অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఈశ్వరీబాయి

ఈశ్వరీబాయి

భారత రాజకీయాలలో, తాత్త్విక ఆలోచనలో అంబేద్కర్ ప్రత్యేకతను గుర్తించి, ఆ ప్రభావంతో రాజకీయాలలోకి వచ్చారు. ఈశ్వరీబాయి. అంబేద్కర్ రచనలు శ్రద్దగా అధ్యయనం చేసి, అయన సిద్దాంతాలతో ఆశయాలతో దళితుల జీవితాలు బాగుపడతాయని నమ్మి పనిచేసిన తొలితరం మహిళ ఈశ్వరీబాయి. చిన్నతనం నుంచి, అంబేద్కర్ నాయతకత్వంలో పనిచేసే ప్రజాసంఘాలు జంటనగరాలలో ఏ సభ ఏర్పాటుచేసినా, ఈశ్వరీబాయి తప్పక హాజరయ్యేవారు. తన చుట్టూ సమాజంలో పేద ప్రజలు, కింది కులాల ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు చూస్తూ, అగ్రవర్ణాలు చూపే ఆధిక్యత, బడుగువర్గాల పై జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలు చూసి, ఆమె స్పందించి, న్యాయం కోసం పోరాడాలనుకునేవారు.

ఈశ్వరీబాయి సికింద్రాబాదులో నివసించే సామాన్య "హరిజన" కుటుంబంలో పుట్టారు. తండ్రి బల్లెపు బలరామస్వామి. తల్లి రాములమ్మ. కిస్ హైస్కూలులో చదువుకున్నారు. పదమూడేళ్ళకే పునకు చెందిన డాక్టర్ లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది. ఐతే వైవాహిక జీవితంలో కలతలు రావడంతో సికిందరాబాద్ కి తిరిగివచ్చి తన ఆత్మభిమానాన్ని, ధైర్యసాహసాలను నమ్ముకుని జీవితం ప్రారంభించారు. సికిందరాబాద్ లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా కొంత కాలం పనిచేశారు.

1951 లో హైదరాబాదు, సికిందరాబాదు నగరాలలో పురపాలక సంఘా ఎన్నికలు మొదటిసారిగా ప్రజాస్వామ్యారీతిలో, వాయేజన ఓటింగ్ పద్ధతి పై జరిగాయి. ఆ ఎన్నికలలో ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు అంగబలం, అర్ధబలం లేకపోయినా, రాజకీయాలకు కొత్తయిన, విజయం సాధించారు. అధికారంలో ఉన్నకాలంలో మురికి వాడల్లో మంచినీటి పంపులు. విధి దీపాలు, మరుగుదొడ్లు ఏర్పాటుచేయంచి, మొదటిసారి ఆ వదలలోకి అభివృద్ధి కార్యక్రమాలను తీసికెళ్ళారు. హైదరాబాదుకు పొట్టచేతబట్టుకుని వచ్చిన వందలాది గ్రామీణ కార్మికులకు ఇండ్ల స్ధలాలు ఇప్పించారు.

1960లో ఆంద్రప్రదేశ్ షెడ్యూల్ కులాల పెడరెషన్ కు ఈశ్వరీబాయి ప్రధాన కార్యదేశిగా పనిచేశారు. 1967 లో ఆమె నిజామాబాద్ జిల్లా యల్లారెడ్డి నియెజక వర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.రిపబ్లికన్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు మీదట కండ్లెవర్గం (అంబేడ్కరైట్)లో, తర్వాత కుబేర్ గాఢ్ వర్గంలో చేరి పనిచేశారు.

శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎంతో బాధ్యతతో పనిచేశారు. ఆనతి శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, జి.శివయ్య వంటి వారితో సమానంగా ఆమె ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ప్రశ్నించేవారు. నిలదీసేవారు. ప్రతి చిన్న సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేవారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాల గురించి, ఆమె ఎన్నో సార్లు శాసనసభలో ఉదాహరణ సహితంగా పేర్కొన్నారు. హరిజనుల నివాస స్ధలాల గురించి ఆందోళన చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ ప్రజాసమితి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఆగిన సందర్భరంలో ఇందిరాగాంధీ చేసిన రాజి ప్రతిపాదనను ఈశ్వరీబాయి అంగీకరించలేదు. తన ఆలోచనలతో ఏకీభవించే మరికొందరు నాయకులతో కలిసి సంపూర్ణ ప్రజాసమితి ఏర్పాటుచేసి అందులో ముఖ్యపాత్రను నిర్వహించారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాఫల్యానికి ఎనలేని కృషిచేసిన రాజకీయ నాయకురాలిగా ఈశ్వరీబాయి చరిత్రలో నిలుస్తారు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate