অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రుద్రమదేవి

రుద్రమదేవి

ఊయలను ఉపేచే ఉర్విని కూడా పాలించగలదు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్సించిన సందర్భాలు మన చరిత్రలో కోకొల్లలు. కత్తిబట్టి కదన రంగంలో దూకిన స్త్రీలు, కలం పట్టి కవిత్వం చెప్పినవారు, రాళ్ళూ సైతం కరిగేట్లు మధురంగా పడగలిగేవారు మన సమాజంలో దర్శనమిస్తారు. మన చరిత్రలో వీరనారులు ఎందరో ఉన్నారు. వారిలో తలమానికం రుద్రమదేవి.

రుద్రమ, కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన గతిపతిదేవ చక్రవర్తి కుమార్తె. చిన్ననాటి నుండి చనువుగా తండ్రి చెంత కూర్చొని రాజ్యపాలనను నిశితంగా పరిశీలిస్తూ ఉండేది. తండ్రి ఆమెను కొడుకువలె పెంచాడు. యుద్ధ విద్యల్లో శిక్షణ ఇప్పించాడు. ఆమె అన్ని విద్యల్లోను ఆరితేరింది.

గణపతిదేవుని మరణం తర్వాత రుద్రమ రాజ్యాన్ని చేపట్టింది. స్త్రీయని భావించిన సామంతులు తిరుగుబాటు చేశారు. విశ్వసపాత్రులైన సేవాపతుల సాయంతో ఆమె తిరుగుబాటుదారులు అందర్నీ ఓడించింది. తెలుగునేలను ఏకంచేసి కాకతీయ సామ్రాజ్యాన్ని సుస్ధిరం చేసింది.

రాజ్యంలో అలజడులు తగ్గిన తర్వాత ప్రజాశ్రేయస్సు వైపు దృష్టి మరల్చింది. ప్రజలకు రాజులయెడ గౌరవం కలిగించేటట్లు పరిపాలన చేయడానికి నడుంకట్టింది. ప్రజల్లో జాతీయభావాన్ని, సమైక్యతను దేశాభిమానాన్ని పెంపొందిచాల్సిన అవసరాన్ని గుర్తించింది. పల్లెల్లో నివసించే రైతులే దేశానికి అన్నదాతలని నమ్మింది. వారు షెమంగా ఉంటే రాజ్యంలో కరువుకాటకాలుండవని వ్యవసాయం కోసం నీటివనరులు అభివృద్ధి పరిచింది. అన్నసత్రాలు, వైద్యశాలలు స్ధాపించింది.

కన్న తల్లివలె, కనురెప్పలవలె, రాశించే రుద్రమదేవి పాలనలో, ప్రజలు ఈతిబాధలు ఎరుగరు. వారికీ భయాలు బాధలు లేకుండా చేసిన ప్రజాసేవాభిమాని రుద్రమ. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న ఆదర్శ సామ్రాజ్జి రుద్రమ.

ఆమె కాలంలో మార్కోపోలో అనే వెనిస్ వర్తకుడు మన దేశానికి వచ్చాడు. అతడు 'రుద్రమదేవి పాలనా శాంతికి, దయకు, న్యాయానికి, ధర్మానికి నిలయంగా ఉండేదని, ప్రజలకు రుద్రమ అంటే అమితమైన భక్తి' అని రాశాడు. ప్రజానురంజనమే పరమావధిగా, ప్రజారక్షణయే ఆదర్శంగా, ప్రజల సౌకర్యమే పరమధర్మంగా పవిత్రీపాలన సాగించిన రుద్రమ పరిపాలకులు ఆదర్శప్రాయురాలు. ప్రజలకు నిత్యస్మరణీయురాలు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate