పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

స్కై 'ఫై'

తీగల ద్వారా కాకుండా ఆకాశం నుంచి నెట్‌ని అందించేందుకు ఇవి కసరత్తు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ అక్విలా అనే విమానాన్ని రూపొందించి దాన్ని విజయవంతంగా ప్రయోగించింది... దాని వివరాలు పూర్తిగా....

ఆకాశం నుంచి భూమిపైకి నెట్‌


ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌లు కలలు కంటున్న ప్రాజెక్ట్‌ అందరికీ ఇంటర్నెట్‌.

ఇందుకోసం ఇవి కొన్ని వేల కోట్లు ఖర్చుపెడుతున్నాయి. తీగల ద్వారా కాకుండా ఆకాశం నుంచి నెట్‌ని అందించేందుకు ఇవి కసరత్తు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ అక్విలా అనే విమానాన్ని రూపొందించి దాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 96 నిమిషాల పాటు ఆకాశం నుంచి భూమిపై ఉన్న పరికరాలకు ఇంటర్నెట్‌ను పంచింది. నెట్‌ అందుబాటులోలేని ప్రాంతాల్లో... ఆకాశంనుంచి లేజర్‌ కిరణాల ద్వారా డేటా అందించేందుకుఫేస్‌బుక్‌ ఈ విమానాన్ని సిద్ధంచేసింది. గూగుల్‌, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ లు లూన్‌, వైట్‌స్పేస్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టాయి.

ఫేస్‌బుక్‌ అక్విలా

 • ఇది ఒక విమానం
 • కార్బన్‌ఫైబర్‌తో తయారు చేశారు
 • సౌరశక్తితో పని చేస్తుంది
 • 5000 వాట్ల శక్తితో నడుస్తుంది
 • 3 నెలలు ఎగురుతుంది
 • దక్షిణాఫ్రికాలో దీన్ని ప్రయోగిస్తారు
 • రెక్కల వెడల్పు బోయింగ్‌ విమానం కన్నా ఎక్కువ
 • దీన్ని కింద నుంచి నియంత్రిస్తారు
 • ఎగరడం..దిగడం స్వయంచాలితం
 • 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది
 • 11 మైళ్ల దూరం వరకు నెట్‌ సేవలు అందిస్తుంది.

మైక్రోసాఫ్ట్‌ వైట్‌ స్పేస్‌

 • ఇది భారత్‌లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో త్వరలో అందుబాటులోకి రానుంది
 • బ్రిటన్‌, అమెరికా, జమైకా, నమీబియా, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌ తదితర దేశాలలోనూ పరీక్షించారు.
 • టీవీ స్పెక్ట్రమ్‌లో రెండు బ్యాండ్ల మధ్య ఉండే స్పేస్‌ ఈ ప్రాజెక్ట్‌లో కీలకం
 • ఈ స్పేస్‌ ద్వారా అన్ని ప్రాంతాలకూ వైఫై ఇస్తారు.
 • ఒక్కో వైఫై స్పాట్‌ పది కిలోమీటర్ల వరకు నెట్‌ను పంచగలదు.

గూగుల్‌ లూన్‌

 • ఇది గూగుల్‌ ప్రాజెక్ట్‌
 • ఆకాశంలోకి బుడగలను పంపి నెట్‌ అందిస్తారు
 • ఈ ప్రాజెక్ట్‌ను భారత్‌లో పరీక్షించారు
 • బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేసేందుకు కసరత్తుమొదలైంది.
 • 20కి.మీ. ఎత్తులో ఉంటాయి
 • వీటిని పాలిథీన్‌ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు
 • 15 మీటర్ల వెడల్పు 12 మీటర్ల పొడవు ఉంటాయి
 • మూడు నెలలు ఉంటుంది.
 • సౌరశక్తితో పని చేస్తుంది. 100 వాట్ల శక్తి అవసరం.
 • ఎల్‌టీఈ (4జీ) సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తుంది
 • ఒక్కో బెలూన్‌ 40 కిలోమీటర్ల వరకు నెట్‌ను పంచగలదు.

ఆధారం - వివిధ వనరుల ఆధారంగా

3.05882352941
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు