! మరి ఈ జీవికి తల్లి ఎవరు? ఎస్టరిషియా కోలై కానే కాదు! మరే ఇతర జీవి కూడా కాదు. కంప్యూటర్లలో ఉన్న జినోమేక్స్ సాఫ్ట్ వేర్ ఈ నూతన జీవికి తల్లి, తండ్రి. దీన్ని బట్టి మనకు తేటతెల్ల మయ్యేదేమిటి? భూమ్మీద జీవాన్ని ఎవరో సృష్టికర్త సృష్టించలేదని జీవం భూమిమీద ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న పరిస్ధితుల వల్ల నిర్జీవ పదార్ధాలనుంచే ఏర్పడిందని. వెంటర్ సృష్టికి, క్లోనింగ్ కు చాలా తేడా ఉండి. క్లోనింగ్ ప్రక్రియలో ఏర్పడ్డ జీవికి తల్లి ఉంది. కాని వెంటర్ నిర్మించిన జీవికి తల్లి నిర్జీవ రసాయనాలే.

క్వాంటం యంత్రం

ప్రపంచంలోనే అత్యుత్తమ విజ్ఞానిక పత్రీకగా పేరుగాంచిన సైన్సు 2010లో జరిగిన గొప్ప అవిష్కరణగా క్వాంటమ్ యంత్రాన్ని Quantum machine ఎంపిక చేసింది. ఈ పరికరాన్ని కంటితో చూడలేము. దీని వ్యాసం ఒక మెంట్రుక వ్యాసం కంటే కొన్ని వేల రెట్లు తక్కువ. ఇది సామాన్యంగా అన్ని పదార్దాల్లాగా యాంత్రిక శాస్త్రనియమాలకు, సూత్రాలకు లోబడదు. ఇది ఒక అనువులా, పరమానువులా ప్రవర్తిస్తూనిత్యం చలనాన్ని చూపుతుంది. ఆండ్రు క్లిలాండ్, జూన్ మార్టినిన్ అనే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రజ్ఞాలు ఈ క్వాటం యంత్రాన్ని రూపొందించారు. “సైన్సు” పత్రిక ఇచ్చే ఈ విశిష్ట అవార్డుకు శాస్త్రరంగంలో గొప్ప గుర్తింపు ఉంది.

గ్రాఫిన్

2010 సం.లో కనుగొన్న మరో అద్భుతం గ్రాఫిన్. స్టిల్ కన్నా వందరెట్లు ధృడమైనది. అత్యంత పలుచనైన సరికొత్త కర్బన రూపం ఈ గ్రఫిన్.

దీనిని ఆంద్రె జైమ్, కాన్ స్టాంటిన్ నోవసేలోవ్ అనే శాస్త్రజ్ఞులు రష్యాలో పుట్టి మాంచేష్టర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలు కాని పెట్టారు, ఇది క్వాంటం భౌతికశాస్త్రం నుండి మనం నిత్యం వాడుకునే ఎలక్ట్రానిక్ పరికరాలు వరకూ అన్నింటిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన గొప్ప ఆవిష్కరణగా చెప్పకోదగినది. పారదర్శకంగా ఉండే టచ్ స్క్రీన్లు సౌర బ్యాటరీల తయారీలో దీని ఉపయోగం చాలా ఎక్కువ.

గ్రాఫిక్స్ ఆత్మకధ

jan6.jpgనేనెవర్నో మీకు తెలుసా? మీరు రోజూ వాడే గొప్ప తనం మాత్రం మీకు తెలియదు. అందరూ పనికిరాని బొగ్గు కార్బన పదార్ధం అనుకొంటారు. కర్బనం అంటే సామాన్యం కాదందోయ్! చెకుముకి లాంటి పదునైన మెదడు ఉంటే సానపడితే అసలు సంగతి బయటకు వస్తుంది మరి, మాంచెష్టర్లో పరిశోధిస్తు నాలోతుల్ని తెలుసుకున్నారు. మీకు మామూలు పెన్సిలుమొనలా కనబడతాను కాని నాలో కంటికి కన్పించనంత పలుచగా మీ దుస్తుల్లో ఉన్నట్లు ఎన్నో వేల, లక్షల పొరలు ఉంటాయి. ఆ పొరలను వారు బయటకు తీసారు. పెన్సిల్ తీసారు. పెన్సిల్ రంగు మీకు తెలుసు కాని నిజానికి నాకు ఏ రంగూ లేదంటే నమ్మండి.

కంటికి కనిపించని ఆ పొరకు ఎంత శక్తి ఉంటుందో ఊహించగలరా? రాగి (Cu) విద్యుత్ వాహాక శక్తికి సమానంగా నేను విద్యుత్ ను ప్రసారం చేయగలను. ఉష్నోగ్రాహక శక్తి ఇప్పటికి తెల్సిన అన్ని పదార్దాల కంటే నాకే మిన్న. నేనేనంత పలుచనైనా నా నుండి కనీసం అతి చిన్నదైన హీలియం (He) వాయువు కూడా దురిపోలేదు సుమా! ఇంతటి బక్కపలుచటి కర్బన్ స్పటికి పదార్ధాన్ని అయినా స్దిరంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు కదా !

బొగ్గు బల్లపరుపైన పలుచని పొరగా ఉండి ఊహాకందని ధర్మాలు చూపడానికి క్వాంటం భౌతిక శాస్త్రసూత్రాలే ప్రధాన కారణం . నా పారదర్శక లక్షణం వల్ల మీరు మీ నిత్య జీవితంలో వినియోగించే ATM లలో (తాకితే పనిచేసే స్క్రీన్లలో) నా ఉపయోగం చాలా ఎక్కువ. సౌరశక్తిని బంధించే బ్యాటరీల తయారీలో నేను తోడ్పడతాను. కాంతిని ఉపయోగించి తిరిగే ఫంకాలకు కూడా నాతో పని ఉంటుంది. విమానాలు, కార్లు, అంతరిక్షనంలోకి పంపే ఉపగ్రహాల్లో నా అంత ధ్రుడంగా మరొకటి ఉండదు మారి. అందుకే నాతో కలిసి రకరకాల మిశ్రమలోహాలుముందు ముందు ఉపయోగంలోకి రానున్నాయి.

ఆంద్రే జైమ్, నోవో సెలోవ్ ఆడుతూ పాడుతూ చేసిన శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా నా రహస్యాలు బయటపడ్డాయి. మీరూ సైన్సును సరదాగా శాస్త్రీయంగా నేర్చుకొని కొత్త విషయాలను బయటకు తీసి మానవాళికి మేలు చేస్తారు కదా!

ఆధారం: ప్రొ.యం. ఆదినారాయణ మరియు ప్రొ. కట్టా సత్యప్రసాద్

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate