অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

దేవులపల్లి రామానుజరావు

దేవులపల్లి రామానుజరావు యావదాంధ్రులకూ సుపరిచితులు. వీరు పాత్రికేయులు. పత్రిక సంపాదకులు. అంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. జాతీయ పునరుజ్జివన మహేద్యమ కార్యకర్త. ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమీ ప్రధమ కార్యదర్శి. అంధ్ర సాహిత్య పరిషత్తు రథసారథి.

రామానుజరావు వరంగల్లు పట్టణానికి సమీపాన గల దేశాయి పేట గ్రామంలో 1917 వ సంవత్సరం ఆగష్టు ఇరవై అయిదున జనమించారు. తండ్రి వేంకట చలపతిరావు. తల్లి ఆండాళమ్మ. చిన్నతనంలోనే వంగపడుకు దత్తతగా వచ్చారు. ప్రాధమిక విద్యాభ్యాసం ఇంటివద్దనే పూర్తి చేసుకొని తొమ్మిదవ తరగతిలో మాత్రమే హనుమకొండ హై స్కూలులో చేరారు. కలిగిన ఇంటిలో పుట్టిన కారణంగా గారాబంగా పెరిగారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాంగాలో పాఠశాలకు వెళ్ళి వచ్చేవారు.

1929 - 49 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో పాఠశాలల సంఖ్య. కళాశాలల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. తెలుగులో విద్యాబోధన లేదు. ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో మాత్రమే పరాశలల్లో విద్యాబోధన ఉండేది. రామానుజరావు విద్యాభ్యాసం ఇంగ్లీషు లో జరిగింది. ఐచ్చికంగానైనా సంస్కృత భాష నేర్చుకోవాలని చిన్నతనం నుండి కోరిక. హనుమకొండ ఇంగ్లీషు మీడియం స్కూల్లో దూపాటి వేంకట రమణాచార్యలు సంస్కృతాన్ని బోధిస్తుండేవారు. సంస్కృతం బోధించే తరగతిలో చేరారు, రెండు మూడు పాఠాలు జరిగాయి. రామ శబ్దాన్ని కంటస్ధం చేయమని ఆచార్యుల ఆదేశం. వీరు కంటస్ధం చేయలేకపోయారు. ఆచార్యులు బెంచిపైన నిలబెట్టారు. వెంటనే రామానుజరావు గురువుగారికి నమస్కారం చెప్పి సంస్కృతం తరగతి నుండి గణితం తరగతి మారిపోయారు.

మదరాసు విశ్వవిద్యాయానికి అనుబంధంగా ఉన్న నిజం కళాశాల నుండి 1939 లో బి.ఎ. పట్టాపుచ్చుకున్నారు. 1942 - 44 మధ్య కాలంలో నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించారు.

పాత్రికేయుడుగా - పత్రిక సంపాదకుడుగా

1939 వ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాలపాటు పొలం పనులు చూసుకుంటూ ఇంట్లో కలశేమం చేశారు. ఆ సమయంలోనే గోలకొండ పత్రికకు కొన్ని వ్యాసాలు వ్రాసేవారు. మొదటి వ్యాసమే ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావుగారి ప్రశంసకు పాత్రమైంది. ఆనతి వారి ప్రోత్సాహంతో శ్రీరామానుజారావు గారు సాంస్కృతిక కార్యక్రమాలకు, సాహిత్య వ్యాసంగాన్ని తన కాలాన్ని పూర్తిగా వినియెగించారు.

తెలంగాణలో సాహిత్య పత్రికలు లేనిలోటు తీర్చాలని సంకల్పించారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగు పెద్దల ఆశీస్సులతో నల్లగొండ మిత్రుల తోడ్పాటుతో 1946 లో 'శోభ' అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. తానే ఆ పత్రికకు సంపాదకుడు. 1950 తరువాత ఆ పత్రిక నిలిచిపోయండి.

తెలంగాణలోని ఆంధ్రులు ఉద్యమాలకు 'తెలంగాణ' అనే దినపత్రిక ప్రతిబింబంగా ఉండేది. నవ్యసాహిత్యాన్ని గూర్చి యి పత్రికలో ప్రతివారం వీరు వ్యాసాలు వ్రాస్తుండేవారు. ఒకవారం వేయిపడగలు నవలపై వ్యాసం రాశారు. పత్రికలో వ్యాసాన్ని విశ్వనాధ సత్యనారాయణ చదివారు. తన నవలను అంత చక్కగా విశ్లేసించిన రామానుజారావును అభినందిస్తూ, లేఖ వ్రాశారు. ఆ తరువాత కొన్ని నెలలకు వరంగల్ లో ఒక గ్రంధాలయ వార్షికోత్సవ సభకు విశ్వనాథ వచ్చారు. ఆనాటి సభలో పట్టణంలోని ప్రముఖ న్యాయవాది ఒకరు విశ్వనాథకు స్వాగతం చెబుతూ వారి కవిత్వాన్ని ప్రస్తావించారు. ప్రస్తావనలో వారి కవిత్వం సరళం, సుబోధకమై ఉంటుందని సర్వసాధారణమైన పరిచయ వాక్యాలు పలికారు. ఈ పరిచయ వాక్యాలు విశ్వనాథకు కోపాన్ని తెప్పించాయి. తరువాత విశ్వనాథ ఉపన్యసించే సమయం వచ్చింది. వారు తన ఉపన్యాసంలో "నా కవిత్వము సభాద్యశాలనుకున్నంత సరళమైంది కాదు. వారు నాపుస్తకాలను చదివినట్లు కనిపించదు. నా రచనలు కొందరికి మాత్రమే అర్ధము కాగలవు. ఆ కొందరిలో మీ ఊరివారైనా దేవులపల్లి రామానుజారావుగారొకరు" అని తన ఉపన్యాసాన్ని పూర్తిచేశారు. రామానుజరావు రచన వ్యాసంగాన్ని ఈ సంఘాటాను పెద్ద ప్రోత్సాహమిచ్చింది.

ఆనాటి తెలంగాణ ప్రజల రాజకీయ, సామజిక, సాంస్కృతిక అవసరాల దృశైతా ఒక దినపత్రిక వెలువలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అంతకు ముందే ఉన్న రెండు దినపత్రికలలో ఒకటి 'మీజాన్' పత్రిక ప్రజకు, ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉండేది. రెండవదైన 'తెలంగాణ పత్రిక' రెండు సంవత్సరాలు నడచి ఆగిపోయంది. ఈ లోటును 'గోలకొండ పత్రిక' తీర్చింది.

ఆ రోజుల్లోనే ఉర్దూ పత్రిక నిజం రాజుకు అనుకూలంగా వార్తలు వ్రాసేవి. ఇండియన్ యూనియన్ లో రాజు చెరకుడదని వ్రాసేవి. దీనికి భిన్నంగా 'గోలకొండ ప్రతీక' ప్రజల పాషాణ నిలిచింది. ప్రజాభిప్రాయాలకు అనుకూలంగా వార్తలను, వ్యాష్యణాలను, సంపాదకీయాలు ప్రకటించింది. నిజం నవాబుకు వ్యతిరేకంగా పత్రికల్లో వ్రాసిన షోయబుల్లోఖాన్ ను రజాకార్లు హత్యచేశారు. ఇలాంటి దౌర్జన్య సంఘాటనలు జరిగినప్పటికీ గోలకొండ పత్రిక ఏమాత్రం చలించలేదు. ప్రాణాలకు తెగించి ఈ పరిస్ధుతుల్లో కూడా పత్రికను నడిపిన ఖ్యాతి రామానుజారావుకు దక్కింది.

1962 - 64 సంవత్సరాల మధ్యకాలంలో 'గురుజాడ శాతవార్షికోత్సవ సంచిక' తెలుగు, ఆంగ్ల భాషల్లో వెలువడింది. 1960 - 61 వ సంవత్సరంలో రవింద్రనాథ ఠాగూర్ శాతవార్షికోత్సవ సంచిక వెలువడింది. ఈ రెంటికి వీరే సంపాదకులు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ద్వితీయ ప్రపంచ మహాసభల ప్రత్యేక సంచికకు కూడా వేరే సంపాదకులు.

అంధ్ర సారస్వత పరిషత్తు

1937 వ సంవత్సరం నిజామాబాదులో జరిగిన అంధ్ర మహాసభలో భాషాసమస్య ప్రాధాన్యం వహించింది. తెలుగు భాషా ప్రచారానికి ఒక సాహిత్య సంస్ధ ఉండవేలేనన్న కోరిక ఆనాటి నుండి అందరిలోనూ బలపడింది. ఈ అభిప్రాయం కార్యరూపం దాల్చింది. 1943 వ సంవత్సరం మే నెలలో అంధ్ర సారస్వత పరిషత్తు స్ధాపన జరిగింది.

ఇది ఒక విశిష్టమైన సంస్ధ. ఏ ప్రత్యేక సాహిత్య సంప్రదాయానికి కట్టుబడదు. పాత కొత్తలకు స్వాగతమిచ్చి ప్రోత్సహించింది.

సారస్వత పరిషత్తు స్ధాపన సందర్భంలో వీరికి ఈ సంస్ధతో ఏర్పడిన సంబంధం క్రమక్రమంగా దృఢపడింది. 1944 లో కార్యవర్గ సభ్యుడిగా, 1949 లో ఉపాద్యషులుగా యి సంస్ధకు ఎన్నికయ్యారు. పరీక్ష నిర్వహణ కార్యదర్శిగా పరిషత్తు కార్యక్రమాల్లో నిమగ్నాలయ్యారు. చిన్న వయసులో ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన కొద్దిమందిలో విరొకరు. వీరు రాజకీయ, వైజ్ఙానికా, సంస్కృతికాది అనేక ఉద్యమాల్లో పనిచేశారు. ఏ ఉద్యమంలో పనిచేసిన వీరి జీవితంతో పూర్తిగా పెనవేసుకున్నది సారస్వత పరిషత్తు మాత్రమే. ఈ పరిషత్తును శంభోపాషాఖాలుగా విస్తరింపజేశారు. రాష్ట్రేతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉత్తమ గ్రంధాలను ప్రచురించారు. సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేశారు. అనేకులా దగ్గర విరాళాలు పోగుచేసి రాష్ట్ర రాజధాని నగరంలో సునివిశాలమైన, సుందరమైన వసతి భవనాలు సమకూర్చారు. మంచి గ్రంధాలయం ఏర్పాటు చేశారు. నిటన్నిటిలో వీరి కృషి చిరస్మరణీయమైనది. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన గూడు ఆ వృత్తిపై శ్రద్ధ చూపలేదు. వ్యవసాయాన్ని విస్మరించారు. సులభంగా సంపాదించగలిగిన ప్రభుత్వ ఉద్యోగాల జోలికి పోలేదు. సారస్వత పరిషత్తుతో ప్రారంభించి పూర్తిగా సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపాల్లో మునిగిపోయారు.

సారస్వత పరిషత్తు ఆరవ మహాసభలు అలంపూర్ లో 1953 లో జరిగాయి. అంతపెద్దసభలకు వీరు అధ్యక్షత వహించారు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు ప్రారంభించారు. 1952 - 54 మధ్య కాలంలో సారస్వత పరిషత్తుకు అధ్యక్షలుగా పనిచేశారు. 1954 నుండి వారు మరణించే వరకు ఈ పరిషత్తుకు ఉపాధ్యక్షలుగా ఉన్నారు. దీని ద్వారా కేవలం సాహిత్య వికాసాలకు మాత్రమే తన సేవలు పరిమితం చేయక సాంస్కృతిక పునరుజ్జివవానికి కూడా ఎంతో సేవ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి జరిగిన ప్రయత్నాలన్నింటిని వమ్ముచేశారు. తెలుగు భాషను నిర్భంద భాషగా ప్రవేశ పెట్టడంలోనూ వీరు కృషి మరవరానిది.

తెలుగులో విద్యాబోధన సమర్ధంగా చేయగల ఉపాధ్యాయుల కోరితే ఉండేది. విద్వాన్ పరీక్షలో ఉత్తిర్ణులైనవారే ఆ రోజుల్లో తెలుగు పండితులుగా పాఠశాలల్లో నియమింపబడేవారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు కూడా సిలబస్ తాయారు చేయించి తెలుగులో విశారద పరీక్షలు నిర్వహించింది. ఈ విశారద పరీక్షలో ఉత్తిర్ణులైన వారిని ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా నియమించ వచ్చునని ప్రభుత్వ ఉత్తరువులు తెచ్చుటలో వీరి కృషి శ్లాఘనీయమైనది.

1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వము అభిలా భారత స్ధాయిలో మూడు అకాడమీలను ఏర్పరిచింది. ఆ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా సాహిత్య, సంగీత నాటక, లలిత కళా అకాడమీలను పేరుతో మూడు అకాడమీలను నెలకొల్పంది. 1957 ఆగష్టు తొమ్మిదవ లేడి ఆంధ్ర సాహిత్య అకాడమీ ప్రారంభించబడింది. ప్రాంరంభకులు నటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు. ఆ అకాడమీకి అధ్యక్షలు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డిగారు. రామానుజారావుగారు కార్యదర్శి. నాటి నుండి 1979 వరకు అనగా స్వచ్ఛందంగా తానే ఆ పదవి వదిలేవరకు, అకాడమీ కార్యదర్శిగా పనిచేశారు. ఈ అకాడమీ సుమారు మూడు వందలకు పైగా గ్రంధాలు ప్రచురించింది. పుస్తక ప్రచారణలకు ఎందరికో అర్ధక సహాయమందించింది. ఈ మొత్తము కృషికి ప్రధాన సూత్రధారిగా వీరు ప్రశంసనీయులు.

రామానుజారావుకు సారస్వత పరిషత్తు ప్రధాన భాధ్యుడుగా, సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఎంతోమంది రచయితలతో ప్రత్యక్ష పరిచయముంది. ఈ పరోచయంతో వారి మనస్తత్వాలను చక్కగా మదింపు చేశారు. ఒకానొక సభలో రచయితలను గూర్చి యిలా చెప్పారు. రచయితల రచనలకు వారి నిజ జీవితాలకు పెద్ద వ్యత్యాసం ఉంది. తాము సామాన్య జనానికి అతిథులుగా భవిస్తూ సమాజంలో తమకొక ప్రత్యేక స్ధానాన్ని కోరుకుంటున్నారు. రచయిత తాను నిర్మించుకున్న పంజరం నుండి బయట పడాలి అని నిస్సంకోచంగా తన అభిప్రాయాలూ వెలిబుచ్చారు.

రచయితగా రామానుజరావు

నిజం కళాశాలలో వీరు విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుగుభాషపై అభిరుచిని పెంచుకున్నారు. రాయప్రోలు గారి కవిత్వం వీరికి ఇష్టం. ముద్దుకృష్ణ గారి సంపాదకత్వంలో వెలువడిన "వైతాళికులు" వీరిని బాగా ఆకర్షించింది. 1939 ప్రాంతంలో కవిత్వం ప్రారంభించారు. నాగపూర్ న్యాయకళాశాలలో దీనికి ప్రాణం పోశారు. ఈ ఖండికల్ 1953 లో "పచ్చతోరణం" కావ్యరూపంలో వచ్చాయి.

వీరి 'సారస్వత నవనీతం' ఉత్తమ సాహిత్య విమర్శకు నిదర్శనం. కేంద్ర సాహిత్య అకాడమీ కౌంనిలు సభ్యలుగా వీరి ఎన్నికకు కారణమైంది ఆ గ్రంధమే. వీరికి అమితమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది కూడా ఆ గ్రంధమే. "చదివింది న్యాయశాస్త్రం - సాహిత్య విమర్శలో ఇంత అపారమైన జనం ఎలా సాధ్యం?" అని ఎవరైనా ప్రశ్నిస్తే తనకు సాహిత్యం మీరు నవ్యసాహిత్యమంటే యిష్టమని చెప్పేవారు. వ్యాకరణ, అలంకార శాస్త్రాలు తాను పెద్దగా చదవలేదని సవినయంగా ఒప్పుకొనేవారు.

"మా ఊరు ఓరుగల్లు" అనే వ్యాసంలో శిధిలావస్ధలో ఉన్న వరంగల్లు గత చరిత్రను మనముందు సాక్షత్కరింపజేశారు. "కాదనరంగమే కాదు మా ఊరు కలశేత్రము కూడా. కాకతీయ రాజుల పోషణలో సంగీత సాహిత్యాది లలిత కళలు అద్వితీయంగా అభివృద్ధి చెందినవి. వరంగల్లు కోటాలో కట్టడాలు, వేయి స్తంభాల గుడి ఆనతి కలల గొప్పతనానికి శశిభూతంగా, సజీవ నాదర్శనాలుగా నిలిచి ఉన్నవి" అని ఈ వేయడంలో అంటారు.

పచ్చతోరణం, సారస్వత నవనీతం, ఉపన్యాస తోరణం, తెనుగు సాహితి; వేగు చుక్కులు మొదలుగా గల యిరవై కావ్యాలను వీరు వెలువరించారు. ఆంధ్రదేశంలోని అనేక మంది కవి పండితులకు ఆప్తుడయ్యారు. కృతి కర్తగానే గాక ప్రసిద్ధ కవుల కావ్యాలకు కృతిభర్తగా కూడా ఉన్నారు. చాలామంది కవులు నుండి అంకితం తీసుకున్నారు. దాశరధి గారి కవిత పుష్పకం, డా.సి నారే ఉదయం న హృదయం, డాక్టర్ జనానంద కవిగారి 'అష్రాగుచ్చం' వాటిలో కొన్ని.

గ్రంథాలయ ఉద్యమం

ఆ రోజుల్లో తెలంగాణ ప్రజలను మేల్కొలిపిన ఉద్యమాలు నాలుగు. ఆంధ్రోద్యమం, గ్రంధాలయేద్యమం, ఆర్యసమాజ ఉద్యమం, పత్రికారంగం. వీటిలో గ్రంధాలయేద్యమం ప్రజలను మేలుకొల్పి జాతియేద్యమం వైపు మరల్చిన గొప్ప ఉద్యమం. అందువలన ఈ ఉద్యమానికి నిజం ప్రభ్యుత్వం అనేక అడ్డంకులు కల్పించేది. గ్రంథాలయ సభం ఆద్యశాల, వక్తల ఉపన్యాసాలను ప్రభుత్వం ముందుగానే చదివి ఆ పైనే అనుమతినిచ్చేది. ఆర్యసమాజ ఉద్యమంతో తప్పమిగిలిన ఉద్యమాల్లో రామానుజరావు పథ విశిష్టమైంది.

యువకుడుగా రామానుజరావు వంరంగల్లు శబ్దము శాసన గ్రంథాలయానికి కార్యదర్శిగా ఉండేవారు. గ్రంధాలయ సంఘాధ్యక్షలు గ్రంధాలయ ఉద్యమ పితామహ గాడిచర్ల హరిసర్వోత్తమరావుతో పరిచయాన్ని పెంచుకొని వారిని తెలంగాణ ప్రాంతానికి ఆహ్వానించారు. 1944 వ సంవత్సరంలో శబ్దశాసన గ్రంథాలయ

రజతోత్సవ సభలు వరంగల్లులో జరిగాయి. ఈ సభలకు రాయప్రోలు సుబ్బారావు అధ్యక్షత వహించారు. హరిసర్వోత్తమరావు ప్రాంరంభించారు. ఈ సభలు యావదాంధ్ర సభలను గుర్తుకు తెచ్చే విధంగా రామానుజరావు గారు నిర్వహించారు. దీనితో వీరి శక్తి నిరూపితమైంది. కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది.

నైజం ప్రభుత్వ ప్రధానిగా సర్ మీర్జా యస్మాయేలు గారు పరిపాలిస్తున్న రోజులవి. మీర్జాగారికి విద్యావ్యాప్తి పైనా, గ్రంధాలయాలు అభివృద్ధిపైనా, ఆసక్తి ఎక్కవ. వీరు హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వున్నా ఎత్తయిన కోటగోడలు పడగొట్టించి చిన్నగొడలను పెట్టించారు. కార్యాలయాలను సులభంగా గుర్తిపట్టడానికి వీలుగా పసుపు రంగువేయించేవారు. ఒక పర్యాయం వీరు వరంగల్లు వస్తున్నారనే వార్త వచ్చింది. వారిని దర్షించాలనీ, తమ గ్రంధాలయ పరిస్ధితి వివరించాలని రామానుజారావుగారు అభిప్రాయ పడ్డారు. ప్రధానిని కలుసుకోవడానికి అనుమతి లభించదని తెలిసింది. గ్రంధాలయం వరంగల్లు కోరనుంది హనుమకొండకు వెళ్ళేదారిలో ఉంది. వెంటనే వీరికి ఒక ఆలోచన వచ్చింది. గ్రంథలయం గోడలకు పసుపు రంగు వేయించి నలుగురైదుగురు యవకులను వెంట బెట్టుకొని ప్రధాని వెళ్ళేదారిలో గ్రంథలయం ముందు నిలుచున్నారు. సర్ మీర్జా యస్మాయేలుగారు కారులో దూరం నుండి పసుపు రంగు భవనాన్ని, వీరిని గమనించారు. కారు అపి లోనికి వచ్చారు ప్రధాని. గ్రంధాలయ నిర్వహణకు సంతోషించి రిజిష్టరులో తన అభిప్రాయం వ్రాసి పెట్టి వెళ్ళారు. ఆ మరునాడు రూ. 116 /- చెక్కును జిల్లా కలెక్టరు గారి ద్వారా పంపి, గ్రంధాలయ భావన నిర్మాణానికి అవసరమై స్ధలం ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్త పంపారు.

నిర్వహించిన పదవులు

రామానుజారావుగారు సహిత రంగంలో గానీ, రాజకీయ రంగంలోగాని, విద్యారంగాలోగాని నిర్వహించిన పదవులు అనేకం. ఏ భాద్యత అప్పజెప్పిన చిత్తశుద్ధితో ఆ పదవికి న్యాయం చేసుర్చడం నీరి చిత్తశుద్ధికి, పట్టుదలకు తార్కాణం. ఏ పదవి తానుగా కోరుకోలేదు. తనకు అప్పజెప్పిన భాద్యత దేనిని వద్దనలేదు. ఇదే వారి గొప్పతనం.

ఆంధ్ర సారస్వత పరిషత్తులో 1944 నుండి 47 వరకు, కార్యవర్గ సభ్యడుగా 1965 నుండి 54 వరకు అధ్యక్షడుగా, 1954 నుండి 1981 వరకు ఉపాధ్యక్షడుగా ఉన్నారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా 1957 నుండి 79 వరకు ఉపాధ్యక్షడుగా 1979 నుండి 81 వరకు పనిచేశారు.

రాష్ట్ర కేంద్ర గ్రంధాలయ పుస్తక ఎన్నిక కమిటీ సభ్యడుగా 1965 నుండి 75 వరకు పదేళ్ళు పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్ మెంబరుగా సిండికేట్ మెంబరుగా ఉన్నారు. తాత్కాలిక ఉపాధ్యక్షలుగా మూడు పర్యాయాలు పనిచేశారు.

రాజకీయ రంగంలో రాష్ట్ర కేంగ్రెస్ కమిటీ సభ్యుడుగా యువజన కాంగ్రెస్ అధ్యక్షలుగా రాజ్యసభ మెంబరుగా రాణించారు. సామాన్యుడిగా కనిపిస్తూనే అసమాన కీర్తి శిఖరాలధిరోహించాడు. సాహిత్య పరిషత్తులో ఒక మూలగదిలో ఉంటూనే హైదరాబాదు నగరం మూలా మూలల్లో జరిగే ప్రతి సాహితి, సమ్దకృతిక కార్యకలాపాల్లో ముఖ్య వ్యక్తిగా దర్శనం ఇస్తుండేవారు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate