హోమ్ / విద్య / సమాచార సాంకేతిక (ఐటి) విద్య / కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు తరుచు గా వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు
పంచుకోండి

కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు తరుచు గా వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు

కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్స్ వాడకం కంప్యూటర్స్ తో పాటు నేరాల జాబిత కూడా అదే విధంగా పెరుగుతున్నవి. 60 నుండి 80 శాతం వరకు సమాచారం ఇప్పుడు కమ్యూటర్ లోనె భద్ర పరుస్తున్నరు.

కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు తరుచు గా వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు

కంప్యూటర్ ఫోరెన్సిక్స్

భారత రాష్ట్రపతి కి ఈ మెయిల్ ద్వారా బెదిరింపు, కేరళ లోని ఇంటెర్నెట్ సెంటర్ నుండి మెయిల్ పంపించినట్టు గుర్తింపు.

ఖఫీల్ అహ్మద్ ఇంటి నుండి హర్డ్ డిస్క్ స్వాధీనం, విలువైన సమాచారం కోసం రీసోర్స్ సెంటర్ ఫర్ సైబర్ ఫోరెన్సిక్, సి-డేక్(C-DAC) తిరువనంతపురం ప్రయత్నం .

కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్స్ వాడకం కంప్యూటర్స్ తో పాటు నేరాల జాబిత కూడా అదే విధంగా పెరుగుతున్నవి. 60 నుండి 80 శాతం వరకు సమాచారం ఇప్పుడు కమ్యూటర్ లోనె భద్ర పరుస్తున్నరు. సమాచారం దొంగిలించడానికైతేనేమి లేదా పాడు చెయ్యడానికైతేనేమి, వ్యక్తులను లేదా సంస్థలను బెదిరించడానికైతేనేమి కంప్యూటర్స్ నేరాల పరిధి పెరుగుతున్నవి. అలాంటి సమయం లో కంప్యుటర్ ఫోరెన్సిక్స్ అనునది ఇప్పుడు చాలా ముఖ్యం గా ప్రాముఖ్యత వహిస్తుంది

కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అనునది కంప్యుటర్ లో దాచిపెట్టిన సమాచారాన్ని లేదా దాని ద్వారా వెళ్ళిన సమాచారాన్ని తీసుకొని శాస్త్రీయ పద్దతి లో ఎనలైజ్(విచారణ) చేసి ఎవిడెన్స్(సాక్ష్యం) సాధించి న్యాయ స్థానం లో సమర్పించడం.

కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ఈ-మెయిల్స్, షార్ట్ మరియు ఇన్స్టెంట్ మెసేజ్స్ తో పాటు అన్ని రకల కమ్యూనికేషన్స్ ని ట్రాక్ చెస్తుంది. అంతే కాకుండా లేటెస్ట్ ఫోరెన్సిక్స్ సాఫ్ట్ వేర్స్ లైవ్ కమ్యూనికేషన్స్ ని కూడా ట్రాక్ చెయ్యగలదు. ప్రపంచం అంతా బిలియన్స్ ఆఫ్ లైవ్ కమ్యూనికేషన్స్ ట్రాక్ చెయ్యడం సామాన్యమేమి కాదు.

కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ఈ క్రింద వివిద భాగాలలో అధ్యయనం చేస్తూ ఉంటారు

విండోస్, లినక్స్, మేక్ X మరియు వివిధ ఆపరేటింగ్ సిస్టెం లు,రౌటెర్, స్విచెస్ లాంటి కమ్మ్యూనికేషన్స్ డివైసెస్ తో పాటు, మొబైల్ మరియు PDA ఫోరెన్సిక్స్ ఈ-మెయిల్ ఫోరెన్సిక్స్, కంప్యూటర్ లో హార్డ్ డిస్క్, మెమొరీ తో వివిద విడి భాగాలు ఎనలైజ్ చేస్తారు.
కంప్యూటర్ లో డేటా అనునది రెండు రకాలు మొదటది వోలటైల్ డేటా(ఇది ముఖ్యం గా లైవ్ డేటా. మెమొరీ లో వున్న డేటా, ఓపెన్ లో వున్న కనెక్షన్స్, పోర్ట్స్, సర్వీసెస్, ప్రోసెస్, నెట్ కనెక్షెన్స్ మరియి ఇతర సమాచారం ని తెలియ చేస్తుంది. ఈ వోలటైల్ డేటా అనేది కంప్యూటర్ ని షట్ డౌన్ చేస్తె (మూసివేస్తె), డేటా అంతా చెరిగి పోతుంది కాబట్టి ఫోరెన్సిక్స్ ఇంజినీర్స్ చాల జాగ్రత్త గా, వేగం తోడేటా ని కలెక్ట్ చెయ్యవలసి వస్తుంది.

ఇకపోతె రెండవది నాన్ వోలటైల్ డేటా లేదా పెర్సిస్టెంట్ డేటా(ఈ డేటా డిస్క్ లొ భద్రపరచిన డేటా, నాన్ వోలటైల్ మెమొరీ, U S B లో వున్న డేటా). ఇటువంటి డేటా, డిస్క్స్ లోనే భద్రపరచివుండడం వలన మొదటి దశ లో అంత వేగం అవసరం లేదు. కాని డేటా డిస్క్స్ ని కూడా ఎంత తొందరగా ఎనాలిసెస్ కోసం తీసుకొంటె అంతే వేగం తో ఎవిడెన్స్(సాక్ష్యం)ని సంపాదించే అవకాశం వుంటుంది.

ఇకపోతే కంప్యూటర్స్ ని సీజ్ చెయ్యడం, ఆ దేశం లో వున్నచట్టాల అనుగుణం గా జరుగుతుంటాయి. ఐతే కంప్యూటర్స్ కమ్యూనికేషన్స్ అనేది ఒక దేశ పరిమితి కి సంభందించినది కాదు కాబట్టి ఆ ఆ దేశాల మద్య వున్న ఒడంబడికల బట్టి జరుగుతుంటాయి.

ఒకసారి సీజ్ చేసిన కంప్యూటర్స్ లేదా పార్ట్స్, లాప్ టాప్స్, ఫోరెన్సిక్ విభాగానికి రాగానే వాటిని యధావిధిగా ఫొటో ఇమేజ్స్ గా తీసుకొంటారు. ఖఫీల్ అహ్మద్ కేసు నే తీసుకొంటే, హార్డ్ డిస్క్ ని ఫొటో ఇమేజ్ తీసుకొన్న తరువాత రెండు లేదా అంత కన్నా ఎక్కువ కాపీలు డూప్లికేట్ చేసి, ఒరిజినల్ కాపీ పాడవ కుందా భద్రపరుస్తారు.

డేటా ని సంగ్రహించడం

డేటా ని సంగ్రహించడం (acquition) అనేది ఇన్వెస్టిగేటర్స్, డిజిటల్ ఎవిడెన్స్ ని ఈ క్రింద విధాలు గా ఎక్వైర్ (acquire) చేస్తారు.

 1. బిట్ స్త్రీమెస్ ( 0 , 1 లు డిజిటల్ డేటా )ని ఇమేజ్ ఫైల్ (Image file)గా మార్చడం.
 2. బిట్ స్త్రీమెస్ ( 0 , 1 లు డిజిటల్ డేటా)ని డిస్క్ నుండి డిస్క్ (Disk to Disk) కాపీ చెయ్యడం.
 3. స్పార్స్ (sparse) డేటా ని ఫోల్డెర్(folder) గా లేదా ఫైల్ గా మార్చడం.( స్పార్స్ డేటా అనేది డిస్క్ లో వున్న డేటా కాకుండా వున్న తాత్కాలిక లేదా Cache డేటా వంటిది )

డేటా కంటిజెన్సీ (contingency) కోసం ఇమేజ్స్ లేదా డిస్క్స్ ని రెండు లేదా మూడు టూల్స్ వాడి తీసుకొంటారు. టూల్స్ విషయానికి వస్తే విడి విడిగా ప్రత్యేకం గా DriveSpy, DD టూల్స్ ఉన్నాయి.
Access Data FTK, EnCase, C-DAC Cybercheck packages తో పాటు కూడా Data acquit ion
టూల్స్ వస్తాయి.

డేటా సమాచారం సేకరించిన తర్వాత

డేటా సమాచారం సేకరించిన తర్వాత, ఫోరెన్సిక్ ఇంజనీర్స్ డిస్క్ లో కావలని చెరపివేసిన డేటా కోసం వెదుకుతారు. వీటి కోసం కూడా కొన్ని ప్రత్యెకమైన టూల్స్ ఉంటాయి.

Search and recover, zero assumption, e2undel, BadcopyPro, File Scavanger, MyCroft 3, Drive and Data Recovery, Uneraser, Acronis , PC Inspector tools.
సాధారణంగా మనలో కొందరు డేటా ని డిస్క్ నుండి చెరపివేస్తె(డిలీట్ ఛేస్తె)రికవర్ చెయ్య లేమనుకొంటాం, కాని డిస్క్ ని ఫార్మాట్ చేసిన కూడా, పైన వున్న కొన్ని టూల్స్ తో మనం ఆ డేటా ని కూడ రికవర్ చెయ్యొచ్చు.

ఇమేజ్ ఫైల్ ఫోరెన్సిక్స్ లో సాధారణం గా వివిద ఫార్మాట్స్(.jpg, .tiff, .htm, .txt etc) లో వున్న ఇమేజ్స్ మరియు వీడియో, ఆడియో ఫార్మాట్స్ ని ఎనలైజ్ చేస్తారు. ఈ విభాగం లో ఫిక్సెల్స్, బిట్ ఇమేజ్స్(గ్రాఫిక్ ఇమేగె), వెక్టార్ ఇమేజ్(మేథమేటిక్స్ కి అనుగుణానికి సంభందించిన ఇమేజ్) లను ఎవిడెన్స్ కూసం చూస్తారు. ఇందులో Ifranview, ACDsee, Thumbsplus టూల్స్ వాడుతారు.
ఇందులో భాగంగానే వివిధ ఫైల్స్ లో గాని, ఇమేజ్స్ లో గాని సమాచారాన్ని దాచివుంచడాన్ని స్టెగనోగ్రఫి ( Steganography ) అని అంటారు. ఈ విధంగా ఒక ఫైల్ లో మరొక ఫైల్ లేదా ఇమేజ్స్ ని పెట్టడానికి ఎట్లా టూల్స్ వుంటాయో, వీటిని ఎనలైజ్ చెయ్యడానికి, ఎవిడెన్స్ కోసం ఈ క్రింద టూల్స్ వాడుతారు.
MP3stego, snow.exe, camera/spy, ImageHide, StegHide, S-tools, Blindside, FortKnox etc

అడిట్ లాగ్స్ అనేది కంప్యూటర్ ఫోరెన్సిక్స్ లో మరో ముఖ్యమైన భాగం. కమ్మ్యూనికేషన్స్ కంప్యూటర్ నుండి నెట్ వర్క్ ద్వారా వెళ్ళతాయి, ఆ సమాచారం లాగ్ ఫైల్స్ లోనె వుంటుంది. అంతే కాకుండా స్కిల్లెడ్ అట్టాకెర్ ఎప్పుడూ వివిద లాగ్స్ అంటె అప్లికెషన్ లాగ్స్, సిస్టెం లాగ్స్, నెట్ వర్క్ లాగ్స్ ని చూసి ఒక అంచనా ప్రకారం అట్టాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ లాగ్ ఫైల్స్ ని ఎనలైజ్ చెయ్యడం ఫోరెన్సిక్ లొ ఒక ముఖ్య భాగం.
windows, linux and other system logs తో , EventReporter, EvenTComBMT, FWanalog, Eventreporter, NTsyslog etc టూల్స్ వాడుతారు. ఈ లాగ్స్ తో పాటు వెబ్ సెర్వర్, ఫైర్ వాల్, మరియు ఇతర సెర్వర్లు, నెట్ వర్క్ యొక్క లాగ్స్ కూడా ఎనలైజ్ చేస్తారు.

సిస్టెం మరియు సిస్టెం యొక్క సంభందించిన ప్రోసెస్, సెర్విసెస్, కమ్మ్యూనికెషన్స్ మరియు పార్ట్స్ టూల్స్ తో పాటు ఆ సిస్టెం కనెక్ట్ అయినా నెట్ వర్క్ ని ఎనలైజ్ చెయ్యడం కూడా ముఖ్యం కాబట్టి నెట్ వర్క్ లో భాగాలు అయిన రౌటర్, స్విచ్ ఫైర్ వాల్ మరియు ఇంటెర్నెట్ సర్వీస్ ప్రొవైడెర్ నుండి కూడా వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తారు.

నెట్ వర్క్ లేయర్ల సమూహం కాబట్టి ఆ లేయర్ల మరియు వాటి ప్రోటోకాల్స్ గూర్చి వివిధ భిన్నాలలో సాక్ష్యం (ఎవిడెన్స్) సంపాదించడానికి చూస్తారు.
McAfee Infinistream, NetWitness, NokiaLIG టూల్స్ తో పాటు Router, Switch , etc basic commands కూడా వాడుతారు.

వెబ్ మరియు ఈ-మెయిల్ కమ్మ్యూనికేషన్స్.

వెబ్ మరియు ఈ-మెయిల్ కమ్మ్యూనికేషన్స్ ని కూడా అనలైజ్ చెయ్యడం ఎవిడెన్స్(సాక్ష్యం)ని ఈ ఫోరెన్సిక్స్ లో భాగమే.

 • SQL injection
 • Buffer overflow
 • Denial of Service
 • Directory traversal/forceful browsing
 • Command injection
 • Cookie/session poisoning
 • Web services attacks
 • Authentication hijacking

Cross-site scripting లాంటి ఎట్టాక్స్ ని గుర్తు పట్టడానికి, దానికి తదనుగుణంగా ఎవిడెన్స్(సాక్ష్యం)ని సంపాదించడానికి కంప్యూటర్ ఫోరెనిస్క్స్ ఎంతో కృషి చేస్తుంది
Nslookup, Tracert, NeoTrace, whois, EventReporter, EvenTComBMT, FWanalog వంటి టూల్స్ వీటికి తోడ్పడుతున్నాయి
ఇక ఈ-మెయిల్ విషయానికి వస్తే, ఈ-మెయిల్ అనేది సర్వ సాదారణ మైన కమ్మ్యూనికేషన్ గా తయారు అవ్వడం వలన చాలా ఎక్కువ గా ఎట్టాక్స్ ఈ-మెయిల్ మీదా కూడా వుంటాయి. అంతే కాకుండా ఈ-మెయిల్ ని వుపయోగించుకొని వ్యక్తులను బెదిరించడం లేదా లోబర్చుకోవడము , చిన్న పిల్లలని సెక్స్ కి ప్రేరెపించడం మరియు ఇతర టెర్రరిస్ట్ వంటి నేరాలకు ఉపయోగించడం జరుగుతున్నవి. ఐయితే ఇటువంటి కార్యకలాపాలను సరైన సమయం లో డేటాని ఎనలైజ్ చేస్తే అటువంటి నేరాలను నిర్ధారించొచ్చు. అంతే కాకుండా కొన్ని నేరాలను ముందుగానె పసిగొట్టొచ్చు
EnCase, FTK , FINALeMAIL , Sawmill-GroupWise, Audimation for Logging etc టూల్స్ వాడుతారు.
ఈ విధముగానే మొబైల్, PDA forensics మరియు కాపీరైట్ ఇస్స్యూస్ కోసం కూడా టూల్స్ ఉంటాయి.
డేటాని ఎనలైజ్ చెయ్యడం ఒక ఎత్తు అయితే దానిని న్యాయస్థానం లో ప్రజెంట్ చెయ్యడం, దానికి తగ్గ డాక్యుమెంటేషన్ తయారు చేసి న్యాయాధికారులకు అది సరి ఐనా ఎవిడెన్స్ అని ప్రూవ్ చెయ్యడం మరొక ఎత్తు. ఈ విధంగా టెక్నికల్ ఎనలైజ్ చేసి న్యాయస్థానం లో సాక్ష్యం గా వెళ్ళేవారిని ఎక్స్పెర్ట్ విట్నెస్స్ (Expert Witness) అని లేదా టెక్నికల్ టెస్టిమొని (technical Testimony) అని అంటారు.
మీరు చూసారుగా, ఇలా ఒకొక్క భాగానికి చాలా టూల్స్ వున్నాయి కదా. కంప్యూటర్ ఫోరెన్సిక్స్ లో ఈ భాగాలు సుమారుగా 15 పైనే వున్నాయి. ఇలా ఒకొక్క భాగానికి కొన్ని టూల్స్, వేర్వేరు కంపెనీల నుండి వాడడానికి బదులు ఈ మద్య కొన్ని కంపెనీలు పైన చెప్పిన వేర్వేరు ఫోరెన్సిక్స్ టూల్స్ సమూహంతో పేకేజ్ రూపంలో విడుదల చేస్తున్నాయి. అందులో భాగం గా మన దేశం లో C-DAC, తిరువనంతపురం విండోస్ లోను, లినక్స్ లోన్ ఈ టూల్స్ అభివృద్ది చేస్తున్నాయి. ఇప్పటికే Cyber Check Suite సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి ఖఫీల్ అహ్మద్ ఇంటి నుండి హర్డ్ డిస్క్ స్వాధీనం case డీల్ చేస్తుంది.
ఈ పేకేజ్ లో, True Back-డిస్క్ ఇమేజింగ్ టూల్, ఈ-మెయిల్ ట్రేసర్, డిస్క్ రికవరి,ఎనాలిసెస్ టూల్స్ సమూహం తో వస్తుంది.
ఈ టూల్స్ తో డేటాని ఫై ఎక్వైర్ చెయ్యడమే కాకుండా, ఇమేజ్ లేదా డిస్క్ ఫైల్ గా మార్చిన తర్వాత డిలీటెడ్ ఫైల్స్ ని రికవర్ చేస్తుంది. అంతే కాకుండా సమగ్రంగా విచారణ చేసి డాక్యూమెంటేషన్ రూపం లో అవుట్ పుట్ ఇస్తుంది.
పూర్తి వివరాలకి ఈ వెబ్ సైట్ ని సంప్రదించండి :http://www.cdactvm.in
ఐతే ఈ ట్రైనింగ్ లకి, కొంత అనుభవం కావాలి.
ఫ్రెషెర్స్ ఐన పట్టభద్రుల కోసం C-DAC, హైదరాబాద్ 5 నెలల సర్టిఫికేట్ కోర్స్ ఇన్ సిస్టెంస్ అండ్ నెట్ వర్క్ సెక్యూరిటి (Certificate course in Systems and Network Security ,CNSS) కోర్స్ లో భాగం గా ఈ కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేటింగ్ టూల్స్ మిగతా సెక్యూరిటి టూల్స్ తో పాటు JNT University తో కలసి ట్రైనింగ్ ఇస్తున్నారు. మిగతా వివరాలు కోసం C-DAC, Old Library Campus, JNTU, హైదరాబాద్ ని సంప్రదించండి.

VLC player 2 విండో లలో ఓపెన్ అవుతుంది.

నేను VLC ప్లేయర్ లో కొన్ని వీడియో ఫైల్ ప్లే చేసినప్పుడు, అవుట్ పుట్ 2 విండోస్ లో ఓపెన్ అవుతుంది. రెండవ విండో "హార్డువేర్ YUV DirectX అవుట్ పుట్" అని వస్తుంది. పరిష్కారం ఏమిటి?

మీరు ఏ వెర్షన్ వాడుతున్నారో చెప్ప లేదు. ఈ సమస్య ఇమేజ్ క్లోనింగ్ లేదా Extended GUI సరిగా లేకపోవడం వలన మరియు ఎక్కువగా 0.8.5 వెర్షన్స్ లో వస్తుంది.
0.8.6c వెర్షన్ ముందు వెర్షన్స్ వాడుతున్నట్టు ఐతే, 0.8.6c లేదా తర్వాత వెర్షన్స్ నిhttp://www.videolan.org/vlc/ నుండి డౌన్ లోడ్ చేసుకొంటె మీ సమస్యకు పరిష్కారం అవుతుంది

డంప్ అఫ్ ఫిజికల్ మెమరీ

నేను ఒక నీలం స్క్రీన్ తో సందేశం- ఫిజికల్ మెమరీ యొక్క డంప్ మరియు కొన్ని బొమ్మలు : STOP:0X000000F4 (0X00000003, 0X865F1DAO, 0X865F1F14, 0X805FA7A8) చూస్తున్నాను. పరిష్కారం ఏమిటి?
ఈ సమస్య అనేది ఈ క్రింద ఫోల్డెర్ లో ఉన్న dump మీద ఆధారపడుతుంది C:\WINDOWS\Minidump\Mini070705-03.dmp.
ఈ ఫైల్ ని చూస్తే సరిగ్గా సమస్య ఎక్కడ ఉన్నదో చెప్పవచ్చు. ఇది సామాన్యంగా
1) ఆపరేటింగ్ సిస్టెం డ్రైవ్ ఫుల్ అవ్వడం వలన గాని,
2) అప్ప్లికేషన్స్ వలనగాని అప్ప్లికేషన్స్కిసరిఐనCacheమెమొరిలేకపోవడమవలనగాని
3) ఫిజికల్ మెమొరి, మథర్ బోర్డ్ లో లోపాల వలన గాని రావొచ్చు. అంతే కాకుండా బ్యాటరి మరియు ఇతర పవర్ సరిగా లేకపోయిన రావొచ్చు.
కాకపొతే OS ని తిరిగి Install చేసి చూడండి లేదా పై ఫైల్ ని పంపితే ప్రోబ్లెం ఎక్కడ ఉందో చెప్పవచ్చు.

మొబైల్ లో నెట్ కనెక్షన్

నేను నా మొబైల్ లో నెట్ కనెక్షన్ పొందాలనుకుంటున్నాను. దీనిలో నాకు సహాయం చేయగలరా?

మీరు మొబైల్ నుండి ఇంటర్నెట్ బ్రౌస్ చెయ్యలనుకొంటె మీ మొబైల్ లో GPRS ఫీచర్ ఉండాలి. వీటితో పాటు ఇంటెర్నెట్ access చెయ్యడానికి client సాఫ్ట్ వేర్ మీ మొబైల్ లో ఉండాలి. ఈ కనెక్టవిటి తో 172 కిలో బిట్స్ పెర్ సెకండ్ స్పీడ్ వరకు ఇంటర్నెట్ పొందవచ్చు. BSNL, AIRTEL వంటి సంస్థల లో మీరు ఈ సదుపాయం పొందవచ్చు.

ఫోటోషాప్ మరియు కోరల్ డ్రా పనిచేయడానికి హార్డ్ వేర్ కన్ఫిగరేషన్ చేయడం.

నేను పెంటియమ్ IV 3.0 Ghz ఇంటెల్ Original మదర్ బోర్డు, 1GB RAM మరియు 160 GB SATA హార్డ్ డిస్క్, DVD రైటర్ ఉపయోగిస్తున్నాను. నేను Photoshop సాఫ్ట్ వేర్ మరియు CorelDraw ద్వారా డిజైన్లను తయారు చేస్తాను. నా సిస్టం సరిగా పని చేయటంలేదు మరియు కమ్మాండ్ ఎగ్సికుట్ కావడానికి చాలా సమయం వేచి ఉండాల్సిన దుర్బరమైన పరిస్థితి ఏర్పడింది. నేను ఇపుడు ఒక కొత్త కంప్యూటర్ కొనాలని నిర్ణయించుకొన్నాను. ఈ గ్రాఫిక్స్ సాఫ్ట్ వేర్స్ పని చేయడానికి మీరు నాకు మంచి కన్ఫిగరేషన్ ను సలహా ఇవ్వండి.


విండోస్ 2000 మరియు XP అయితే మీ సిస్టెం సరిగానె పని చెయ్యలి విస్టా అయితే మీరు మరో 1GB RAM పెంచుకోవలసి వస్తుంది. మీరు ప్రత్యేకంగా 512 RAM ఉన్న VGA గ్రాఫిక్స్ కార్డ్ వాడితే సరిపోతుంది. లేదంటే, Pentium Core2 Dual processor గాని AMD Dual 64 bit X2 possessor గాని, 2 GB RAM, 384/512 డెడికటెడ్ RAM ఉన్న గ్రాఫిక్స్ కార్డ్ ఉన్న సిస్టెం తీసుకొంటె సరిపోతుంది.

మెయిన్ ఫ్రేమ్స్ అప్లికేషను ప్రోగ్రామింగ్

నేను మెయిన్ ఫ్రేమ్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ యొక్క ఆపేక్షితుడను, నేను మెయిన్ ఫ్రేమ్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లో శిక్షణ కుడా పొందాను. ఇంట్లో మెయిన్ ఫ్రేమ్స్ సాధన చేయాలనుకుంటున్నాను. నా సీనియర్లు కొందరు ఇది ఒక ఖరీదైన విషయం అని నాకు చెప్పారు. వీలైతే దయచేసి నాకు ఇంటి నుండి మెయిన్ ఫ్రేమ్స్ పై పని చేసే విధానం చెప్పండి, తర్వాత దయచేసి నాకు సిస్టమ్ కన్ఫిగరేషన్ ను సూచించండి (హార్డ్ డిస్క్ డ్రైవ్, రామ్, ప్రాసెసర్ వేగం). నేను వెబ్ ద్వారా www.mainframesindia.comఅనే మెయిన్ ఫ్రేమ్స్ కోర్సు (శిక్షణ సి.డి లు) ను అందిస్తున్న వెబ్ సైట్ చూసాను. దానికి రూ. 2000 చెన్నై ఆధారిత బ్యాంకు ఖాతాకు చెల్లించాలని ఉంది. నేను గందరగోళం అయిపోయాను. దయచేసి సలహా ఇవ్వండి.

మీరు పైన పేర్కొన్నmainframes సిములేషన్ సాఫ్ట్ వేర్ కోసమైతే, Pentium IV లేదాPentium D లేదాPentium Core2 duo processor గాని, కనీసం1 GB RAM, Windows XP software ఆపరేటింగ్ సిస్టెంCDROM/DVDROM తో కావాలి. ఇకపోతెఈ సిములేషన్ సాఫ్ట్ వేర్rs.2000.00 రూపాయలకువస్తుందికాబట్టిమీరుబాగాప్రాక్టీస్చెయ్యాలనుకొంటె,మీ బడ్జెట్ లోనె వస్తే కొనుక్కోవచ్చు.

ఉపయుక్తమైన లింక్స్

డౌన్ లోడ్ తెలుగు సాప్ట్ వేర్స్

అక్రోబాట్ రీడర్, విన్ రార్ సాప్ట్ వేర్స్ ను డౌన్ లోడ్ చేసుకోండి

http://www.ildc.in/Telugu/TLindex.aspx

డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా

సాప్ట్ వేర్స్ కు ఎదురుగా ఉన్న డౌన్ లోడ్ అనే పదాన్ని క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి

అక్రోబాట్ రీడర్ ఈ సాప్ట్ వేరును కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత ఫి.ఢి.యఫ్ పైళ్ళను వీక్షీంచవచ్చు
For more details,క్లిక్ చేయండి
విన్ రార్ జిఫ్, రార్, తార్ వంటి ఫైళ్ళు కంప్రెస్ చేయబడి ఉంటాయి. మీరు డౌన్ లోడ్ చేసుకున్న సాప్ట్ వేర్స్ కూడా రార్ లో ఇవ్వబడ్డాయి. వాటిని ఇన్ స్టాల్ చేసుకునే ముందు రార్ సాప్ట్ వేర్స్ ను ఇన్ స్టాల్ చేసుకొని, రార్ ద్వారా మిగతా సాప్ట్ వేర్స్ ను ఎక్స్ ట్రాక్ట్ చేసి, ఇన్ స్టాల్ చేసుకోండి. For more details,క్లిక్ చేయండి
శిక్షణా మాన్యువల్ (తెలుగు )

కీ బోర్డ్ నమూనా

ఫాంట్స్ డౌన్లోడ్
భారతీయ భాషా ఫాంట్స్ (సిడాక్)

ildc.in/

మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ భాషా ఫాంట్స్

bhashaindia

ప్రాంతీయ భాషా వెబ్ సైట్స్

archive.is/content.msn.co.in/Telugu

భారతీయ భాషల కోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి

TDIL

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.10666666667
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు