పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కవితా సంపుటి

కవితా సంపుటి

ఉపాధ్యాయ మిత్రులూ...- పూదత్తు కృష్ణమోహన్

పల్లవి:            (ఉపాధ్యాయ మిత్రులూ... వెలుగు పంచుదివ్వెలూ...

విజ్ఞానం పంచిపెట్టు - ధీరపుణ్య చరితులూ...) 2

చరణం-1:        అపురూపమైన బాల్యానికి - ఆకృతినీ కల్పించీ

మట్టి ముద్దలన్నిటినీ మూర్తులుగా మలచునట్టి                       ||ఉ||

చరణం-2:       ఆటలతో పాటలతో - అందమైన మాటలతో

అవగాహన కలిగించే అనేక కృత్యాలతో...                               ||ఉ||

చరణం-3:       క్రమశిక్షణ నేర్పిస్తూ - విలువల వికసింపజేస్తే

బాలలలనూ అందరికీ - ఉత్తమ పౌరులుగా మార్చు                 ||ఉ||

చరణం-4:       చిరునవ్వులు చిందిస్తూ - ఉత్తేజం కలిగిస్తూ

లక్ష్యాలను సాధిస్తూ - ప్రవర్తనను మార్చేస్తూ                          ||ఉ||

చరణం-5:       డాక్టరైన యాక్టరైన - పొలిటికల్ లీడరైన

అందరినీ తీర్చిదిద్దు - భావినిర్మాతలూ...                               ||ఉ||

వాచకవైభవం - కటుకోజ్వల మనోహరాచారి

పల్లవి :           తెలంగాణ వెలుగులతో తేజరిల్లె వాచకాలు

గలంయెత్తి పాడుకునే జనజీవన గీతికలు

మన తెలుగుల మధురిమతో... జన పదముల జిలుగులతో...

మన సంస్కృతి మన సాహితి మన చరిత్ర వేదికలై...                 || తెలంగాణ ||

  1. తెలుగంటే తెలంగాణ యాస బాస కాదా?

తేనెలొలుకు తెలుగు భాష తెలంగాణ కాదా...?

జనపదాన ఉద్భవించి పదపదాన విస్తరించి

జనం గళం జయగళమౌ తెలంగాణ జానపదం                              || తెలంగాణ ||

  1. సమైఖ్యాన మరుగున పడిపోయిన మన చరిత్రలు

స్వరాష్ట్రాన వెలుగులోకి తేవడమొక సంకల్పం...

మన కవులు... మన ప్రముఖులు... మన భాషకు పట్టమొచ్చి

ఘన చరితను గన్నవి ఈ నవవసంత, సింగిడీలు...                        || తెలంగాణ ||

  1. భాగవతము పండించిన పోతన వెలసిన క్షేత్రం

దేశీయత కురిపించిన పాల్కురికిది ఈ ప్రాంతం

అగ్నిదార రుద్రవీణ కురిపించిన ధాశరధీ...

కాళోజీ సినారెల కవన ఘనత మన చరిత...                               || తెలంగాణ ||

  1. తెలంగాణ పద సంపద తెలంగాణ పలుకుబళ్లు...

తెలంగాణ సామెతలతో వెలుగు నింపుకున్న

భాష తేనెవంటి తెలుగు భాష తెలంగాణ జనుల శ్వాస

కలగలిపిన కరదీపం... మన ఈ వాచక రూపం...                           || తెలంగాణ ||

ఆధారము : సమగ్ర శిక్ష అభియాన్,వృత్యంతర శిక్షణ కార్యక్రమము 2018 -19 యస్ ఇ ఆర్ టి ,హైదరాబాద్

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు