অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జోసెఫ్ డామియన్ (1840 - 1889)

జోసెఫ్ డామియన్ (1840 - 1889)

బాలలూ! అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం, అవసరమైన సహాయం అందించడంలో అపారమైన అనందం ఉంది. అదొక అందమైన అనుభూతి. అనుభవించిన వారు కూడా వర్ణించలేని అద్భుత తృప్తి అది. వ్యాధిగ్రస్తులను చూసి భయపడినా, చికాకుతో చీదరించుకున్న అది వారికీ ఎంతో మనస్తాపం కలిగిస్తుంది. మఖ్యంగా కుష్టు వయాదితో బాధపడుతున్న దురదృష్టవంతుల్ని మన సమాజంలో ఇప్పటికి కొంతమంది దరిచేరనివ్వటంలేదు. వారిని చూసి భయపడి దూరంగా పోతున్నారు.

వాస్తవానికి ఆ వ్యాధి ప్రస్తుత కాలంలో ప్రమాదకరమైనది. కానేకాదు. అంటువ్యాధి అసలేకాదు. అది రాకుండా నిరోధించటానికి, వచ్చిన తగ్గించడానికి ఇప్పుడు ఎన్నో మందులొచ్చాయి. వాతావరణం, నీరు, ఇతర కాలుష్యాలవల్ల ఏర్పడే ఈ వ్యాధి ఎవరికైనా సోకినప్పుడు మనం వారిని ప్రేమతో పలకరించి, ఆప్యాయంగా కలిసినప్పుడు వారికీ కలిగే అనందం వర్ణనాతీతం. దురదృష్టవశాత్తు వారికీ సంక్రమించిన ఆ వ్యాధిని వారు ఒక శాపంగా భావించి, వైద్యులను సంప్రదించక, ఎటువంటి చికిత్స చేయించుకోవడం లేదు. అటువంటి వారిని అభిమానంతో పలకరించి ప్రేమాభిమానాలు పంచిపెట్టి, వారికీ సేవ చేయవలసిన భాద్యత మన అందిరిమీద ఉంది.

దాదాపు వంద సంవత్సరాల క్రితం ఈ వ్యాధి మరి ఉధృతంగా ఉండేది. ఆ కాలంలో ఇన్ని మందులు లేవు. వ్యాధి సోకినా వారికి మరణమే శరణ్యం. అన్ని దేశాల ప్రభుత్వాలు ఈ వ్యాధి సోకినవారిని హవాయ్ దీవుల దగ్గరున్న మేలకాయ్ దివికి పంపేవారు. అక్కడ ఉండేవారందరు రోగులే. వారికి అక్కడ వైద్య సౌకర్యం లేదు. ఇక తీయండి, బట్టల గురించి పట్టించుకునే నాదదే లేడు. ఆ మెండి చేతులతో చేతనయింది వండుకుని తిని లేదా పస్తులుంటూ దుర్భర జీవితాన్ని గడిపేవారు. ప్రతి రోజూ కనీసం పదిమంది రోగులు మరణిస్తుండేవారు. ఆ శవాలు అలాగే కుళ్ళిపోయి, దుర్గంధంతో వాతావరణాన్ని కలుషితం చేస్తూ, వ్యాధిని మరింత వ్యాప్తి పొందించేవి.

అటువంటి తరుణంలో, బెల్జియం వాస్తవ్యుడైన జోసెఫ్ డామియన్ అనే ఆరడుగుల ఆజానుబాహుడైన అందమైన యువకుడు "కుష్టురోగుల సేవకోసం నేను మేలకాయ్ దివికి వెళ్తాను" అని ప్రకటించడం యావత్ ప్రపంచాన్ని ఆశ్ఛర్యంతో కుదిపివేసింది.  ఆ దివికి వెళ్ళి వారితో కలిసి జీవనం చేసి, వారికి ఆత్మవిశ్వసం కలిగించాడు. ఆరోగ్య సూత్రాలను నేర్పాడు. భగవంతుడి పట్ల నమ్మకం, గురి కలిగించాడు.

అందరూ ఊహించినట్లే పన్నెండు సంవత్సరాల తరువాత అతనికి ఆ వ్యాధి సోకింది. ఆ రోజుల్లో మందులు లేని కారణంగా, అతను నాలుగు సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడి మరణించాడు. అతనికి వ్యాధి సోకిందని తెలియగానే బెల్జియం ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం - ఎంత ఖర్చయినా చికిత్స చేయిస్తమిని, ఆ దివి వదిలి వచ్చేయమని కోరాయి. అయితే డామియన్ దానికి అంగీకరించలేదు. "నా ఒక్కడికే కాదు. ఇక్కడున్న ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం కలిగించిప్పడు నేను ప్రాత్సహించండి" అని వినమ్రంగా విన్నపం చేసుకున్నాడు. అతని విన్నపాలు పరిశోధనలకు దారితీశాయి.

జోసెఫ్ డామియన్ 1840 జనవరి 3 న బెల్జియం దేశంలోని లోవైన్ అనే గ్రామంలో జనమించాడు. తండ్రి ప్రంకోయిన్ మధ్య తరగతి రైతు. డామియన్ కి చిన్నతనం నుంచి సేవాభావం మరి ఎక్కువే. ఒకసారి ఇంటికి బిచ్చగాడు వచ్చి మూడు రోజులనుంచి అన్నం తినలేదని ఏడుస్తూ చెప్పాడు. అది విని తల్లిడిల్లిపోయి, ఇంట్లో వండిన మొత్తం కూరను గిన్నెతో సహా అతనికి ఇచ్చేశాడు.

డామియన్ చదువుతో పాటు, కమ్మరిపాని, వడ్రంగిపని కూడా నేర్చుకున్నాడు. సరదాగా నేర్చుకున ఆ రెండు విద్యలు అతనికి భవిష్యత్తులో ఎంతో ఉపయెగపడ్డాయి. మేలకాయ్ దివిలో ఉన్నప్పుడు ఇళ్ళు కట్టడం, చర్చిలు నిర్మించడం శవపేటికలు తయారుచేయడానికి అవి దోహదపడ్డాయి.

చదువు అనంతరం డామియన్ మాతరమైన చదువు అభ్సించి, మాత బోధకుడిగా మారాడు. వారి మఠాధిపతి అతన్ని హవాయ్ దీవులలో బోధ చేయమని పంపాడు. ఆ దీవులలో కుష్టువ్యాధి తీవ్రంగా ఉండేది. ఆ వ్యాధికి ఆ రోజుల్లో మందు లేకపోవటంవల్ల, వారు మరి వికృతంగా తయారయ్యే, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవారు. వైద్యులు కూడా వారిని తాకేవారు కాదు. కుష్టువ్యాధి పూర్వజన్మలో చేసిన పాపలవల్ల కలుగుతుందనే మూఢనమ్మకం ప్రజల్లో తీవ్రంగా ఉండేది. ఎటువంటి మందులు కనిపెట్టడానికి సాహిసించలేదు. వ్యాధి సోకినా వారు మరణించేవరకు దుర్భర వేదన అనుభవించేవారు.

నేరాలూ, హత్యలు చేసిన వారిని నిజం చెప్పించడానికి కుష్ట్టురోగిని ఉపయెగించేవారు పోలీసులు. అతను నేరస్ధుణ్ణి కౌగిలించుకుని ముద్దులు పెట్టుకోబోతుంటే, అసహ్యంతో, భయపడి నిజం చెప్పువారు. కుష్టు రోగులు తిరిగే విధులలో మాములు వ్యక్తులు ఇళ్ళ కూడా ఖాళీ చేసేవారు. అటువంటి తరుణంలో ప్రభుత్వం కలగజేసుకుని వారిని మేలకాయ్ దివికి పంపించటం ప్రారంభించింది. రోగులందరిని అక్కడ ఉంచాలని 1873 వరకు 9,856 మందిని వరసగా పంపగా, వారిలో 8,735 మంది మరణించారు.

ఆ భయంకర పరిస్ధితి గురించి తెలుసుకున్న డామియన్ ఎవరు ఎంత చెప్పినా వినక ఆ దివికి వెళ్ళాడు.

అక్కడికి వెళ్ళిన తరువాత పరిష్టితి ఊహించిన దానికన్నా అద్వాన్నంగా ఉంది. ఏ ఒక్కరికి మానవకరం లేదు. అక్కడక్కడా శవాలు కుళ్ళిపడి ఉన్నాయి. వాటిని రాబందులు పీక్కు తింటున్నాయి. డామియన్ హృదయం ద్రవించిపోయంది. తనకు వ్యాధి వచ్చిన పరవాలేదు. వారి జీవితాలు క్రమబద్దం చేయాలనుకున్నాడు.

వారిని సమావేశపరచి అండగా ఉంటానని ప్రకటించాడు. మొదట్లో వారు నమ్మలేదు. కానీ రాను నమ్మకం కలిగి వారు అతనితో చేయి కలిపారు. డామియన్ ప్రప్రధమంగా శ్మశానానికి ఒక స్ధలం ఏర్పరచి అక్కడ శవాలను పాతిపెట్టి పని మెదలెట్టాడు. తరువాత గుడిసెల నిర్మాణం రహదారుల పరిశుభ్రత, చెట్లు నటించడం, చర్చిల నిర్మాణం, పరిశుభ్ర ఆహారం భుజించడం, పుండ్లను కడిగి రోజూ డ్రస్సింగ్ చేయటం వంటి పనులు నేర్పాడు. అచిరకాలంలోనే వారికి ఆత్మీయుడయ్యాడు. ఆత్మబంధువయ్యాడు. పండంటి తన జీవితాన్ని  పణంగా పెట్టి వారి శ్రేయస్సుకు పాటుపడ్డారు. వారి జీవితాలను క్రమాంబడ్డం చేశాడు. ప్రభుత్వంతో పోరాడి. వారి చికిత్సకై పరిశోధనలు చేయించాడు. చివరకు తనకు ఆ వ్యాధి సంక్రమించిన అతను చలించలేదు. అనుకున్నది మాత్రం సాధించాడు. 1889 ఏప్రిల్ పన్నెండున స్వర్గస్ధుడయ్యాడు.

బాలలూ! కుష్టు వ్యాధి భయంకరమైనది కాదు ఇప్పుడు దానికి కావలసినన్ని మందులున్నాయి. అసలు వ్యాధి రాకుండా నిరోధించే మందులు కూడా వచ్చాయి. కొంత మంది స్వచ్ఛంద సేవకులు, వైద్యశాఖ వారు పాఠశాలలకు కూడా వచ్చి పరీక్షలు చేస్తూ ఉంటారు. మీకుతెలిసిన వారెవరికైనా శరీరం పై మచ్చలు, లేదా స్వర్శ లోపించిన భాగం ఉన్నపుడు వారిని ఆ స్వచ్ఛంద సేవకులు చెప్పమని చెప్పండి. అది దాచుకోకుండా వారికీ తెలియజేస్తే ఆ వ్యాధిని అరికట్టవచ్చు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate