অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మోక్షగుండం విశ్వేశ్వరయ్య

హైదరాబాదు నగరం మధ్యలో మూసి నది ఉంది. ఇప్పుడు మసి నదిలో ప్రవాహం లేదు. ఉన్నదల్లా మురుగు నీరే. కానీ ఒకప్పుడు ఇది మంచి నీళ్ళతో ప్రవహిస్తూ ఉండేదట. 1908 వ సంవత్సరంలో అధికంగా వర్షాలు కురిశాయట. అందువల్ల ముసినదికి పెద్ద వరదలు వచ్చాయి. ఆ వరదలు హైదరాబాదులోని లోతట్టు ప్రాంతాల్ని జలమయం చేశాయి. ఎన్నో ఇళ్ళు కూలిపోయి, ఎంతమందో నిలువ నిదా లేకుండా అయిపోయారు. వరద ప్రవాహంలో చాలామంది తమ ప్రాణాలుకూడా పోగొట్టుకున్నారు. అంతకు ముందు కూడా మాసినదికి అప్పుడప్పుడు వరదలు వస్తుండేవి. దానివల్ల ప్రజలు కొంత ఇబ్బందిపడుతుండేవారు. కానీ 1908 లో వరదలు మాత్రం హైద్రాబాదు ప్రజలకు చాల నష్టం కలిగించాయి. ప్రజల భాధలు చూచిన నాటి నవాబు అమలుపరిచాడు. అందువలన మూసి నదికి వరదల ప్రమాదం తప్పింది. అలానే ఆ నది నీటిని మెల్లించి చెరువులు నిర్మించి, నగరానికి తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇలా హైదరాబాదుకే గాదు, మన దేశంలోని ఎన్నో నగరాలకు తాగునీటి వసతులు కల్పించిన ఆ మేధావి ఎవరో గాదు - మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

బాల్యం - విద్యాభ్యాసం

పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో మన దేశంలో గొప్ప మేధావులు జన్నించారు. రాజకీయ, సాంఘిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రకాశించారు. ఇంజనీరింగులో మహాప్రశస్తి గాంచిన మోక్షగుండం విష్వశ్వరయ్య అలాంటి వారిలో అగ్రగణ్యుడు. మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో కంభం, గిద్దలూరు రోడ్డులో మోక్షగుండం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉండే ఒక సామాన్య కుటుంబం కొన్ని ఏళ్ళకిందట కర్ణాటక  రాష్ట్రానికి వెల్లింది. బెంగుళూరు దగ్గరున్న 'ముద్దను హళ్ళి' అనే గ్రామంలో వాళ్ళు స్ధిరపడ్డారు. ఆ కుటుంబంలోనే మన విశ్వేశ్వరయ్య 1861 సం. సెప్టెంబరు 15 వ తేదీన జనమించాడు. అయన తండ్రి శీనివాస శాస్త్రి, తల్లి వెంకటమ్మ. శీనివాస శాస్త్రి సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు కూడా. విశ్వేశ్వరయ్య ప్రాధమిక విద్య ముద్దను హళ్ళిలో తల్లిదండ్రుల వద్దనే జరిగింది. తర్వాత మేనమామ రామయ్యవద్ద చిక్ బాలాపూర్ లో జరిగింది. విశ్వేశ్వరయ్య మంచి విద్యార్థిగా గురువుల ప్రేమానురాగాలు పొందాడు. అక్కడ నడుముని నాయుడు అనే ఉపాధ్యాయుడు విశ్వేశ్వరయ్యను గుర్తించి, బాగా ప్రోత్సహించాడు. మంచి మంచి పుస్తకాలు ఇచ్చి చదివించాడు.

ఉన్నత విద్య కోసం విశ్వేశ్వరయ్య బెంగుళూరు వెళ్ళాడు. అక్కడే బి.ఎ.డిగ్రీ మొదటి శ్రేణిలో పాసైనాడు. ఐతే చదివే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. ఖర్చులకు డబ్బులేదు. ఒక్కోసారి తినడానికి తిండి కూడా దొరికేదిగాడు. ట్యూషన్ లు చెప్పి కొద్దగా డబ్బు సంపాదించి, చదువు సాగించాడు. ఎంతో దూరం కాలినడకనే వెళ్ళేవాడు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అయన పట్టుదల, కృషి సడలలేదు. చదువులో అందరికంటే ముందే ఉండేవాడు. ఒక్కోసారి తోటి విద్యార్థులకు కూడా పాఠాలు చెప్పేవాడు. అప్పుడు సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపాలు చార్లెస్ వాటర్స్. ఆయనకు విశ్వేశ్వరయ్య అంటే ఎంతో అభిమానం. ఆ ప్రిన్సిపాలు తాను వాడుకొనే, 'వెబ్ స్టార్ డిక్షనరీ' విష్వఈశ్వరయ్యకు బహుమతిగా ఇచ్చాడు. వాటర్స్ లండన్ లో ఉంది కూడా ఈ శిష్యుణ్ణి మరువలేదు. అయన తన మరణానంతరం తన బంగారు కోటు గుండీలను విశేశ్వరయ్యకు ఇచ్చింది. విశ్వేశ్వరయ్య వాటిని చిరకాలం తన గురువులు గుర్తుగా ఉంచుకొన్నాడు. ఇలా గురుశిష్యుల సంభంధం ఎంతమందికి లభిస్తుంది?

1880 సం.లో బి.ఎ.లో విశ్వేశ్వరయ్య సర్వ ప్రథముడిగా వచ్చాడు. గణితంలో ప్రతిభ కలిగి ఉన్న విశ్వేశ్వరయ్యను మైసూరు రాజ్యపు దివాను రంగాచార్యులు గుర్తించాడు. ప్రభుత్వానికి సిపార్సుచేసి ప్రప్రధముడుగా నెగ్గాడు. అందుకు పరిష్కారంగా బొంబాయి ప్రభుత్వం ఆయనను 'ప్రజాపనుల' శాఖలో ఇంజనీరుగా నియమించింది. అమేయ ప్రతిభ ఉన్న చోటికి ఉద్యోగాలు వెతుకుంటూ వస్తాయి.

ఉద్యోగం - ప్రజాసేవ

బొంబాయి లో ఉద్యోగం చేసేప్పుడు స్వాతంత్య్రా సమరయెధులైన బాలగంగాధర తిలక్, గోపాలకృష్ట గోఖలే, మహాదేవ గోవిందరాసాడే మొదలగు వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఆయనకు పని అంటే ఇష్టం. అంకితభావంతో పనిచేసేవారు. 'వర్క్ ఈజ్ వర్ షిప్' అనే ఆంగ్ల సామెతను నమ్మేవారు. ఇంజనీరుగా అయన చేసిన ప్రజాసేవ, సాధించిన విజయాలు లెక్కలేనన్ని.

సింధు రాష్ట్రంలోని సుక్కురుకు మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల భాద్యతలు ఆయనపై మేపారు. అయన సింధునది నీళ్ళు సుక్కురుకు చేరేట్లు చేశాడు. ఆ నది నీళ్ళు వాడాకటడానికి ఒక నూతన విధానం రూపొందించాడు. నది మధ్యలో, లోత్తెన బావి త్రవ్వి ఆ నీరు భూమి లోపలి నుంచి ప్రవహించే ఏర్పాటుచేశాడు. అక్కడి నుండి సుక్కురుకు నీరు సరఫరా జరిగేది. ఇలా నీళ్ళు నది అడుగున భూమిలో నుండి రావడం వలన సహజంగానే వడపోత జరిగినట్లయంది. ఈ కృషిని గుర్తించిన బొంబాయి ప్రభుత్వము సుక్కూరు పురపాలక సంగుము ఆయనను అభినందించాయి. అయన ప్రజ్జాపాటవాలకు ఇదొక నిదర్శనం.

విశాఖపట్నం ఒడిరేవు సహజసిద్దమైనది. ఒదిలాన్ని రెండు కొండల మధ్య నుండే కలువలాంటి సముద్రపు పాయలో నుండి ఆలా తిరిగి కొండవెనుకకు వెళ్ళి దగినట్లుగా, భద్రంగా ఉండిపోతాయి. ఆ కాలువ ముఖంలో సముద్రపు ఆటుపోటు లెక్కువ. ఎత్తయిన అలలు తమతోపాటు ఇసుకను తెచ్చి కాలువను పూడుస్తూ ఉండేవి. ఆ విధంగా మెట్టవేసిన ఇసుకను తవ్వోడా (డ్రధారు) సహాయంతో ప్రతిరోజు తొలగించవలసి వచ్చేది. ఇది వ్యయప్రయాసలతో కూడుకొన్నపని. విశ్వేశ్వరయ్యను పిలిపించి చూపించారు. అయన సముద్రాన్ని, అలల వేగాన్ని బాగా పరిశీలించి, పాత పడవలను తెచ్చి అలలకడ్డంగా నిలిపి, వాటిని రాయి రప్పలతో నింపి, అలల దూకుడును అరికట్టాడు. అంతే, అలల మెసుకొచ్చే ఇసుక అక్కడే ఆగిపోయేది. కాలువలోకి వచ్చిపడేదిగాడు. ఈ విధంగా హార్బరులోకి వెళ్ళే ఓడలకు అంతరాయం తొలిగిపోయంది. వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. ఏనాటికి కోటల్లాగా ఉండే పడవలు విశ్వేశ్వరయ్య ప్రతిభకు, మేధకు, ప్రతీకలుగా ఉన్నాయి.

ఆనకట్టలు నిర్మించి నీటిని నిల్వచేస్తారు. అయితే నీరు అధికంగా చేరినప్పుడు ఆనకట్టకు ప్రమాదం ఏర్పడుతుంది. కనుక కావలసినంత నీటిని బైటికి వదలాలి. ఎలా? ఈ సమస్య చాలాకాలం వేధించింది. విశ్వేశ్వరయ్య మేధకు ఇది ఒక పరీక్ష. అయన రూపొందించిన ఆటోమేటిక్ గేట్లు ఈ సమస్యకు ఒక పరిష్కారం. ఇప్పటికి చాల గొప్ప, గొప్ప, అనకట్టలలో ఇలాంటి గేట్లు వాడుతున్నారంటే, అయన ఎంతో ముందుచూపుగలిగిన ఇంజనీరని స్పష్టం కదా!

1909 సంవత్సరంలో నైజామ్ నవాబు ఆహ్వానం మేరకు హైదరాబాదుకు వచ్చి మూసీనది పరివాహక ప్రదేశాన్ని శుణ్ణిగా పరిశీలించాడు. ఒక చక్కని నివేదిక తయారుచేశాడు. ముసినదిపైన ఒక ఆనకట్ట, రెండు చెరువుల నిర్మాణం సూచించాడు. హైదరాబాదు మురికినీటి పారుదలకు కూడా ఆయనే ప్రణాళిక తయారుచేశాడు. ఇప్పటికి అయన రూపొందించిన రెండు చెరువుల నీరు హైదరాబాదు నగరవాసులకు మంచినీళ్ళందిస్తున్నాయ. మూసి నదిపై ఉన్న ఆనకట్ట వ్యవసాయానికి ఉపయెగపడుతుంది.

విద్యారంగంలో కృషి

అందరికి విద్య అవసరం అని అయన చెప్పేవారు. వెనుకబడినతనం, సాంఘిక దురాచారాలు విద్య లేనందువలననే మనల్ని పీడిస్తున్నాయని తలచాడు. కొన్ని ప్రాంతాలలో నిర్బంధ విద్యను కూడా ప్రవేశపెట్టాడు. విద్య వ్యాప్తికి పాఠశాలల స్ధాపన, భావన నిర్మాణం, నిధుల మంజరి చేశారు. బాలికల విద్యకు ప్రత్యక పాఠశాలలు స్ధాపించారు. హాస్టళ్ళు ఏర్పరిచారు. ముఖ్యంగా మైసూరు రాష్ట్రానికే ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. విశ్వవిద్యాలయం అనేది జానందకరం తొలగించి, పారిశ్రామికవేత్తల్ని, వాణిజ్యవేత్తల్ని, న్యాయవాదుల్ని, విజ్జనశాస్త్ర వేత్తల్ని, రాజనీతిజ్జల్ని తయారుచెయ్యాలి అని అయన ఆశయం.

స్వతంత్రంగా బాలికేట్లు చేసే వృత్తి విద్య ప్రధానం అని గుర్తించాడు. అందుకే సాంకేతిక విద్యను ప్రోత్సహించారు. 1913 సంవత్సరంలో బెంగుళూరులో వృత్తిశిక్షణ సంస్ధను స్ధాపించి, దానికి మైసూరు మహారాజావారి పేరు పెట్టారు. అయన వ్యవసాయ విద్యకు కూడా తగిన స్ధానం ఇచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పరిశోధనలకు తోడ్పడ్డారు. రైతులకు స్వల్పకాల శిక్షణ తరగతులు ఏర్పరిచారు.

విద్య వ్యాప్తికి గ్రంధాలయాలు అవసరం. అందుకే అయన అనేక గ్రంధాలయాలు, పఠనాలయాలు ఏర్పరిచారు. పేదవారికి ఉపకారవేతనాలిచ్చి ప్రోత్సహించారు. బాల్యంలో ధనాభావంవల్ల ఎంత కష్టపడవలసి వచ్చిందో ఆయనకు ఎప్పుడు జ్ఙాపకంలో ఉంటున్న కారణంగానే, బీద విద్యార్థులకు ఎక్కువ మేలు జరిగేలా చూచేవాడు.

ప్రజాహిత కార్యక్రమాలు

అయన దివానుగా తనకున్న అధికారంతో అనేక సంఘా ప్రయెజనా కార్యక్రమాలు చేపట్టారు. సంఘా సంస్కారానికి కూడా నడుం బిగించారు. వర్ణవ్యవస్ధ రద్దుకు కృషిచేశారు. బాల్య వివాహాలు కూడదన్నారు. వరకట్నం వద్దని చెప్పారు. వివాహాలలో ఆడంబరం తగదన్నాడు.

'దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇది అందరి బాధ్యత' అని నొక్కి చెప్పారు. అయన పారిశుద్ధ్యానికి, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అయన ఎప్పుడు శుభ్రమైన వస్త్రాలనే ధరించేవారు. ఆఖరుకు ముసలితనం వచ్చి, మంచంలో లేవలేని స్ధితిలో ఉన్నప్పుడు కూడా అయన మంచి దుస్తులే ధరించారు.

మైసూరు రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు అయన కృషే కారణం. మైసూరు శాండల్ సబ్బుల తయారీ, గంధపుణుని కర్మాగారం, సిల్క్, వస్త్ర పరిశ్రమలు మొదలగు పలు పరిశ్రమలకు పునాది అయన ఆలోచనలే. ఇప్పటికి విశ్వేశ్వరయ్య పేరుమీద ఉన్న పారిశ్రామిక ప్రదర్శనశాల అయన ప్రతిభకు ప్రజల విశ్వసానికి ప్రతీక.

ఒకసారి అయన మిత్రులతో కలిసి 'జోగ్ జలపాతం' చూడ్డానికి వెళ్ళారు. అది అందమైన జలపాతం. ఎంతోమంది యాత్రికుల్ని ఆకర్షిస్తుంది. అక్కడి ప్రకృతి అందాలను ఛీఛీ తీరవలసిందే. విశ్వేశ్వరయ్య ఆ జలపాతపు అందానికి ముర్గుడైనాడు. ఐతే మరుక్షణమే ఆయనలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. "ఎంతో నీరు ఇలా వృధాగా పోతోంది? ఈ నీటి వనరుల్ని సరిగా వినియెగిస్తే? ఎంత విద్యచ్ఛక్తి ఉత్పత్తి చేయవచ్చు? ఆ విద్యచ్ఛక్తి ఎన్ని పరిశ్రమలకు పనికివస్తుంది? ఆ నీటిని వ్యవసాయానికి మళ్ళిస్తే ఎంత భూమి సస్యశ్యామలం అవుతుంది? -" అని సాగింది అయన ఆలోచన, అందరిలా అందాన్ని ఆస్వాదించడమేగాదు, వనరుల వినియెగాన్ని గురించి కూడా రచించాడు. మనకున్న వనరుల్ని సరిగా వాడుకొంటే మనం ఎంతో అభివృద్ధిని సాధించవచ్చు.

మీరు మైసూర్ లోవున్న బృందావన్ గార్డెన్స్ చూశారా? ఆ పేరు విన్నారా? ఇప్పటికి దేశీయ, విదేశీ పర్యాటకుల్ని ఆ గార్డెన్స్ ఆకర్షిస్తున్నాయి. అక్కడ ఎన్నో సినిమాల చిత్రీకరణ జరిగింది. రాత్రిపూట రంగు రంగుల బల్బులు కాంతిలో ఆ గార్డెన్స్ చూస్తుంటే స్వర్గం ఇలానే ఉంటుందా? అనిపిస్తుంది. అటువంటి అందమైన బృందావన్ గార్డెన్స్ ఎలా ఏర్పాటు అయ్యాయే తెలుసా?

కావేరినది కర్ణాటక రాష్ట్ర గుండా ప్రవహిస్తున్న ఒక పెద్ద నది. దానికి ఆనకట్ట కట్టి ఆ నీటి ద్వారా విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేయవచ్చు. పంటలు పుష్కలంగా పండించవచ్చు. అందువలన పరిశ్రమలు, పాడిపంటలు అభివృద్ధి అయి, ప్రజలు సుఖపడతారు. ఈ ఆలోచనతో విశ్వేశ్వరయ్య  ఒక చక్కని ప్రణాలికను రచించాడు. ఖర్చు ఎక్కువని కొంతమంది, కష్టమైనా పని అని కొంతమంది అభ్యంతర పెట్టారు. ఐనా పట్టుదలగల విశ్వేశ్వరయ్య ఆనాటి పరిసలకులకు నచ్చజెప్పి ఈ ప్రాజెక్ట్ పనిని చేపట్టాడు. ఎన్నో అడ్డంకులు వచ్చినా, దైర్యంగా ముందుకు సాగాడు. అనేక కష్ట నష్టాలకు ఓర్చి రాత్రియంబవళ్ళు కష్టించి 'కృష్ణ రాయ సాగరం' అనే ఆనకట్టను నిర్మించాడు. దాని నిర్మాణంలో అయన చూపిన నైపుణ్యం పశుకాత్య శాస్త్రజ్జల్ని సైతం ఆశ్యర్యపరిచింది. ఇప్పటికి గూడా కర్ణాటక రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి, పాతాళ దిగుబడికి ఈ ప్రాజెక్ట్ కారణం అనడంలో అతిశయెక్తి లేదు. ఆ ఆనకట్ట దిగువన మనం చెప్పుకొన్న బృందావన్ గార్డెన్స్ విశ్వేశ్వరయ్య రూపొందించాడు. ఆ రచన చమత్కారం అలాంటిది. ఇప్పటికి అవి అందర్నీ ఆకర్షిస్తున్నాయి. విశ్వేశ్వరయ్య ప్రతిభ పాటవాలను జప్తికి తెస్తున్నాయి. మనిషి కీర్తికి ఇవే గదా సజీవ సశ్యాలు!

ఫరక్కా బ్యారేజి నిర్మాణం

గంగానది మీద వంతెన నిర్మించాలని తలంపు వచ్చింది. ఐతే బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. ఎవరి కారణాలను వాళ్ళు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇరుకున బడింది. ఎవరికీ వంతెన ఇస్తే ఎవరికీ కోపం వస్తుందో ఎలా? అనే ఆలోచన వచ్చింది. నటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు సున్నితమైన ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ఒక సంఘాన్ని నియమించాడు. దానికి విశ్వేశ్వరయ్య అధ్యక్షడు. ఆ సంఘం సిఫార్సు మేరకు వంతెన నిర్మాణం జరుగుతుంది. అపుడు పండిట్ జవహర్ విష్వఈశ్వరయ్యను గురించి చెప్పిన మాటలు స్వర్ణాక్షరాల్లో రాయదగినవి. అయన నిజాయితీపరులు, శీలసంపన్నులు, విశాలజాతీయ దృక్పధంగలవారు. పైగా స్ధానికమైన బత్తిడులకు లొంగకుండా నిష్పక్షపాతంగా నిర్ణయంచేయగల ఇంజనీరు. అందువల్ల అయన అభిప్రాయాలను గౌరవంగా అంత ఆమెదించేవారు.

అయన నూరేళ్ళకు పైబడి జీవించాడు. ఆరోగ్యంగా ఉండేవాడు. అయన ఆరోగ్యానికి కారణం అడిగితే - 'మితభోజనం, క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహం' అన్నారు.

'కృషిచేస్తూ కృశించడం - తుప్పుపట్టి నశించడంకన్నా చాల మేలు' అనేవారు.

'శ్రమించి చేసే ఏ పని మనిషిని చంపదు - మనోవ్యధే మరణానికి కారణం' - అంటుండేవారు.

అయన భావాలకు అద్దంపట్టే అయన ముఖ్య రచనలు రెండు 1 . 'ప్లాస్డు ఎకానమీ అఫ్ ఇండియా', 2 . 'మెమెరీస్ అఫ్ మై వారికింగ్ లైఫ్'.

మంచి దేశాన్ని నిర్మించాలంటే ముందు మనం మంచి పౌరుల్ని తయారుచెయ్యాలి. సమర్థులు, శీలా సంపన్నులు, సేవాభావంగాల జనులు ముఖ్యం అని చెప్పేవారు. 'వ్యక్తి సాధించే విజయం వెనుక మంత్రదండం ఉండదు - కష్టపడి అంకితభావంతో పనిచేయడమే' అనేవారు.

ఒకసారి కొందరు పత్రికా విలేఖరులు ఇష్టాగోష్టోగా మాట్లాడుతూ మనదేశపు పేదరికానికి కారణాలు ఆయన్ను అడిగారట. దానికి అయన - "స్తబ్దత, మందకొడితనం, ఆశావాదం మన దౌర్భాగ్యానికి కారణాలు. పరిస్ధితుల్ని మనం గమ్యంవైపు మల్లించుకోవాలి. ప్రయత్నంలో లోపం ఉండకూడదు. దీనికి నైతిక శక్తి కావాలి. మతాచారం మీద, వర్ణతత్వం మీద, అదృష్టం మీద ఆధారపడడం తగదు. ఆర్థికశక్తికోసం, స్వశక్తికోసం కృషిచేయాలి. అంత కష్టపడి పనిచేయాలి" అని చెప్పారట.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య బహుముఖ ప్రజ్ఙాశాలి. వారి వ్యక్తిత్వాన్ని హిమాలయంతో పోల్చవచ్చు. దాన్ని పరిశీలించడం, వర్ణించడం చాల కష్టం. ఆయనకు ప్రవేశంలేని రంగం ;లేదనడం అథాశయెక్తిగాదు. అయన ఎప్పుడు భారతదేశాన్ని గురించే కలలుగానేవారు. దేశభక్తిగల అటువంతి మేధావి, నిరాడంబరుడు, ప్రజా సంశిమ కారకుడు అయిన ఇంజనీరు పుట్టిన రోజును మనం 'ఇంజనీర్సు డే' గ చేసికోవడం సమంజసంగానే ఉంటుంది.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate